16, సెప్టెంబర్ 2015, బుధవారం

ఇంకెన్నాళ్లీ విద్వేషాలు?

తెలుగువారికి రెండు రాష్ట్రాలు,  ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న సంతోషం  ఇంకాయేడాది కూడా కాలేదు. రెండు ప్రభుత్వాల వైఖరి పోటాపోటీ వ్యూహాలు,అంతకుమించి కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడి వేస్తేభగ్గుమనే పరిస్థితి నెలకొంది. నిజానికి పార్టీ పరంగా చూస్తే టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్యేఅధిపత్య పోరు కాగా... తెంగాణలో టీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోఉండటంతో ఈ వ్యవహారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటంలాతయారైంది. ఫలితంగా ఎవరి అనుకూల ప్రకటనలు వారు చేసుకుంటున్నారు.అధికారులను అడ్డుపెట్టుకొని రాజకీయ వికృత క్రీడ సాగిస్తున్నారు. మొత్తానికి ఈవ్యవహారం తెలుగు ప్రజల మనోభావాల మధ్య చిచ్చు పెట్టేదిగా ముందుకుసాగుతోంది.
విభజన జరిగినప్పటినుంచీ పంపకాలు, కేటాయింపుల్లో ఏ మాత్రం సర్దుబాటుధోరణి వ్యక్తం చేయని ప్రభుత్వాలు.. వీలైనప్పుడల్లా కయ్యానికే కాలుదువ్వుతున్నాయి. పైగా ఆ అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా, ఆత్మగౌరవసమస్యుగా చిత్రీకరిస్తూ ప్రజలకు కూడా ఇందులో  పాత్ర కల్పించేందుకుపాలకులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వాగ్బాణాలు వదలడం... ఢల్లీలో వెళ్లి కేంద్రంసమక్షంలో చర్చలంటూ పట్టుబట్టడం యేడాది కాలంగా సర్వసాధారణంగామారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, పంపకాలు, కేటాయింపుసామరస్యపూర్వకంగా... ఉమ్మడి అభిప్రాయాలను  గౌరవిస్తూ  పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండగా... నాయకులు మాత్రం ‘ఎవరికి వారే... యమునాతీరే’ అన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా తెలుగు ప్రజల మధ్య ఒక లోతైనఅగాధం ఏర్పడుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుతో ఇరు రాష్ట్రప్రభుత్వాల వ్యవహారశైలి రచ్చకెక్కింది. ఆ కేసులో రేవంత్‌రెడ్డి  ప్రత్యక్షంగా పట్టుబడగా... ఏపీ సీఎం  చంద్రబాబు  నాయుడు  వెనుక ఉండి నడిపించారంటూతెలంగాణ ప్రభుత్వం ప్రచారం  చేసింది.  చంద్రబాబు  గొంతుగా చెబుతున్నఆడియో టేపునూ బయటపెట్టింది. ఏకంగా  ముఖ్యమంత్రే లక్ష్యంగా పక్క  రాష్ట్రప్రభుత్వం పావులు కదపడాన్ని... ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తీవ్రంగా పరిగణించింది.పోటీగా ఏపీలో కేసీఆర్‌పై ఆయా సందర్భాల్లో నమోదైన 87 కేసులనుతవ్వితీసింది. అంతేకాదు... ఆ కేసులను ఆగమేఘాల మీద సీఐడీకిఅప్పగించింది కూడా. తమకు ఏదైనా హాని తలపెడితే.. తామేంటో చూపిస్తామన్నస్థాయిలో కౌంటర్‌ ఇచ్చేందుకు మానసికంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కేసులో తెంగాణ ప్రభుత్వంనోటీసులు ఇవ్వబోతుందన్న ప్రచారంతో రెండుమూడు రోజులు హైదరాబాద్‌లో తీవ్రఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. అటు.. ఆత్మరక్షణలో బడ్డ టీడీపీపార్టీతోపాటు... సీఎంకు రక్షణగా, మంత్రులకు రక్షణగా ఏపీ ప్రభుత్వం తమబలగాలను దింపింది. మంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.ఇంకా నిత్యం విమర్శ ల జోరు కొనసాగుతూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రగడతో మీడియా కూడా రెండుగా చీలిన సందర్భంగోచరిస్తోంది. పత్రికలు తిరగేసినా..  టీవీ  చూసినా... ఎందులో  వచ్చింది వాస్తవమో,  దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక సాధారణ పాఠకులు,ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారు. తెలంగాణ అనుకూల పత్రికల్లోవస్తున్న వార్తలు, ఆంధ్రప్రదేశ్‌ అనుకూల మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లోతేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చివరకు సెక్షన్‌`8 విషయంలో కేంద్రాన్నీమధ్యలోకి దింపింది. ఓ వర్గం మీడియా. ఒకే వార్త రెండు భిన్న పత్రికల్లో రెండువిభిన్న పార్శ్వాల్లో వస్తుండటంతో ఏది వాస్తవమో   తెలియక   జనం  జుట్టుపీక్కుంటున్నారు. మీడియాలో వస్తున్న గందరగోళ సమాచారానికి ముగింపుపలికేలా... కేంద్రం జోక్యం  చేసుకోవాని  ఎవరికి   వారు అంటున్నారు. కేంద్రంప్రత్యక్ష జోక్యానికి సిద్ధంగా లేదు.
రాష్ట్రం విడిపోక ముందు రాజకీయపార్టీలు ప్రజలను ఎలా పావుగావాడుకున్నాయో.. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా వాటి వ్యవహారశైలిఅలాగే కొనసాగుతున్నదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యంనెలకొనాలని ఆశిద్దాం. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఐకమత్య భావనపెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.
- హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మాసపత్రిక June-15లో ప్రచురితం)

14, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?




    తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మానసపుత్రికగా చెప్పుకుంటున్నడబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్స్‌ పథకం ఆచరణ పక్కన బెట్టి... ఆదిలోనే తీవ్రవిమర్శలకు, అనుమానాలకు కారణమవుతోంది. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ఎక్కడికి వెళ్లినా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించిప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిధిలో ఒకరకంగా డబుల్‌బెడ్‌రూమ్‌ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పటికే పలు కాలనీలు,మురికివాడల్లో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న పేదలు.. ముందయితేతమ ఇళ్లకు పట్టాలు ఇప్పించమంటూ వేడుకుంటున్న వేదన.. అరణ్యరోదనేఅవుతోంది. కొన్ని సందర్భాల్లో కేసీఆర్‌ను వివిధ కాలనీల్లో జనం నేరుగా నిలదీసినపరిస్థితులున్నాయి. అయితే వారిపై అసహనం వ్యక్తం చేస్తూనే తెలివిగాసమాధానం దాటవేస్తున్న సీఎం.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఆశచూపి నిప్పుపై నీళ్లుచలుతున్నారు.
హైదరాబాద్‌లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం..అందుకుఅవసరమైన స్థలం ఎక్కడుందన్న విషయాన్ని విస్మరిస్తోంది. త్వరలోజీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్ర రాజధానిలో పాగా వేయడంపైనేపూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్న కేసీఆర్‌.. ఓటర్లను ఆకర్షించేందుకే ఈ ప్రకటననుచేస్తున్నారన్న వాదనలో అతిశయమేమీ లేదు. అయితే. ఇదే సమయంలోఅనుకున్నంత వేగంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్లు పూర్తి కావన్న వాస్తవమూగుర్తెరిగిన కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ఓయూ భూము ప్రతిపాదనను తెరపైకితెచ్చారని తొస్తోంది. ఫలితంగా అంశాన్ని పక్కదారి పట్టించొచ్చన్నది టీఆర్‌ఎస్‌ బాస్‌ఆలోచనగా చెబుతున్నారు.  ఓయూ విద్యార్థుల శక్తి యుక్తులేమిటన్నదికేసీఆర్‌కు తెలియనివి కాదు... తెంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో ఉస్మానియాయూనివర్సిటీ పాత్రే కీలకమన్నది కూడా జగమెరిగిన సత్యం. ఈ ప్రకటనవివాదాస్పదమవుతుందని తెలిసీ కేసీఆర్‌ ఈ ఆలోచనకు పదును పెట్టారు.మొత్తానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి గట్టెక్కేదాకా... డబుల్‌బెడ్‌రూమ్‌పథకాన్ని కొంతకాలం అటకెక్కించేందుకు ఈ తరహా వ్యూహం పన్నారని తొస్తోంది.అందుకే.. యూనివర్సిటీకి అంత స్థలమెందుకని బహిరంగంగా ప్రకటించివిద్యార్థులను మరింత రెచ్చగొట్టాలని భావిస్తున్నారు.
కేసీఆర్‌ ముందస్తు వ్యూహమో, విద్యార్థుల ఆగ్రహ జ్వాలో కానీ... తేనెతుట్టెకదిపినట్లయ్యింది. తమ మౌనాన్ని చేతగాని తనంగా భావిస్తున్నారంటూ విద్యార్థిలోకం కదం తొక్కింది. చారిత్రాత్మక యూనివర్సిటీ స్థలాను వదులుకునేదే లేదనితెగేసి చెప్పారు విద్యార్థులు. ఇప్పటిదాకా ఆక్రమణకు గురైన స్థలాలను కూడావదలబోమని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాలనుఆక్రమించినట్లు ఆరోపణలున్న ఓ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన హోటల్‌పైనా,మరో పెట్రోల్‌ బంకుపైనా ఓయూ విద్యార్థులు దాడులు చేశారు. ఫర్నీచర్‌ ధ్వంసంచేశారు. ఓయూ భూమిని అంగుళం కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.విద్యార్థుల ఆగ్రహానికి పోలీసులు రంగంలోకి దిగి బవంతంగా అరెస్టు చేయాల్సినపరిస్థితి నెలకొంది.
 మరోవైపు... ఓయూ భూముల రగడ అటు రాజకీయంగానూ దుమారం లేపింది.కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని, రాచరిక పాలనను గుర్తుకుతెస్తున్నారంటూ ఇటు ప్రతిపక్షలు అటు ప్రజాసంఘాలు ముక్త కంఠంతోవిమర్శించాయి. కేసీఆర్‌ ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు జారీచేశాయి.అంతేకాదు... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్యార్థులజోలికెళ్లొద్దంటూ సుతిమెత్తగా తెంగాణ సీఎంను హెచ్చరించారంటే కేసీఆర్‌ దూకుడుఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు నాయిని నర్సింహారెడ్డివిశ్వవిద్యాలయ భూముల జోలికి రాము అని ప్రకటించారు. ఇది తాత్కాలికమా?

- హంసిని సహస్ర సాత్విక

(లోకహితం మాసపత్రికలో ప్రచురితం)