14, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?




    తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్రావు మానసపుత్రికగా చెప్పుకుంటున్నడబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ పథకం ఆచరణ పక్కన బెట్టి... ఆదిలోనే తీవ్రవిమర్శలకుఅనుమానాలకు కారణమవుతోందిఇటీవలి కాలంలో కేసీఆర్ఎక్కడికి వెళ్లినా పేదలకుమధ్యతరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించిప్రధానంగా ప్రస్తావిస్తున్నారుముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఒకరకంగా డబుల్బెడ్రూమ్ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారుఇప్పటికే పలు కాలనీలు,మురికివాడల్లో గుడిసెలురేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న పేదలు.. ముందయితేతమ ఇళ్లకు పట్టాలు ఇప్పించమంటూ వేడుకుంటున్న వేదన.. అరణ్యరోదనేఅవుతోందికొన్ని సందర్భాల్లో కేసీఆర్ను వివిధ కాలనీల్లో జనం నేరుగా నిలదీసినపరిస్థితులున్నాయిఅయితే వారిపై అసహనం వ్యక్తం చేస్తూనే తెలివిగాసమాధానం దాటవేస్తున్న సీఎం.. డబుల్ బెడ్ రూమ్ ఆశచూపి నిప్పుపై నీళ్లుచలుతున్నారు.
హైదరాబాద్లో ఇళ్లుఅపార్ట్మెంట్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం..అందుకుఅవసరమైన స్థలం ఎక్కడుందన్న విషయాన్ని విస్మరిస్తోందిత్వరలోజీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్ర రాజధానిలో పాగా వేయడంపైనేపూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్న కేసీఆర్.. ఓటర్లను ఆకర్షించేందుకే  ప్రకటననుచేస్తున్నారన్న వాదనలో అతిశయమేమీ లేదుఅయితేఇదే సమయంలోఅనుకున్నంత వేగంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు పూర్తి కావన్న వాస్తవమూగుర్తెరిగిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఓయూ భూము ప్రతిపాదనను తెరపైకితెచ్చారని తొస్తోందిఫలితంగా అంశాన్ని పక్కదారి పట్టించొచ్చన్నది టీఆర్ఎస్ బాస్ఆలోచనగా చెబుతున్నారు.  ఓయూ విద్యార్థుల శక్తి యుక్తులేమిటన్నదికేసీఆర్కు తెలియనివి కాదు... తెంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో ఉస్మానియాయూనివర్సిటీ పాత్రే కీలకమన్నది కూడా జగమెరిగిన సత్యం ప్రకటనవివాదాస్పదమవుతుందని తెలిసీ కేసీఆర్  ఆలోచనకు పదును పెట్టారు.మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి గట్టెక్కేదాకా... డబుల్బెడ్రూమ్పథకాన్ని కొంతకాలం అటకెక్కించేందుకు  తరహా వ్యూహం పన్నారని తొస్తోంది.అందుకే.. యూనివర్సిటీకి అంత స్థలమెందుకని బహిరంగంగా ప్రకటించివిద్యార్థులను మరింత రెచ్చగొట్టాలని భావిస్తున్నారు.
కేసీఆర్ ముందస్తు వ్యూహమోవిద్యార్థుల ఆగ్రహ జ్వాలో కానీ... తేనెతుట్టెకదిపినట్లయ్యిందితమ మౌనాన్ని చేతగాని తనంగా భావిస్తున్నారంటూ విద్యార్థిలోకం కదం తొక్కిందిచారిత్రాత్మక యూనివర్సిటీ స్థలాను వదులుకునేదే లేదనితెగేసి చెప్పారు విద్యార్థులుఇప్పటిదాకా ఆక్రమణకు గురైన స్థలాలను కూడావదలబోమని స్పష్టం చేశారుఉస్మానియా యూనివర్సిటీ స్థలాలనుఆక్రమించినట్లు ఆరోపణలున్న  టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన హోటల్పైనా,మరో పెట్రోల్ బంకుపైనా ఓయూ విద్యార్థులు దాడులు చేశారుఫర్నీచర్ ధ్వంసంచేశారుఓయూ భూమిని అంగుళం కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.విద్యార్థుల ఆగ్రహానికి పోలీసులు రంగంలోకి దిగి బవంతంగా అరెస్టు చేయాల్సినపరిస్థితి నెలకొంది.
 మరోవైపు... ఓయూ భూముల రగడ అటు రాజకీయంగానూ దుమారం లేపింది.కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనిరాచరిక పాలనను గుర్తుకుతెస్తున్నారంటూ ఇటు ప్రతిపక్షలు అటు ప్రజాసంఘాలు ముక్త కంఠంతోవిమర్శించాయికేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశాయి.అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్యార్థులజోలికెళ్లొద్దంటూ సుతిమెత్తగా తెంగాణ సీఎంను హెచ్చరించారంటే కేసీఆర్ దూకుడు స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చుఎట్టకేలకు నాయిని నర్సింహారెడ్డివిశ్వవిద్యాలయ భూముల జోలికి రాము అని ప్రకటించారుఇది తాత్కాలికమా?

- హంసిని సహస్ర సాత్విక

(లోకహితం మాసపత్రికలో ప్రచురితం)

22, జూన్ 2015, సోమవారం

విశ్వ'యోగా' భవ


  • మీ ఆరోగ్యం బాగుపడాలంటే యోగా చేయండి - ఒక డాక్టర్‌ సూచన...
  • మీ మనసు స్థిమితంగా ఉండాలంటే యోగ సాధన చేయండి - ఒక సైకాలజిస్ట్‌ సలహా...
  • మీరు అందంగా ఉండాలనుకుంటున్నారా? మంచి శరీరాకృతి కావాలనుకుంటున్నారా... అయితే యోగా చేయండి - ఒక బ్యుటీషియన్‌ సమాధానం...
  • మీ కంపెనీలో ఉద్యోగులు చక్కగా, సమర్థంగా పని చేయాలంటే వారికి యోగా నేర్పించండి - ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి మాట...
  • మీ విద్యాసంస్థలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే వారికి యోగ నేర్పించండి - ఒక ఉన్నత విద్యా నిపుణుడి సూచన...
  • మీరు మీ ఆటలో ఏకాగ్రతతో ఉంటూ విజయం సాధించాలంటే యోగ సాధన ఒక్కటే మార్గం - క్రీడాకారులకు ఒక కోచ్‌ హెచ్చరిక...



ఇలా ఆరోగ్యానికి, అందానికి, సంపాదనకు, విద్యకు అన్ని వర్గాల వారికి నేడు యోగ అవసరమైంది. అందరూ యోగ చేయమంటున్నారు. ఏదైనా పని సమర్థంగా జరగాలన్నా, ఎవరైనా వారి వారి పనులలో నిపుణు లవ్వాలన్నా యోగను ఆశ్రయిస్తున్నారు. ఇన్ని రకాలుగా నేడు యోగ ప్రాచుర్యం పొందింది.
అసలు యోగ అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? ఎవరు కనిపెట్టారు? ఎక్కడ ఆవిర్భవించింది? ఈ యోగ చేయడం వలన అంత శక్తి ఎందుకు వస్తుంది? వంటి ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలంటే మనం కూడా యోగ సాధన చేయాల్సిందే.
యోగ అంటే ఏమిటి?
యోగ అనేది మనిషి మనుగడలో ఒక భాగం. మనిషిని వత్తిడి నుంచి దూరం చేసి, శరీరానికి విశ్రాంతి నిచ్చి, మనస్సును స్థిరం చేసే ఒక ప్రక్రియ. వత్తిడికి గురైతే వ్యవస్థలు సక్రమంగా పనిచేయక శరీరం రోగమయం అవుతుంది. శరీరం రోగమయం అయితే మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు ఏ పనిమీద మనసు లగ్నం చేయలేక, ఏ పనిలోను నైపుణ్యం సాధించలేక వెనుకబడిపోతాం. కొంతమంది దురలవాట్లకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వీటన్నింటికి విరుగుడు యోగ సాధన.
యోగ ఎక్కడ పుట్టింది? దీనికి కర్త ఎవరు?
యోగ భారతీయుల మానసపుత్రిక. భారతీయుల జీవన విధానం. ప్రపంచానికి మనమిచ్చిన ఒక వరం. ప్రాచీనకాలం నుండి మనదేశంలో విలసిల్లింది. పతంజలి మహర్షి యోగకు కర్త అని చెబుతారు. ఎందుకంటే పతంజలి మహర్షి అంతకుముందే ఉన్న యోగ సూత్రాలను ఒక క్రమపద్ధతిలో కూర్చి, సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో భాష్యాలను వ్రాసి, దానికి ఒక క్రియను ఏర్పరచారు.
యోగ సాధన అంటే ఏం చేయాలి ?
‘యోగ’ నిజానికి ‘అష్టాంగ యోగ’ నుండి వచ్చింది. ఈ అష్టాంగ యోగలో 8 రకాల విభాగాలు, అభ్యాసాలు ఉన్నాయి. వీటిని విభాగాలు అనటం కన్నా ‘స్థాయి’ (మెట్లు) అనటం బాగుంటుంది. ఒక్కొక్క స్థాయి యోగసాధకుడిని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళుతుంది. యోగ సాధకుడు పైస్థాయికి చేరుకున్నప్పుడు సాక్షాత్తూ పరమపదాన్ని చేరుకున్నట్లే.
అష్టాంగ యోగ 
  1. యమ : అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ ఐదు కలిగినట్టిది యమ. యోగసాధకుడు అనుసరించవలసిన మొదటిమెట్టు ఇది.
  2. నియమ : శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిదానము. ఇది రెండవ మెట్టు. అంటే యోగసాధకుడు మొదట తన మనస్సును అదుపులో పెట్టుకోవాలని అర్థం. అంటే యమ, నియమాలను పాటించాలి.
  3. ఆసన : ఇది శారీరిక క్రియ. దీనిలో ఆసనాలు అభ్యాసం చేయాలి. నిలుచుని, కూర్చుని, వెల్లకిలా పడుకొని, బోర్లా పడుకొని ఇలా అనేక స్థితుల్లో చేసే 100 రకాల ఆసనాలను పతంజలి మహర్షి చెప్పారు. వీటిలో నుంచి నిత్యం అభ్యాసం చేయడానికి కొన్ని ఆసనాలను కలిపి ‘సూర్యనమస్కారాలు’ అనే క్రియ తయారైంది. ఆసన ప్రక్రియనే హఠయోగ అని కూడా అంటారు. కేవలం ఈ హఠయోగ సాధన నిత్యం చేసే మానవుడు 200 సంవత్సరాలపాటు ఎటువంటి రోగాలు లేకుండా జీవించగలడని స్వామి వివేకానంద చెప్పారు. ఆసన అభ్యాసం వలన అనేక రోగాలు తగ్గుముఖం పడతాయి.
  4. ప్రాణాయామం : ఇది శ్వాసకు సంబంధించిన ఉచ్చ్వాస, నిశ్వాసల ప్రక్రియ. మన శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడమే ఈ ప్రాణాయామ ఉద్దేశ్యం. ప్రాణాయామం కూడా అనేక రోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ ఆసన ప్రాణాయామాలు శరీరానికి బలం చేకూర్చుతాయి. యోగ సాధకునికి ఇవి మూడు, నాల్గవ మెట్లు.
  5. ప్రత్యాహార : ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. ఆరోగ్యంగా ఉన్న మానవుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలడు. ఇది ఐదవ మెట్టు.
  6. ధారణ : మనస్సును స్థిరపరచడం. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొన్నవారికి మనస్సు స్థిరమవుతుంది. ఇది ఆరవ మెట్టు.
  7. ధ్యాన : మనస్సును ఒక బిందువుపై లగ్నం చేయడం. దీనినే ధ్యానం అంటారు. ఇది ఏడవ మెట్టు.
  8. సమాధి : పై ఏడు స్థితులలోను (మెట్లు) అంతరాయం లేకుండా ఉన్న యోగసాధకునికి ఈ ఎనిమిదవ స్థితి సాధ్యమవుతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళడమంటే యోగసాధకునికి ఇది పరాకాష్ట అవుతుంది. అంటే ఇదే ఆధ్యాత్మిక సాధనలో చివరిమెట్టు. ఇది మనసును నిశ్చల స్థితిలోకి తీసుకెళ్ళి మనిషిని తన బాహ్య స్పృహ కోల్పోయేటట్లు చేస్తుంది. ఇదే పరమపద స్థితి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనిషిలోని జ్ఞాన చక్షువు తెరచుకుంటుంది. సహస్రారం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో మానవుడు తాను ఎక్కడ నుంచి వచ్చినదీ, ఎక్కడికి పోతున్నదీ, ఆత్మ, పరమాత్మ, దైవం ఇత్యాది ఆధ్యాత్మిక విషయాలన్నీ అతనికి అవగతమౌతాయి. దీనినే నిశ్చల స్థితి అనీ, నిర్వికార స్థితి అనీ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవునికి దైవత్వం సిద్ధించినట్లే.
ఈ 8 అంగములతో కూడినది అష్టాంగ యోగ. ఈనాడు అందరూ పై 8 అంగాలలోని ఆసన్‌, ప్రాణాయామం, ధ్యానం వంటి మూడిరటిని మాత్రమే చేస్తూ కేవలం ఇదే యోగ అని భావిస్తుంటారు. ఇవి కేవలం బాహ్య క్రియలు మాత్రమే. వీటికి అంతరక్రియలైన మిగతావి తోడైతే యోగసాధకుడు పరిపూర్ణుడవుతాడు.
చరిత్రలో సంధికాలం
ఇంత మహత్తరమైన యోగ విద్యను ప్రాచీనకాలం నుండి మన గురుకులాల ద్వారా ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి గురువులు నేర్పేవారు. ఆధునిక యుగం 7వ శతాబ్దం తరువాత విదేశీయుల దండయాత్రల వలన భారతదేశ చరిత్రలో వచ్చిన విపరిణామాలతో యోగకు ప్రాధాన్యం తగ్గింది. మనిషి ప్రాణానికే భద్రత కరువైంది. బ్రిటిష్‌వారి రాకతో, వారి కుట్రలతో, కుతంత్రాలతో, మెకాలే విద్యావిధానంతో మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ విద్య మరుగున పడిరది. దానితో యోగవిద్య కూడా కొందరికే పరిమితమైంది. సంస్కారాలకు సంధికాలం ఏర్పడిరది. దానితో ప్రపంచమే శాంతికి దూరమైంది.
మళ్ళీ పూర్వ వైభవం


భారతదేశం స్వతంత్రమైన తరువాత మరల యోగకు ప్రాధాన్యం ఏర్పడిరది. యోగవిద్య అందరికి చేరువలోకి వచ్చింది. భారతీయుల మానస పుత్రిక నేడు ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు
యోగకు ప్రపంచ సమర్ధన కూడా లభించింది. ప్రధాని నరేంద్రమోది సెప్టెంబరు 27, 2014న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ యోగ విశిష్టతను తెలియపరచి అంతర్జాతీయ యోగ దినం జరుపవలసిన ఆవశ్యకతను విపులీకరించారు. ఆ సూచనను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. జూన్‌ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవంగా 170 సభ్యదేశాల ఆమోదంతో ప్రకటించింది.
ఇటువంటి మహత్తర సమయంలో భారతీయుల మానస పుత్రిక యోగకు పూర్వవైభవం తేవాలంటే దీనిని అందరం సాధన చేయాలి. యోగ సాధన వలన పోయేదేముంది, అనారోగ్యం, విచారం, ఈతిబాధలు తప్ప. కాబట్టి భారతీయులారా, లేవండి, యోగ సాధన చేయండి. జూన్‌ 21 నాడు ప్రతి ఇంటినుండి, ప్రతి వీథి నుండి, ప్రతి పాఠశాల నుండి, కళాశాల నుండి, ప్రతి ఒక్కరూ యోగసాధన చేయండి. ఆ రోజున ప్రపంచానికి మన యోగ అంటే చూపించండి. విజయోస్తు.
జై యోగ దివస్‌..! జై భారత్‌..!
- సూర్యతేజ

27, ఏప్రిల్ 2015, సోమవారం

ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!

 
 
 
ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన, అనూహ్యమైన వాదన అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది. అసలు హిందూమతాన్నే అంతం చేస్తామంటూ ప్రతిన బూనుతున్న ఇస్లాం మతస్తుల తొలిప్రవక్త శివుడే అన్న ప్రకటన ఆ మతోన్మాదులకు ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. ఆ ప్రకటన చేసింది ఇస్లాం వ్యతిరేకులో, హిందూ మతపెద్దలో కాదు. జమైతే ఉలేమా అధిపతి, మతగురువు అయిన ముఫ్తీ మహమ్మద్ ఇల్యాస్.
 
సనాతన ధర్మాన్ని పాటించే ముస్లింలు శివపార్వతులను తమ సృష్టికర్తలుగా భావించడానికి సందేహించకూడదని కూడా ఇల్యాస్ సూచించారు. రామజన్మభూమి అయోధ్య వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఫ్తీ మహమ్మద్ ఇల్యాస్ వ్యాఖ్యలను మిగతా మతగురువులు జీర్ణించుకోకపోగా.. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని తేలిగ్గా తీసుకొన్నప్పటికి ఇల్యాస్ వ్యాఖ్యలు చాలా దేశాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
   

ముఫ్తీ మహమ్మద్ ఇల్యాస్ వ్యాఖ్యలు అక్షరసత్యాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమర్థించారు. ఖురాన్ కన్నా వేదాలే ముందు పుట్టాయని, భారతావనికి అవి పురాతన శాసనాలని, వేదాలను ప్రపంచం మొత్తం గౌరవిస్తోందని గుర్తు చేశారు. ఇల్యాస్ ఇరుమతాల మధ్య సోదరభావం చాటిచెప్పే ఉదాహరణను చెప్పారంటూ ప్రశంసించారు. 
 
మతగురువు ఇల్యాస్ చేసిన వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే... వాస్తవ పరిస్థితులు, సంప్రదాయాలు, సంస్కృతులను అధ్యయనం చేస్తే, ఆయన వాదన నూటికి నూరుపాళ్ళూ నిజమేనన్న విషయం బోధపడుతుంది. నిజానికి ఇస్లాం మతం పుట్టి 1400 సంవత్సరాలు అయ్యింది. అలాగే క్రైస్తవ మతం పుట్టి 2వేల సంవత్సరాలు పైగా అయ్యింది. అంతకుముందు ప్రపంచంలో ఉన్న ఆరాధనా పద్ధతులను ఏదో ఒకరూపంలో ఈ మత ప్రవక్తలు స్వీకరించి ఉంటారు. క్రమంగా ఆ పురాతన ఆరాధనా పద్ధతులు, సంస్కృతులను నాశనం చేసేందుకు ఇప్పుడున్న వాళ్ళు సంకల్పిస్తున్నారు. ఇక ఇస్లాం విషయానికి వస్తే ఆ మతం పుట్టకముందు ఇరాన్ లో పర్షియన్స్ ఎక్కువగా ఉండేవారు. పర్షియన్ మతగ్రంథం 'జెండ్ అవెస్థా'. మన హిందూ మతానికి చెందిన ఋగ్వేదానికి సామీప్యంగా ఉంటుంది. 
 
ఖాబాలో ఉన్న ఆలయంలో ముస్లింలు ఇప్పటికి శివుడిని ఆరాధిస్తారు. అక్కడి పద్ధతులన్నీ హిందూసంప్రదాయం మాదిరిగానే ఉంటాయి. శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. హిందువుల మాదిరిగానే మొక్కులు తీర్చుకునేందుకు ముస్లింలు కూడా ఆ ఆలయం దగ్గర తలనీలాలు సమర్పించుకుంటారు. హిందూ బ్రాహ్మణులు జంధ్యం ధరించినట్లుగానే ఆ ఆలయంలోకి వెళ్ళే ముస్లింలు ఖచ్చితంగా ఓ తెల్లపంచె జంధ్యం మాదిరిగా కట్టుకుంటారు. ప్యాంటుకు బదులు తెల్లని పంచె కట్టుకుంటారు.
 
ఈ ఉదాహరణలు చాలు, ఇస్లాం మతానికి మూలం శైవం అని చెప్పడానికి. ప్రకృతిని ఆరాధించడమంటే శివుడిని ఆరాధించడమే. ఈ సృష్టికి మూలం శివుడే అన్న విషయాన్ని గుర్తించిన ఇస్లాం గురువు ఇల్యాస్.. ఆ మతస్తులకు ఓ మార్గం చూపించినట్లుగా చెప్పవచ్చు. మతోన్మాదులుగా మారిన, మారుతున్న వాళ్ళ ఆలోచనల్లో మార్పు తెచ్చేవిగా ఉన్నట్లు భావించవచ్చు. 
 
- హంసినీ సహస్ర