26, జూన్ 2019, బుధవారం

ముహూర్తం కుదిరింది


ముహూర్తం కుదిరింది

ముహూర్తం కుదిరింది..

ముహూర్తం కుదిరింది..
నాలుగో తేదీ దాటితే మంచి ముహూ ర్తాలు లేవు.. కేటీఆర్‌ రాష్ట్ర మంతటా ఓ రౌండ్‌ చుట్టేసి రావాలి.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంపై ఓ స్పష్టత రావాలి.. ఇంతలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఇంకేముంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరడం మరో నెలరోజుల వరకూ వాయిదా పడొచ్చు… లాంటి ప్రచారాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా షికార్లు కొట్టాయి. జాతకాలు, జ్యోతిష్యాలు, ముహూర్తాలు ఎక్కువగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పట్లో ఈ ఆలోచన చేయబోరని అంతా అనుకున్నారు. కానీ అన్నింటికీ ముహూర్తం కుదిరింది. అనుకోని రీతిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో సందిగ్ధానికి తెరపడింది.
ఎన్నికల ఫలితాలు వెలువడి నెల దాటిపోయినా ఇంత వరకూ అసెంబ్లీని సమావేశ పరచడం లేదనే విమర్శలు పెరుగుతోండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పైగా తిథిని చూసుకొని మరీ తేదీలు ఖరారు చేసినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఉత్తరాయన పుణ్యకాలంలో ఏకాదశి తిథిని ఎంచుకొని అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి సీఎం కార్యాలయం ముహూర్తం నిర్ణయించిందంటున్నారు.
ప్రొటెం స్పీకర్‌గా అహ్మద్‌ ఖాన్‌
జనవరి 17వ తేదీ నుంచి తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి 20వ తేదీ వరకు జరుగుతాయి. కొత్త శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్‌ నుంచి మజ్లిస్‌ పార్టీ తరపున గెలిచిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ వ్యవహ రించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆయనతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 17న ఉదయం పదకొండున్నర గంటలకు ప్రొటెం స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీ సమా వేశమవుతుంది. నాలుగు రోజుల పాటు శాసనససభ సమావేశాలు కొనసాగుతాయి.
ఎంఐఎం ఎమ్మేల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సీఎం కేసీఆర్‌కు ధన్య వాదాలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.
మరోవైపు అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత, గోషామహల్‌ శాసన సభ్యుడు రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. హిందూమతాన్ని వ్యతిరేకించే, దేశభక్తి లేని ఎంఐఎం పార్టీ నేత ప్రొటెం స్పీకర్‌గా కొనసాగడానికి వీల్లేదని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను శాసన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానని ప్రకటించారు.
అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌
17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలవు తాయి. మధ్యాహ్నం జూబ్లీహాల్‌లో ఎమ్మెల్యేలకు విందు ఇస్తారు. అదే రోజు స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ వంటి తతంగం ముగిస్తారు. 18వ తేదీన కొత్త స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. 19వ తేదీన గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీని వాయిదా వేస్తారు.
దశమి..ఏకాదశి..
కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. మంచి రోజు చూసుకొని శాసన సభ సమావేశాలు ప్రారంభిస్తామని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. దీనికి అనుగుణం గానే ఆయన తాజాగా తిథులు చూసుకొని తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం దశమి రోజున, శాసన సభ సమావేశాలు ఏకాదశి రోజున మొదలయ్యేలా ముహూర్తం ఖరారు చేశారు.
దుబాయ్‌ పర్యటన రద్దు!
ఇన్నాళ్లు కనీసం ప్రస్తావన లేని అసెంబ్లీ సమా వేశాల గురించి ఉన్నట్టుండి నిర్ణయం తీసుకోవడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది. కేసీఆర్‌ ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ టూర్‌కు ప్లాన్‌ చేసుకున్నారు. 13వ తేదీ వరకు అంటే, ఎనిమిది రోజుల సుదీర్ఘ పర్యటన సిద్ధమైంది. కానీ అకస్మాత్తుగా ఆ పర్యటనను రద్దు చేసుకొని వెంటనే అసెంబ్లీ సమావేశాల ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడం, కనీసం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహించకపోవడం వంటి విమర్శలు అన్ని వర్గాల నుంచి ఎదురైన నేపథ్యంలో కేసీఆర్‌ దుబాయ్‌ పర్యటనకు వెళ్లి మరో వారం రోజుల పాటు ఉండి వస్తే అప్పటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలవుతుంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫి కేషన్‌కు, నిర్వహణకు పెద్దగా సమయం లభించదు. పైగా ఇటీవల రాష్ట్ర పాలన గాలికొదిలి జాతీయ స్థాయి పర్యటనలు చేయడంపైనా కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ పర్యటనలు పెట్టుకుంటే ప్రజలకు వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని కేసీఆర్‌ ఆలోచించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్‌ దుబాయ్‌ పర్యటన వెనుక చాలా రాజకీయ అంశాలున్నాయని కొంతమంది భావిస్తున్నారు.
మంత్రివర్గ విస్తరణ
మరోవైపు మంత్రివర్గ విస్తరణపైనా పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఉంటుందా? లేదా? అన్నదానిపైన స్పష్టత లేదు. గతంలో ప్రగతి భవన్‌ నుంచి మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల పద్దెనిమిదో తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌ కూడా పంచాయతీ ఎన్నికల లోపే పదవుల పంపకం ఉంటుందని ప్రకటించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ కూడా ఈ సమావేశాల్లోనే పూర్తవుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ ఆలోచనకు బలం చేకూరుస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ పరిశీలిస్తే 18వ తేదీన ఒక్కరోజు మాత్రమే సమయం దొరుకుతుంది. ఆ రోజే మంత్రివర్గ విస్తరణకు అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అయితే 16వ తేదీన కూడా ఇందుకు అవకాశాలు లేకపోలేదని మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో 16 లేదా 18 తేదీల్లో కేబినేట్‌ విస్తరణ ఖాయంగా ఉంటుందని చెబుతున్నారు.
ఎందరో ఆశావహులు?
మంత్రివర్గ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని కేసీఆర్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశలో ఎనిమిది మందికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే రోజు పార్లమెంటరీ కార్యదర్శులను కూడా ఎంపిక చేయనున్నారు. వీరిలో కొందరికి తొలి విడతలో, మరికొందరికి మలివిడతలో అవకాశం కల్పించాలని గులాబీ బాస్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మొదటినుంచి అన్ని అంశాల్లోనూ ప్రామా ణికంగా తీసుకుంటోన్న ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం నుంచి మినహా మిగతా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిథ్యం ఉండే అవకాశ ముంది. కేటీఆర్‌, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, ఈటెల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర రావు, రెడ్యా నాయక్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, రేఖా నాయక్‌, కొప్పుల ఈశ్వర్‌, ఆరూరి రమేష్‌, వినయ భాస్కర్‌, పట్నం నరేందర్‌ రెడ్డి, తదితర ఆశావహుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రవంత్‌కు చెక్‌
కాంగ్రెస్‌ నేత, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై కొడంగల్‌లో భారీ మెజారిటీతో గెలిచిన పట్నం నరేందర్‌ రెడ్డికి కేబినెట్‌లో స్థానం కల్పించాలని.. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి రేవంత్‌ ప్రాధాన్యత, జనంలో ఆదరణ పూర్తిగా తగ్గించేలా ప్లాన్‌ చేసినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.
సభాపతి ఎవరు!?
స్పీకర్‌ పదవికి ఇంతవరకు ఎవరినీ ఖరారు చేయలేదు. సభాపతి స్థానంలో ఎవరిని కూర్చో బెట్టాలన్న విషయం ఇంకా తేల్చుకోలేదని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్‌ ప్రధానంగా దష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రెడ్యా నాయక్‌ తదితరుల పేర్లను స్పీకర్‌ పదవికి పరిశీలిస్తున్నారని సమాచారం.
అయితే సీఎంతో సమానంగా ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తోన్న ధర్మపురి శాసన సభ్యుడు కొప్పుల ఈశ్వర్‌కు మొదటి శాసన సభలోనే స్పీకర్‌గా అవకాశం ఇస్తామని కేసీఆర్‌ ఆఫర్‌ చేసినా ఆయన సున్నితంగా తిరస్కరించారన్న ప్రచారం. ఈ నేపథ్యంలో ఈసారి కొప్పులను మళ్లీ సభాపతి పదవికి ప్రతిపాదిస్తారా? లేదంటే కేబినెట్‌లోకి తీసుకుంటారా? అన్న విషయంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది.
– సప్తగిరి.జి, 9885086126


 https://www.blogger.com/blogger.g?blogID=5786711020450708235#editor/target=post;postID=5573888794942707835

పాలన వదిలి.. ఫ్రంట్‌కు కదిలి...


పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…
ఎన్నికల తంతు పూర్తయి, అధికారికంగా ఫలితాలు వెలువడి 20 రోజులు గడిచినా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో కొలువుదీరలేదు. గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ¬ంమంత్రిగా మహమూద్‌ అలీ మినహా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సొంత రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అతి విశ్వాసం!
అత్యధిక స్థానాలు గెలుపొంది.. తెలంగాణ రాష్ట్ర సమితి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌లో తనకు తిరుగేలేదన్న ఆత్మవిశ్వాసం ఎక్కువైందని విపక్షాలు విమర్శి స్తున్నాయి. తాను చెప్పిందే వేదం.. తాను తీసుకున్న నిర్ణయాలే ఫైనల్‌ అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి కనిపిస్తోందని.. అందుకు నిదర్శనం రాష్ట్రంలో ఇంకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
ఇద్దరే..!
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంటరిగా కాకుండా ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి నుంచీ ఊహించినట్లే గతంలో నాయిని నిర్వ హించిన ¬ంశాఖ మంత్రి పదవిని మహమూద్‌ అలీకి కట్టబెట్టారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ¬ంమంత్రి మినహా అధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఈ పరిణా మాలు విపక్షాల విమర్శలకు కారణమవుతున్నాయి. కానీ కేసీఆర్‌ మాత్రం విపక్షాల విమర్శలను అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
పాలన గాలికొదిలి..
రాష్ట్రంలో పాలన విధానాలను గాలికొదిలి ముఖ్యమంతి కేసీఆర్‌ దేశ రాజకీయాలంటూ పర్యటనలు చేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం.. విశాఖలో శారదాపీఠాన్ని సందర్శించి.. ఒడిశా, అటునుంచి పశ్చిమబంగలో పర్యటనలు సాగించడం, చివరగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోదీని కలిసి రావడం రాజకీయంగా గందరగోళాన్ని సష్టించింది. అసలు తనను గెలిపించిన ప్రజలకు సీఎం ఏం సందేశం ఇస్తున్నారన్న ప్రశ్నను లేవనెత్తుతోంది.
సాధారణంగా ఇల్లు చక్కదిద్దుకొని బయట పనులు చూసుకోవాలంటారు. కానీ కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వాన్ని వదిలేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటనలు సాగించడం ఒక్క కేసీఆర్‌కే చెల్లుతోందన్న విమర్శలు చివరకు సొంతపార్టీ నుంచి కూడా వ్యక్తమవు తున్నాయి.
అందుకేనా?
తన కుమారుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ అత్యంత తెలివిగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఎన్నికల ముందునుంచే కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టి.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవసరమైతే ఢిల్లీలోనే మకాం వేస్తారన్న చర్చ జరిగింది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఈ వాదనలను బలపరిచాయి. అందరూ అనుకున్నట్లే ఎన్నికలు పూర్తవగానే కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని కట్టబెట్టారు. అంటే పార్టీలో తన తర్వాత కేటీఆరే నన్న సంకేతాలు ఇచ్చారు కేసీఆర్‌. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన స్థానం అలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సముచిత స్థానం ఇవ్వాల్సిందే!
కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచనే తొందరపాటు చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్లకే ఇంత తొందర అవసరమా? అన్న ప్రశ్నలు కూడా వినిపి స్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హరీశ్‌కి కూడా తగిన ప్రాధాన్యం కలిగిన పదవి ఇస్తే బాగుంటుందన్నది ఆయన అభిమానులు, సన్నిహితుల ఆలోచనగా తెలుస్తోంది.
జోరు పెంచిన కేటీఆర్‌
అటు కేటీఆర్‌ కూడా తండ్రికి తగ్గ తనయుడిలాగే దూసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటనలకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన కృతజ్ఞత సభల్లో పాల్గొన్నారు. మొదట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం కాగానే పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీని మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. కేటీఆర్‌ రాష్ట్రం మొత్తం పర్యటించి మంచి పట్టు సాధించిన తర్వాతే మంత్రివర్గాన్ని కొలువుదీర్చాలన్న ప్రతిపాదన కేసీఆర్‌లో ఉన్నట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కేటీఆర్‌ సుడిగాలి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.
కుటుంబ పాలన!?
అసలు తొలి ప్రభుత్వంలోనే కుటుంబ పాలన అన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు కేసీఆర్‌. అయినా ఆ విమర్శలను పట్టించుకోలేదు. కుమారుడు, కూతురు, మేనల్లుడి పదవులు రాజ్యాంగ బద్ధంగా గెలిచినవని సర్దిచెప్పుకున్నారు. కానీ.. రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించి మరి తన కుమారుడికి కట్టబెట్టడం ఓ రకంగా రాజకీయ కలకలం సష్టించింది. కుటుంబ పాలన అన్న విమర్శ లను వాస్తవం చేసే దిశగానే కేసీఆర్‌ మళ్లీ అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిజర్వేషన్ల ‘లొలి’
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించు కోవాలని బీసీ కుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాయి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, దీనికోసం సీఎం అధ్యక్షతన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రితో చర్చించి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని వారు సూచించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించా లని కాంగ్రెస్‌ పార్టీ సైతం డిమాండ్‌ చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతాన్ని తగ్గించలేదని.. ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి పోరాటానికి పిలుపునిచ్చిన పాల్గొనడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అయితే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ అంశం గురించి కేసీఆర్‌ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని, ఏబీసీడీఈ వర్గీకరణ చేయాలని కోర్టుకెళ్లిన కాంగ్రెస్‌ నేతలే ఇప్పుడు రిజర్వేషన్లు తగ్గాయంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చి బీసీలకు 61.19 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ పెట్టాం. అది ఆమోదం కూడా పొందిన తర్వాత కాంగ్రెస్‌ నేతలే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలని హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. దాంతో హైకోర్టు దాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తే ఆ కోర్టు కూడా కొట్టేసింది. పైగా జనవరి 10 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు నిర్వహించవలసి వస్తోందని కేసీఆర్‌ చెప్పారు.
ఈ అంశంలో నిజానిజాలను పక్కన పెడితే ఎన్నికల తర్వాత ఘోర పరాజయం పాలై తలో దిక్కూ వెళ్లిపోయిన కూటమి పార్టీలన్నీ మళ్లీ ఏకతాటి మీదకొచ్చినట్టుగా తెలుస్తోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు కూటమి పార్టీలన్నీ కలసి పోరాడతాయని పిలుపునిచ్చాయి.

