28, మే 2018, సోమవారం
టి-కాంగ్రెస్‌లో కుల కుంపట్లు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగు తోంది? అంతర్గతంగా సమన్వయం
ఎలా సాగు తోంది? సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ
సంసిద్ధమవుతోందా? లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఆ పార్టీలో ఉన్నవాళ్లకే
సమాధానాలు దొరకడంలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సుయాత్ర మినహా
కాంగ్రెస్‌పార్టీ చెప్పుకోదగ్గ రీతిలో కార్యాచరణ సిద్ధం చేయడం లేదంటూ సొంత
పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. హస్తినలో తనకున్న పలుకుబడితో
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా నాయకులకు, సీనియర్లకు రాహుల్‌గాంధీ ద్వారా
చెక్ పెట్టించారన్న ఆరోపణ లున్నాయి. రాహుల్ కోటరీలోని రాష్ట్ర పార్టీ
ఇంఛార్జ్ రామచంద్ర కుంతియా అండదండలతో పార్టీలో తనదైన ముద్రవేసుకునే
క్రమంలో పావులు కదుపు తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే
పార్టీలో మిగతా నేతలు తలపెట్టిన పాదయాత్రలు, ఇతర సభలు, సమావేశాలకు
రాహుల్‌గాంధీతో చెక్ పెట్టించారన్న వాదనలున్నాయి.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ సీనియర్లు, ఇతర నాయకుల నుంచి అధిష్టానానికి పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అధిష్టానం ముందు పంచాయతీ పెట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పరిణామాలపై సునిశితంగా దష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కర్ణాటక ఏపిసోడ్‌తో బిజీగా ఉన్న అధిష్టానం అక్కడ పరిస్థితులు కుదురు కున్న తర్వాత తెలంగాణ పిసిసిపై దష్టి పెట్టనున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రామచంద్ర కుంతియాను తప్పించే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. పార్టీలో ఓ బలమైన సామాజికవర్గం చెప్పిన మాటలు మాత్రమే వింటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో కుంతియాను తప్పించేందుకు సహేతుక మైన కారణాలు కూడా అధిష్టానం ముందుకు వెళ్లాయని చెబుతున్నారు.
రాహుల్‌గాంధీ కోటరీలో ఉండటంతో నేత లందరిని కుంతియా సమన్వయం చేస్తారని పార్టీ నేతలంతా భావించారు. కాలక్రమేణా ఆయన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అదే సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలకే విలువ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఆ సామాజికవర్గంతోనే మాట్లాడుతున్నట్టు, పలు విషయాలు చర్చిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. బిసి నేతలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, తమ బాధలను కూడ వినకపోవడంతో వారంతా కుంతియా పట్ల అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా చైతన్య బస్సుయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో అత్యధికం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం. బిసి అభ్యర్థులు ఉన్నప్పటికి వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా అభ్యర్థులను ప్రకటించడం వెనక కుంతియా హస్తం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి జంగా రాఘవరెడ్డి, నిర్మల్ మహేశ్వరరెడ్డి, ఆర్మూర్ కెఆర్ సురేష్‌రెడ్డి, హుస్నాబాద్‌కు ప్రవీణ్‌రెడ్డిని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా క్యామమల్లేష్ ఉండగా, మల్‌రెడ్డి రంగారెడ్డికి కూడా హామీ ఇచ్చారు. మరి బస్సుయాత్రలో బాల్కొండ, ములుగు, ఇల్లెందు, పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తు న్నారు. ఒక్కొక్క చోట ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు కూడా బరిలో ఉండగా కేవలం ఆ సామాజికవర్గానికి చెందిన పేర్లు ప్రకటించడానికి కుంతియా ఎలా అనుమతి ఇస్తారని మిగతా నేతలు ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనపై ఉత్తమ్ కుమార్‌ను మందలించడం గానీ దానిపై వివరణ ఇవ్వడం గానీ చేయకపోవడంతో పార్టీలో సీనియర్లు, ప్రధానంగా బిసి నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌లో ఒబిసి విభాగం కొనసాగు తుండగానే కుంతియా అనుమతి మేరకు టిపిసిసి నాయకత్వం బిసి సాధికారిత కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ఒబిసి వర్సెస్ బిసి సాధికారత కమిటీలను నియమించి బిసిల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల కొట్లాటలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు కొత్తగా బిసి కుంపటి తలనొప్పిగా మారింది.
అంతేకాకుండా తెలంగాణలో కర్ణాటక తరహా పరిణామాలు ఉత్పన్నమైతే కుంతియా డీల్ చేయలేరనే చర్చ కూడా పార్టీ నేతల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మార్పు ఉండొచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఏపిసోడ్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కర్ణాటకలో వెలువడిన ఫలితాలతో దక్షిణాది రాష్ట్రాల్లో అవసరమైతే పిసిసి అధ్యక్షులను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే పరిస్థితి ఉందని కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.
– సప్తగిరి

(http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%aa/)
కారగ్రెస్‌లో కుర్చీ కొట్లాట షురూ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుర్చీ లొల్లి షురూ అయ్యింది.
ఎన్నికలకు ఇంకా ఏడాది గడువుండగానే ఆ పార్టీ నాయకులు సిఎం పదవి గురించి
ఎవరికి వారే యమునా తీరే అన్న మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో
అధికార టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని
ఆపార్టీ బిల్డప్ ఇస్తోరది. కానీ నాయకుల వర్గపోరు, సిఎం కుర్చీ కోసం
పాకులాట ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది.
టార్గెట్ ఏంటి ?
ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా కాంగ్రెస్ నేతలు ఇటీవలి కాలంలో వరుసగా చేసిన ప్రకటనలతో ఆ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా ఏకతాటిపై ఉండి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి బదులు అప్పుడే సిఎం పదవిపై మాట్లాడటమేంటని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఈ విషయం పట్ల తీవ్ర నిరాశకు, అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చేందుకు కలిసికట్టుగా పోరాడకుండా పదవుల కోసం కుమ్ములాడుకోవడమేంటన్న ఆగ్రహం వ్యక్తమవు తోంది. నేను సిఎం అవుతానంటే.. నేనంటూ.. నేతలు సవాళ్లు విసురుకోవడం ప్రస్తుతం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
సిఎం కుర్చీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అడపా దడపా తన మనసులోని మాటను బయటపెట్టే సీనియర్ నేత జానారెడ్డి ఇటీవలే సిఎల్పి భేటీ సమయంలో మరోసారి తన కోరికను కుండబద్దలు కొట్టారు. సిఎం అయ్యే అర్హతలన్నీ తనకున్నాయని, తనకన్నా పార్టీలో ఆ పదవిని అధిష్టించే నేతలు ఎవరున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. గతవారం రేవంత్‌రెడ్డి చేసిన ఓ ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలే సష్టించింది. ఇటీవలే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన సిఎం కావడమే తన లక్ష్యమంటూ బాహాటంగా ప్రకటించారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, కాంగ్రెస్‌లో చేరేటప్పుడు తనకు చాలా హామీలిచ్చారని అధిష్టానంపై నెపం నెట్టేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం సష్టించడంతో మరుసటిరోజే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యమున్న ఓ పదవిని కేటాయించడం ద్వారా ఎన్నికల ఏడాదిలో క్రియాశీలం చేయాలన్న యోచనలో అధిష్టానం ఉన్న సమయంలోనే రేవంత్ బాంబు పేల్చారని సీనియర్లు అంటున్నారు.
మరోవైపు శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ కూడా సిఎం పదవిని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. తాను సిఎం రేసులో లేనని, తనకు తోకలేమీ లేవని చెప్పడం ఆయన మాటల్లోని వ్యంగ్యాన్ని ప్రస్ఫుటించింది. అయితే ఇలాంటి పరిణామాలే అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా నిలుస్తాయన్న అభిప్రాయాలు కొంతమంది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తమకు ఎదురే లేదన్న రీతిలో వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌లోని ఈ అంతర్గత విభేదాలు మరింత ఆసరాగా పనికొస్తున్నాయంటున్నారు.
అప్పుడూ ఇదే తీరు
2014 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ నుంచి ఏడెనిమిది మంది నేతలు సిఎం పదవి కోసం పోటీ పడినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికలపై కాకుండా సిఎం పదవిపైనే దష్టిపెట్టి పార్టీ గెలుపును మర్చిపోయారని, అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నారు.
నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మరో సమస్య కూడా వేధిస్తోంది. కొంతమంది నాయకుల తీరు పార్టీకి శరాఘాతంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఇతర పార్టీల నుంచి జనామోదం ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుండగా స్థానిక నేతలు మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందని, అలాగే నల్గొండ జిల్లాలో పిసిసి ముఖ్యనేత తన అనుచరుడి కోసం జిట్టా బాలకష్ణారెడ్డిని, ఉమా మాధవరెడ్డిని అడ్డుకున్నారని, అందుకే ఉమా మాధవరెడ్డి గులాబీ గూటికి చేరారని తెలుస్తోంది. కంచర్ల భూపాల్‌రెడ్డి హస్తం వైపు చూసినా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డు కోవడంతో ఆయన కూడా కారెక్కారని సమాచారం. వేముల వాడ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించిన సమ యంలో పిసిసి సభ్యుడొకరు రాకుండా ఆయన్ను అడ్డుకున్నారని, నిర్మల్‌లో ఓ లాయర్ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్డుకున్నారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఒకరిని డమ్మీ చేసేలా మరొకరు కౌంటర్లు ఇవ్వడం, విమర్శలు చేసుకోవడం, వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం ఆ పార్టీలో రాజకీయంగా ప్రతికూలతలకు దారితీస్తున్నాయి.
– సప్తగిరి
(http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%80-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d/)టార్గెట్ ఏంటి ?

18, మే 2018, శుక్రవారం
ఫ్రంట్ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?
ఫ్రంట్ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?
దేశంలో గుణాత్మక మార్పు
తీసుకొస్తానంటూ రెండు నెలలుగా వల్లె వేస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్
ఫెడరల్ ఫ్రంట్ కేవలం ప్రచార ఆర్భాటమేనా ? ఇప్పటిదాకా సాగిన పర్యటనలు,
జరిగిన చర్చల్లో స్పష్టత కొరవడిందా ? దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ
ఒకేతాటిపైకి రావడమన్నది సాధ్యం కాని పనా ? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం
దాదాపుగా అవుననే వినపడుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నుంచి పిలుపునిచ్చిన ఫెడరల్ ఫ్రంట్‌పై గందరగోళం ఏర్పడుతోంది. ఇప్పటివరకు కెసిఆరే స్వయంగా వెళ్లి పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిస్తే మరి కొందరు హైదరాబాద్ వచ్చి ఆయన్ను కలిశారు. అయితే కెసిఆర్‌తో భేటీ తర్వాత ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో వెల్లడించే అంశాలకు, ఆ తర్వాత ఆయా నేతలు చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.
ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తనకు ఫోన్ చేశారని, ఫ్రంట్‌కు మద్దతు తెలిపారని కెసిఆర్ చెప్పారు. అయితే ఆ మరుసటిరోజే అక్కడి ఓ ఆంగ్లపత్రిక తెలంగాణ సిఎం కెసిఆరే మమతకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు ప్రచురించిన కథనం సంచలనం రేపింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్ సోరెన్ కూడా మొదట్లో సిఎం కెసిఆర్‌కు మద్దతు తెలిపినా ఆ మరుసటిరోజే మాటమార్చి తాము కాంగ్రెస్ వెంటే ఉంటామని చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ తన బందంతో కలిసి చెన్నై వెళ్లారు. డిఎంకె నేతలు కరుణానిధి, స్టాలిన్, కనిమొళితో సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై తాము చర్చించినట్లు కెసిఆర్ తెలిపారు. అయితే ఆ తర్వాత ఎంపి కనిమొళి అందుకు భిన్నంగా స్పందించి కెసిఆర్‌కు షాక్ ఇచ్చారు. డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ సందర్భంగా మూడో కూటమి అంశం ప్రస్తావనకు రాలేదని కనిమొళి తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కెసిఆర్, స్టాలిన్ భేటీ రాజకీయ కూటమి దష్టితో జరగలేదని, రాష్ట్ర హక్కుల గురించే చర్చించారన్నారు. పైగా కాంగ్రెస్‌తో తాము కటీఫ్‌కు సుముఖంగా లేమని కూడా సంకేతాలు ఇవ్వడం కలకలం రేపింది.
మరోవైపు హైదరాబాద్‌కు వచ్చి కెసిఆర్‌తో భేటీ అయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పి అధినేత అఖిలేశ్‌యాదవ్ కూడా కెసిఆర్ పాలనను పొగడటం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. కెసిఆర్ నేతత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తోందని, దేశంలో పేదలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, బిజెపి సర్కారును ప్రాంతీయ పార్టీలే నిలువరించగలుగుతా యన్నారు అఖిలేష్. దేశంలో మార్పు కోసం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిదని, దీనివల్ల దేశానికి మంచి జరుగుతుందని అఖిలేష్ చెప్పారు. కెసిఆర్ స్పష్టంగా బిజెపి, కాంగ్రెస్‌లపైనే జాతీయ స్థాయిలో పోరాటమని ప్రతిసారీ చెబుతుండగా అఖిలేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఫ్రంట్ పేరిట వ్యక్తిగత ప్రచారం పెంచుకునేందుకే కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అయితే
కెసిఆర్ ఫ్రంట్ ప్లాన్‌కు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కీలకమని కొంతమంది
అంటున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్ అక్కడ విజయం సాధిస్తేనే ఫెడరల్
ఫ్రంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, అందుకే కెసిఆర్ బెంగళూరు
వెళ్లి దేవెగౌడను, కుమారస్వామిని కలిశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే
గులాబీ బాస్ బెంగళూరు పర్యటనలో అనేక రాజకీయ కోణాలు దాగున్నాయని పలువురు
నాయకులు భావిస్తున్నారు. కెసిఆర్‌తో దేవెగౌడ ఏం మాట్లాడారు ? అసలు వారి
మధ్య కూటమి ప్రస్తావన వచ్చిందా ? ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడ కెసిఆర్‌కు
హామీ ఇచ్చారా ? అన్న సందేహాలకు స్పష్టత కరువైంది. భేటీ అనంతరం విలేకరుల
సమావేశంలో మాత్రం దేవెగౌడ కూటమి మాటను దాటేసి మాట్లాడారు. తెలంగాణలో జనరంజక
పాలన సాగుతోందని, అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సిఎం
కెసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి
కూడా దేవెగౌడ మద్దతు ఇచ్చారన్నారు. అంతే తప్ప ఫ్రంట్‌పై దేవెగౌడ నుంచి
కెసిఆర్‌కు కచ్చితమైన హామీ లభించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యమంటున్న కెసిఆర్ కేవలం యుపిఎ భాగస్వామ్యపక్షాలను మాత్రమే కలుస్తు న్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పైగా కెసిఆర్ మూడో కూటమి ఓ కుట్ర అంటూ మొదటి నుంచీ విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పలువురు నేతలకు లేఖలు కూడా రాసినట్లు చెబుతున్నారు. దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, స్టాలిన్ తదితరులకు రాసిన లేఖల్లో తన అసమర్థ పాలన, అవినీతి నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకే ఫెడరల్ ఫ్రంట్ నాటకానికి కెసిఆర్ తెర తీశారని కాంగ్రెస్ లేఖల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ లేఖల ప్రభావం కూడా కెసిఆర్ పర్యటనల తర్వాత ఆయా పార్టీల నేతల ప్రతి స్పందనపై ఉంటోందంటున్నారు.
మరోవైపు కెసిఆర్ ఎక్కడికి వెళ్లినా తన టీమ్‌లో కనీసం 30 మంది దాకా ఉంటున్నారని వాళ్లందరికీ విమానయాన ఖర్చు, తిండి, ఇతర ఖర్చులన్నీ తెలంగాణ సర్కారు ఖజానాపై పడుతున్నాయన్న విమర్శలూ వినపడతున్నాయి. వాస్తవానికి కెసిఆర్ చేస్తున్న ఫ్రంట్ ప్రయత్నాలు రాజకీయ సంబంధమై నవి. ఆ తరహా యాత్రలు, చర్చలు, సమావేశాలు, భేటీలన్నీ పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాల కిందకు వస్తాయి. కానీ ఇప్పుడు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న పర్యటనలకు సంబంధించిన ఖర్చు అంతా అధికారిక ఖాతాలోకి వెళ్తోంది.
– సప్తగిరి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నుంచి పిలుపునిచ్చిన ఫెడరల్ ఫ్రంట్‌పై గందరగోళం ఏర్పడుతోంది. ఇప్పటివరకు కెసిఆరే స్వయంగా వెళ్లి పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిస్తే మరి కొందరు హైదరాబాద్ వచ్చి ఆయన్ను కలిశారు. అయితే కెసిఆర్‌తో భేటీ తర్వాత ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో వెల్లడించే అంశాలకు, ఆ తర్వాత ఆయా నేతలు చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.
ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తనకు ఫోన్ చేశారని, ఫ్రంట్‌కు మద్దతు తెలిపారని కెసిఆర్ చెప్పారు. అయితే ఆ మరుసటిరోజే అక్కడి ఓ ఆంగ్లపత్రిక తెలంగాణ సిఎం కెసిఆరే మమతకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు ప్రచురించిన కథనం సంచలనం రేపింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్ సోరెన్ కూడా మొదట్లో సిఎం కెసిఆర్‌కు మద్దతు తెలిపినా ఆ మరుసటిరోజే మాటమార్చి తాము కాంగ్రెస్ వెంటే ఉంటామని చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ తన బందంతో కలిసి చెన్నై వెళ్లారు. డిఎంకె నేతలు కరుణానిధి, స్టాలిన్, కనిమొళితో సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుపై తాము చర్చించినట్లు కెసిఆర్ తెలిపారు. అయితే ఆ తర్వాత ఎంపి కనిమొళి అందుకు భిన్నంగా స్పందించి కెసిఆర్‌కు షాక్ ఇచ్చారు. డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ సందర్భంగా మూడో కూటమి అంశం ప్రస్తావనకు రాలేదని కనిమొళి తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కెసిఆర్, స్టాలిన్ భేటీ రాజకీయ కూటమి దష్టితో జరగలేదని, రాష్ట్ర హక్కుల గురించే చర్చించారన్నారు. పైగా కాంగ్రెస్‌తో తాము కటీఫ్‌కు సుముఖంగా లేమని కూడా సంకేతాలు ఇవ్వడం కలకలం రేపింది.
మరోవైపు హైదరాబాద్‌కు వచ్చి కెసిఆర్‌తో భేటీ అయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పి అధినేత అఖిలేశ్‌యాదవ్ కూడా కెసిఆర్ పాలనను పొగడటం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. కెసిఆర్ నేతత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తోందని, దేశంలో పేదలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, బిజెపి సర్కారును ప్రాంతీయ పార్టీలే నిలువరించగలుగుతా యన్నారు అఖిలేష్. దేశంలో మార్పు కోసం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిదని, దీనివల్ల దేశానికి మంచి జరుగుతుందని అఖిలేష్ చెప్పారు. కెసిఆర్ స్పష్టంగా బిజెపి, కాంగ్రెస్‌లపైనే జాతీయ స్థాయిలో పోరాటమని ప్రతిసారీ చెబుతుండగా అఖిలేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఫ్రంట్ పేరిట వ్యక్తిగత ప్రచారం పెంచుకునేందుకే కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
జాతీయ రాజకీయాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యమంటున్న కెసిఆర్ కేవలం యుపిఎ భాగస్వామ్యపక్షాలను మాత్రమే కలుస్తు న్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పైగా కెసిఆర్ మూడో కూటమి ఓ కుట్ర అంటూ మొదటి నుంచీ విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పలువురు నేతలకు లేఖలు కూడా రాసినట్లు చెబుతున్నారు. దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, స్టాలిన్ తదితరులకు రాసిన లేఖల్లో తన అసమర్థ పాలన, అవినీతి నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకే ఫెడరల్ ఫ్రంట్ నాటకానికి కెసిఆర్ తెర తీశారని కాంగ్రెస్ లేఖల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ లేఖల ప్రభావం కూడా కెసిఆర్ పర్యటనల తర్వాత ఆయా పార్టీల నేతల ప్రతి స్పందనపై ఉంటోందంటున్నారు.
మరోవైపు కెసిఆర్ ఎక్కడికి వెళ్లినా తన టీమ్‌లో కనీసం 30 మంది దాకా ఉంటున్నారని వాళ్లందరికీ విమానయాన ఖర్చు, తిండి, ఇతర ఖర్చులన్నీ తెలంగాణ సర్కారు ఖజానాపై పడుతున్నాయన్న విమర్శలూ వినపడతున్నాయి. వాస్తవానికి కెసిఆర్ చేస్తున్న ఫ్రంట్ ప్రయత్నాలు రాజకీయ సంబంధమై నవి. ఆ తరహా యాత్రలు, చర్చలు, సమావేశాలు, భేటీలన్నీ పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాల కిందకు వస్తాయి. కానీ ఇప్పుడు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న పర్యటనలకు సంబంధించిన ఖర్చు అంతా అధికారిక ఖాతాలోకి వెళ్తోంది.
– సప్తగిరి
11, మే 2018, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)