తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుర్చీ లొల్లి షురూ అయ్యింది.
ఎన్నికలకు ఇంకా ఏడాది గడువుండగానే ఆ పార్టీ నాయకులు సిఎం పదవి గురించి
ఎవరికి వారే యమునా తీరే అన్న మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో
అధికార టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని
ఆపార్టీ బిల్డప్ ఇస్తోరది. కానీ నాయకుల వర్గపోరు, సిఎం కుర్చీ కోసం
పాకులాట ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది.
టార్గెట్ ఏంటి ?
ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా కాంగ్రెస్ నేతలు ఇటీవలి కాలంలో వరుసగా చేసిన ప్రకటనలతో ఆ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా ఏకతాటిపై ఉండి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి బదులు అప్పుడే సిఎం పదవిపై మాట్లాడటమేంటని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఈ విషయం పట్ల తీవ్ర నిరాశకు, అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చేందుకు కలిసికట్టుగా పోరాడకుండా పదవుల కోసం కుమ్ములాడుకోవడమేంటన్న ఆగ్రహం వ్యక్తమవు తోంది. నేను సిఎం అవుతానంటే.. నేనంటూ.. నేతలు సవాళ్లు విసురుకోవడం ప్రస్తుతం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
సిఎం కుర్చీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అడపా దడపా తన మనసులోని మాటను బయటపెట్టే సీనియర్ నేత జానారెడ్డి ఇటీవలే సిఎల్పి భేటీ సమయంలో మరోసారి తన కోరికను కుండబద్దలు కొట్టారు. సిఎం అయ్యే అర్హతలన్నీ తనకున్నాయని, తనకన్నా పార్టీలో ఆ పదవిని అధిష్టించే నేతలు ఎవరున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. గతవారం రేవంత్‌రెడ్డి చేసిన ఓ ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలే సష్టించింది. ఇటీవలే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన సిఎం కావడమే తన లక్ష్యమంటూ బాహాటంగా ప్రకటించారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, కాంగ్రెస్‌లో చేరేటప్పుడు తనకు చాలా హామీలిచ్చారని అధిష్టానంపై నెపం నెట్టేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం సష్టించడంతో మరుసటిరోజే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యమున్న ఓ పదవిని కేటాయించడం ద్వారా ఎన్నికల ఏడాదిలో క్రియాశీలం చేయాలన్న యోచనలో అధిష్టానం ఉన్న సమయంలోనే రేవంత్ బాంబు పేల్చారని సీనియర్లు అంటున్నారు.
మరోవైపు శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ కూడా సిఎం పదవిని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. తాను సిఎం రేసులో లేనని, తనకు తోకలేమీ లేవని చెప్పడం ఆయన మాటల్లోని వ్యంగ్యాన్ని ప్రస్ఫుటించింది. అయితే ఇలాంటి పరిణామాలే అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా నిలుస్తాయన్న అభిప్రాయాలు కొంతమంది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తమకు ఎదురే లేదన్న రీతిలో వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌లోని ఈ అంతర్గత విభేదాలు మరింత ఆసరాగా పనికొస్తున్నాయంటున్నారు.
అప్పుడూ ఇదే తీరు
2014 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ నుంచి ఏడెనిమిది మంది నేతలు సిఎం పదవి కోసం పోటీ పడినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికలపై కాకుండా సిఎం పదవిపైనే దష్టిపెట్టి పార్టీ గెలుపును మర్చిపోయారని, అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నారు.
నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మరో సమస్య కూడా వేధిస్తోంది. కొంతమంది నాయకుల తీరు పార్టీకి శరాఘాతంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఇతర పార్టీల నుంచి జనామోదం ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుండగా స్థానిక నేతలు మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందని, అలాగే నల్గొండ జిల్లాలో పిసిసి ముఖ్యనేత తన అనుచరుడి కోసం జిట్టా బాలకష్ణారెడ్డిని, ఉమా మాధవరెడ్డిని అడ్డుకున్నారని, అందుకే ఉమా మాధవరెడ్డి గులాబీ గూటికి చేరారని తెలుస్తోంది. కంచర్ల భూపాల్‌రెడ్డి హస్తం వైపు చూసినా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డు కోవడంతో ఆయన కూడా కారెక్కారని సమాచారం. వేముల వాడ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించిన సమ యంలో పిసిసి సభ్యుడొకరు రాకుండా ఆయన్ను అడ్డుకున్నారని, నిర్మల్‌లో ఓ లాయర్ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్డుకున్నారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఒకరిని డమ్మీ చేసేలా మరొకరు కౌంటర్లు ఇవ్వడం, విమర్శలు చేసుకోవడం, వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం ఆ పార్టీలో రాజకీయంగా ప్రతికూలతలకు దారితీస్తున్నాయి.
– సప్తగిరి
(http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%80-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d/)టార్గెట్ ఏంటి ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి