తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగు తోంది? అంతర్గతంగా సమన్వయం
ఎలా సాగు తోంది? సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ
సంసిద్ధమవుతోందా? లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఆ పార్టీలో ఉన్నవాళ్లకే
సమాధానాలు దొరకడంలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సుయాత్ర మినహా
కాంగ్రెస్‌పార్టీ చెప్పుకోదగ్గ రీతిలో కార్యాచరణ సిద్ధం చేయడం లేదంటూ సొంత
పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. హస్తినలో తనకున్న పలుకుబడితో
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా నాయకులకు, సీనియర్లకు రాహుల్‌గాంధీ ద్వారా
చెక్ పెట్టించారన్న ఆరోపణ లున్నాయి. రాహుల్ కోటరీలోని రాష్ట్ర పార్టీ
ఇంఛార్జ్ రామచంద్ర కుంతియా అండదండలతో పార్టీలో తనదైన ముద్రవేసుకునే
క్రమంలో పావులు కదుపు తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే
పార్టీలో మిగతా నేతలు తలపెట్టిన పాదయాత్రలు, ఇతర సభలు, సమావేశాలకు
రాహుల్‌గాంధీతో చెక్ పెట్టించారన్న వాదనలున్నాయి.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ సీనియర్లు, ఇతర నాయకుల నుంచి అధిష్టానానికి పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అధిష్టానం ముందు పంచాయతీ పెట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పరిణామాలపై సునిశితంగా దష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కర్ణాటక ఏపిసోడ్‌తో బిజీగా ఉన్న అధిష్టానం అక్కడ పరిస్థితులు కుదురు కున్న తర్వాత తెలంగాణ పిసిసిపై దష్టి పెట్టనున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రామచంద్ర కుంతియాను తప్పించే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. పార్టీలో ఓ బలమైన సామాజికవర్గం చెప్పిన మాటలు మాత్రమే వింటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో కుంతియాను తప్పించేందుకు సహేతుక మైన కారణాలు కూడా అధిష్టానం ముందుకు వెళ్లాయని చెబుతున్నారు.
రాహుల్‌గాంధీ కోటరీలో ఉండటంతో నేత లందరిని కుంతియా సమన్వయం చేస్తారని పార్టీ నేతలంతా భావించారు. కాలక్రమేణా ఆయన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అదే సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలకే విలువ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఆ సామాజికవర్గంతోనే మాట్లాడుతున్నట్టు, పలు విషయాలు చర్చిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. బిసి నేతలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, తమ బాధలను కూడ వినకపోవడంతో వారంతా కుంతియా పట్ల అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా చైతన్య బస్సుయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో అత్యధికం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం. బిసి అభ్యర్థులు ఉన్నప్పటికి వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా అభ్యర్థులను ప్రకటించడం వెనక కుంతియా హస్తం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి జంగా రాఘవరెడ్డి, నిర్మల్ మహేశ్వరరెడ్డి, ఆర్మూర్ కెఆర్ సురేష్‌రెడ్డి, హుస్నాబాద్‌కు ప్రవీణ్‌రెడ్డిని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా క్యామమల్లేష్ ఉండగా, మల్‌రెడ్డి రంగారెడ్డికి కూడా హామీ ఇచ్చారు. మరి బస్సుయాత్రలో బాల్కొండ, ములుగు, ఇల్లెందు, పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తు న్నారు. ఒక్కొక్క చోట ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు కూడా బరిలో ఉండగా కేవలం ఆ సామాజికవర్గానికి చెందిన పేర్లు ప్రకటించడానికి కుంతియా ఎలా అనుమతి ఇస్తారని మిగతా నేతలు ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనపై ఉత్తమ్ కుమార్‌ను మందలించడం గానీ దానిపై వివరణ ఇవ్వడం గానీ చేయకపోవడంతో పార్టీలో సీనియర్లు, ప్రధానంగా బిసి నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌లో ఒబిసి విభాగం కొనసాగు తుండగానే కుంతియా అనుమతి మేరకు టిపిసిసి నాయకత్వం బిసి సాధికారిత కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ఒబిసి వర్సెస్ బిసి సాధికారత కమిటీలను నియమించి బిసిల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల కొట్లాటలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు కొత్తగా బిసి కుంపటి తలనొప్పిగా మారింది.
అంతేకాకుండా తెలంగాణలో కర్ణాటక తరహా పరిణామాలు ఉత్పన్నమైతే కుంతియా డీల్ చేయలేరనే చర్చ కూడా పార్టీ నేతల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మార్పు ఉండొచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఏపిసోడ్ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కర్ణాటకలో వెలువడిన ఫలితాలతో దక్షిణాది రాష్ట్రాల్లో అవసరమైతే పిసిసి అధ్యక్షులను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే పరిస్థితి ఉందని కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.
– సప్తగిరి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి