17, ఫిబ్రవరి 2014, సోమవారం

ఢిల్లీలో మోహరించిన విభజన, సమైక్య వాదులు





           తెలంగాణ కల సాకారమవుతోందన్న ఆనందం ఆప్రాంత నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విభజన ప్రక్రియ కీలక దశకు చేరడంతో  ఢిల్లీ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే.. హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్‌ కొత్త అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు హైదరాబాద్ ను యూటీ చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ వెల్లడించారు. ఇదే అంశంపై తనతో జైరామ్ రమేష్ చర్చలు జరిపినట్లు కేసీఆర్ తమ పార్టీ నేతలు, జేఏసీ నేతలతో చెప్పారు. తెలంగాణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతుందని.. అలాగే ఆమోదం కూడా పొందుతుందని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ విలీనంపై కూడా చర్చలు జరుగుతున్నాయన్న కేసీఆర్‌.. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ ఇస్తే దేనికైనా సిద్ధమని కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు చెప్పానన్నారు.

           అటు.. రాష్ట్ర విభజన వద్దంటూ ఢిల్లీలో మహాధర్నా చేపట్టిన ఏపీ ఎన్జీవోలు రాంలీలా మైదాన్‌లో మకాం వేశారు. రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకొని తీరతామని మహాధర్నాకు వచ్చిన నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక లగడపాటి రాజగోపాల్‌ వేదికపై మాట్లాడలేక కన్నీరు పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఏపీఎన్జీవో నాయకుడు గుండెపోటుతో మరణించాడు.

           ఇక.. ఏపీ భవన్‌ మాత్రం ఇరుప్రాంతాల నేతల మోహరింపుతో గంభీరంగా మారింది. ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఆలోచనలకు పదును పెడుతున్నారు. అయితే.. ఏం జరుగుతుందనేది ఇవాళ మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా క్షణక్షణం ఉత్కంఠ. ఉద్వేగ భరితమే... 

నేడు లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014 ఆమోదం!






             ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం ఫలించే కల ఆఖరి అంకానికి చేరింది. తెలంగాణ బిల్లుకు నేడే ఆమోదం వేసే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు కాంగ్రెస్‌,  బీజేపీ మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. చర్చ లేదా మూజువాణి ఓటుతో బిల్లును గట్టెక్కించేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఇవాళ లోక్‌సభలో చేపట్టనున్న సభా కార్యక్రమాల్లో 41వ అంశంగా తెలంగాణను చేర్చారు. పునర్విభజన విధానాన్ని వివరిస్తూ 6 పేజీల బులెటిన్ ను.. లోక్ సభ సచివాలయం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై చర్చించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే సభను కోరతారు. ప్రభుత్వం తరపున యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. వీలైనంతవరకు చర్చ జరిపి ఆమోదించేందుకు ప్రయత్నిస్తారు. అది కుదరకపోతే మూజువాణి ఓటుతోనైనా విభజన బిల్లును  ఆమోదించాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఓటింగ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ లోక్‌సభలో ఆమోద ప్రక్రియ పూర్తికాగానే.. బుధవారం లేదా గురువారం రాజ్యసభలోనూ విభజన బిల్లును గట్టెక్కించాలన్న నిర్ణయానికి వచ్చారు. బిల్లుకు బీజేపీ సహకారం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు భరోసాతో ఉన్నారు. మరోవైపు.. వచ్చే వారం రోజులు ఎంపీలు తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

రైల్వే బడ్జెట్‌ 2014-15 హైలైట్స్‌



కేంద్ర రైల్వే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ తూతూమంత్రంగా సాగింది. తెలంగాణ విభజన బిల్లు నేపథ్యంలో నిరసనల మధ్యే మంత్రి మల్లికార్జున ఖర్గే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేవలం పది నిమిషాల్లోనే ఖర్గే బడ్జెట్‌ ప్రసంగం ముగించారు. సీమాంధ్ర ఎంపీలు నిరసనలు ఉధృతం చేయడంతో 2014-15 రైల్వే బడ్జెట్‌ను సభ పరిశశలనకు ఉంచుతున్నామని, అనుబంధ డిమాండ్లకు సంబంధించి పత్రాలకు సభకు సమర్పిస్తున్నామని తెలుపుతూ ఖర్గే బడ్జెట్ ప్రసంగాన్ని అర్దాంతరంగా ముగించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగు నెలలకు సరిపడా బడ్జెట్‌ను ఖర్గే సభలో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల క్రితం రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు ఇది తొలి బడ్జెట్ ప్రసంగం.

సాధారణంగా రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో దేశమంతా ఉత్కంఠ, ఆసక్తికర పరిస్థితులు నెలకొంటాయి. అయితే.. కొద్దిరోజులుగా తెలంగాణ బిల్లుపైనే పార్లమెంటు వ్యవహారం మొత్తం కేంద్రీకృతం కావడంతో.. రైల్వే బడ్జెట్‌పై ఎవరూ అంతగా దృష్టి పెట్టలేదు. మీడియా కూడా అంతగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. రైల్వే బడ్జెట్‌ కన్నా.. తెలంగాణ, సీమాంధ్ర నిరసనలపైనే దృష్టి సారించినట్లు తేటతెల్లమైంది. *


ªÃ³ÄZ-EÂË éª¢œ¿¢ÅŒ®¾Õh© éªj@ÁÙx  
* ÂÃ*-’¹Ö-œ¿Ð-A-ª½Õ-X¾A
* ÂÃ*-’¹Ö-œ¿Ð-’¹Õ¢-{Öª½Õ  


Ÿ¿-ÂË~º «ÕŸµ¿u éªj©äy ÊÕ¢* „ç@ìxN...
--------------------------------------
* -£¾Ç÷-ªÃÐ-§ŒÕ-¬Áy¢ÅŒ-X¾Üªý \®Ô ‡Âúq“åX®ý.. «§ŒÖ ¦µ¼Õ-«-¯ä-¬Áyªý, ’¹Öœ¿Öª½Õ, ÂÚü-¤Ä-œË(-“X¾A ªîW)
* -„Ã-ª½-ºÇ-®ÏÐ-„çÕi-®¾Öªý ‡Âúq“åX®ý.. «§ŒÖ „ÜË, ŸÄ„âœþ („êÃEÂË éª¢œ¿Õ ªîV©Õ)
* -«á¢¦ãjÐ-Íç-¯çjo ‡Âúq“åX®ý.. «§ŒÖ X¾Ûºã, ’¹Õ©sªÃ_, „ÜË(-ªî-W)
* -«Õ-¯Ão-ª½Õ_œËÐ-èð-Ÿþ-X¾Üªý ‡Âúq“åX®ý. «§ŒÖ èãj-X¾Ü-ªý(-ªî-W)
 
“XÔ-NÕ-§ŒÕ¢ éªj@ÁÙx...
-----------------
* -¤Ä-šÇoЦ㢒¹-@ÁÚ-ª½Õ ‡Âúq“åX®ý.. «§ŒÖ „çÖX¶¾Õ-©ü-®¾-ªÃ§ýÕ, «ÖºË-Âú-X¾Üªý, ¯Ã’ûX¾Üªý (ªîW)
* -§ŒÕ-¬Áy¢ÅŒ-X¾Ü-ªýÐ-ÂÓšÇ ‡Âúq“åX®ý.. «§ŒÖ ’¹Õ©sªÃ_, ÂÃ*’¹Öœ¿, ¯Ã’ûX¾Üªý, ÊÖœµËMx (ªîW)
* -§ŒÕ-¬Áy¢ÅŒ-X¾ÜªýÐèãj-X¾Üªý \®Ô ‡Âúq“åX®ý.. ’¹Õ©ÇsªÃ_, X¾Üºä, «²Äªá ªîœ¿Õf (ªîW)
* -ÂÃ-«Õ-ÈuÐ-Íç-¯çjo ‡®Ô ‡Âúq“åX®ý.. «§ŒÖ «Ö©Çl, å£jǪà (ªîW)

ƒ-X¾p-šË-«-ª½-Â¹× „êÃEÂË «âœ¿Õ ªîV©Õ.. ƒÂ¹åXj ªîW: -------------------------------- 
 * -N-•-§ŒÕ-„Ã-œ¿Ð-£¾Ý-Hx ‡Âúq“åX®ý * ®Ï-ÂË¢“ŸÄ-¦Ç-ŸþÐ-£¾Ý-Hx ‡Âúq“åX®ý * HŸ¿ªýÐ-§ŒÕ-¬Áy¢ÅŒ-X¾Üªý ‡Âúq“åX-®ý
-¤Äu-®Ï¢•ªý éªj@ÁÙx..:  
* -’¹Õ-ºÕ-X¾Ü-ªýÐ-N-¬Ç-È-X¾-{o¢
œ¿-Gx¢’û Â¢ ®¾êªy: 
 * -©Ç-Ō֪ý ªîœ¿ÕfÐ-¹×-ª½Õ-ŸÄy-œÎ * -X¾-ª½s-ºËÐ-X¾-Jx
-ÊÖ-ÅŒÊ éªj@ÁÙx..
* -å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-ŸþÐ-’¹Õ©s-ªÃ_ ƒ¢{ªý ®ÏšÌ(“X¾A ªîV)
* -ÂÃ-*-’¹Ö-œ¿Ð-¯Ã-’¹-ªý-Âî-ªá©ü ‡Âúq“åX®ý.. «§ŒÖ ¹ª½Öªý, ʫչˆ©ü, 殩¢(“X¾A ªîV)
* -®Ï-ÂË¢“ŸÄ-¦Ç-ŸþÐ-N-¬Ç-È-X¾-{o¢ ‡Âúq“åX®ý.. «§ŒÖ ‘ǰæXšü, N•§ŒÕ„Ü¿ (“X¾A ªîV)
* -¯Ã¢Ÿäœþ Ð »ª½¢’Ã-¦ÇŸþ.. «§ŒÖ X¾ÜªÃg, X¾ª½s-ºË(-“X¾A ªîV)
* »-ª½¢’Ã-¦Ç-ŸþÐ-êª-ºË-’¹Õ¢{(-“X¾A ªîW)

 


14, జనవరి 2014, మంగళవారం

అమ్మ..!!?


అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్రదాయం మరోవైపు.. సాధారణమైపోయాయి. ఇదేం కసాయి  లోకమని ప్రశ్నిస్తున్నాయి. మానవజాతి పురోగతిని వెక్కిరిస్తున్నాయి.

 స్త్రీలను దైవంగా పూజించే క్రమం నుంచి ఆడజాతి మనుగడనే శాసించే స్థాయికి  దిగజారిపోయాం. ఇప్పుడు అమ్మాయి వద్దంటే.. భావితరానికి అమ్మ  ఎక్కడ దొరుకుతుంది. అప్పుడు డబ్బులిచ్చి అమ్మను  కొనుక్కుందామా... మనసుపెట్టి ఆలోచించండి.. మనుగడకే ఎసరు  తెచ్చుకోకండి.

21, డిసెంబర్ 2013, శనివారం

పార్టీల మధ్య సంకుల సమరం

ఇదీ వాస్తవం !
 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికలు
పార్టీల మధ్య సంకుల సమరం
2014 పీఠమే పార్టీలకు ప్రధానం
సెమి ఫైనల్స్ లా తలపడుతున్న దృశ్యం
ఓడితే బొక్కబోర్లా పడటం తథ్యం

యూపిఎ ప్రచార బరిలో రాహుల్
ఎన్డీఎ పక్షాన మోడీ
ఎవరిని వరిస్తుందో సెమీఫైనల్ కిరీటం
ఇరు పక్షాల్లో నెలకొన్న సందిగ్ధం

అధికార పక్షంపై మోడీ విమర్శల వర్షం
అదేస్థాయిలో యూపిఏ నేతల ధ్వజం
ప్రచారంలో హద్దులు దాటుతున్న విమర్శల పర్వం
ఎన్నికల్లో గెలవడమే ముందున్న ఏకైక లక్ష్యం

మోడీ సభలపై బుసకొడుతున్న ఉగ్రవాదం
పాట్నాలో పేలుళ్లు...  జమ్మూలో దాడుల పుకార్లు
ఎన్డీఏ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న నైజం
ఏనాటినుంచో వేళ్లూనుకున్నదన్నది సత్యం

- హంసినీ సహస్ర

28, అక్టోబర్ 2013, సోమవారం

దేశానికి ఎవరు దిక్కు?


ప్రధానమంత్రి...
భారత ఔన్నత్యాన్ని చాటే పదవి
దేశ ప్రజలందరికీ ప్రతినిధి
పాలనాపరంగా ఉండాలి...
ప్రజలందరికీ జవాబుదారీ

పెద్దదిక్కు...

అవినీతి ఆరోపణలు వస్తే...
ఆర్థిక వ్యవస్థ పతనమైతే...
సమస్యలతో సందిగ్ధం నెలకొంటే...
దారిలో పెట్టడం ఆయన విధి

తగ్గారు...

నేర చరితులపై వేటుకు...
సుప్రీంకోర్టు ఆదేశం
దీనిపై ఆర్టినెన్స్‌కు ప్రయత్నించిన ప్రభుత్వం
రాత్రికి రాత్రే వెనక్కి తగ్గిన మన్మోహన్‌

లోగుట్టు...

ఆర్డినెన్స్‌ను చింపేయాలన్న రాహుల్‌
శరవేగంగా స్పందించిన పీఎం
ఆలోచన విరమించుకున్న UPA సర్కార్‌
చివరకు బుట్టదాఖలైన ఆర్డినెన్స్‌

కోల్‌గేట్...

దేశాన్ని కుదిపేసిన కోల్‌ కుంభకోణం
ప్రత్యక్ష సంబంధం లేదన్న మన్మోహన్‌
తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం
ఒడిశా సీఎంపైకి నెపం నెట్టేందుకు యత్నం

కాలింది...

 మాజీ కోల్‌సెక్రెటరీపై CBI కేసు
తనతో పాటు ప్రధానినీ ప్రశ్నించాలన్న పరేఖ్‌
ఉలిక్కిపడ్డ ప్రధాని మన్మోహన్‌
ప్రశ్నిస్తే సిద్ధమేనంటూ మాట మార్చిన వైనం

జవాబుదారీ...

కొన్నాళ్లనుంచి వరుస పరిణామాలు
అయినా.. మౌనమే నాదారి అంటున్నారు
ఓ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారన్న వాదనలు
సోనియాకు జవాబుదారీగా ఉంటున్నారన్న ఆరోపణలు

మన్మోహన్‌ జీ...

సమర్థుడు, సౌమ్యుడు అన్న అభిప్రాయం
వ్యక్తిగతంగా అందరికీ గౌరవం
వ్యవహారశైలితో మారుతోంది గళం
అసమర్థుడంటూ విమర్శల వర్షం

- హంసినీ సహస్ర

23, అక్టోబర్ 2013, బుధవారం

దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు...

ఇదీ వాస్తవం !



దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నారట
దానికి రాజకీయ పార్టీలూ పోటీ పడుతున్నాయట
'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న చందంగా
ఎవరికి వారే సర్ది చెప్పుకుంటున్నారట

రాజకీయాలను గాడిలో పెట్టాలన్నారు జనం
ఆ ఆకాంక్షకు న్యాయస్థానం ఇచ్చిందో రూపం
నేర చరితులకు చెక్ పెట్టే కీలక ఆయుధం
కోర్టు ఆదేశాలనూ ధిక్కరించిన నాయకగణం

పణంగా పెడుతున్నారు పార్లమెంటు గౌరవం
ఆర్డినెన్స్ రూపంలో తప్పించుకునే ప్రయత్నం
చట్టసభల అధికారాన్ని చేస్తున్నారు దుర్వినియోగం
సుప్రీం తీర్పు పైనా వెళ్లగక్కారు ఉక్రోషం

రాష్ట్రపతి తీసుకున్నారు భేషైన నిర్ణయం
ఆర్డినెన్స్ ను వెనక్కు తిప్పి పంపిన వైనం
ఆర్డినెన్స్ చింపేయాలంటూ రాహుల్ అసహనం
ఎట్టకేలకు వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ప్రజలకు తెలుసు నాయకుల పగటివేషం
మూడోకన్ను తెరుస్తారు ఎన్నికలవేళ ఇది నిజం
 

- హంసినీ సహస్ర