హరీశ్‌కు తగ్గిన ప్రాధాన్యం!

రోజురోజుకి టీఆర్‌ఎస్‌లో పార్టీ ముఖ్య నేత, కేసీఆర్‌కు మేనల్లుడు హరీశ్‌రావుకు ప్రాధాన్యం తగ్గుతోందనే చెప్పాలి. కావాలనే కేసీఆర్‌ ..తన తనయుడు కేటీఆర్‌ను ముందుకు తీసుకొచ్చారన్న ప్రచారం సొంతపార్టీలోనే సాగుతోంది. అయితే హరీశ్‌కి స్వతహాగా ఉన్న ఇమేజ్‌ను ఏదీ అడ్డుకోలేక పోయింది. ఆయన ఈ ఎన్నికల్లో లక్షా 20వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దేశ చరిత్రలోనే ఇప్పటిదాకా నమోదైన భారీ మెజారిటీల్లో ఇది రెండోది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా చూసు కుంటే ఇప్పటిదాకా నమోదైన అతిపెద్ద మెజారిటీ ఇదే. అంటే రాజకీయ నాయకుడిగా తనదైన స్థానానికి మరింత గట్టి పునాదులు వేసుకున్నారు హరీశ్‌. కానీ పార్టీలో చూస్తే ఆయనకు రోజురోజుకూ ప్రాధాన్యం తగ్గిపోతున్నట్లు పరిణామాలు సూచిస్తు న్నాయి. అయినా ఏ రోజూ అసంతప్తిని బయట పెట్టకుండా చిరునవ్వుతోనే విమర్శలు, కామెంట్లకు సమాధానాలు ఇవ్వడం ఆయనకే చెల్లుతోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తీరుపై సొంతపార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని పునాదుల నుంచి కాపాడుకుంటూ వచ్చిన హరీశ్‌కి కూడా కేటీఆర్‌తో పాటే సముచిత స్థానం కల్పించాలన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆకాంక్షగా చెబుతున్నారు. కానీ ఆ కోణంలో ఇప్పటివరకూ పార్టీలో సాగుతున్న ప్రయత్నాలైతే కనిపించడం లేదు. అయితే ఈ విషయంలో మరో భిన్నమైన వాదన కూడా తెరపైకి వచ్చింది. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా హరీశ్‌ను జాతీయ రాజకీయాల్లో తనకు తోడుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో, పార్టీలో పూర్తి స్థాయి భాద్యతలు అప్పగించడం లేదని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.
– సప్తగిరి.జి, 9885086126

ఎన్నో సవాళ్లు


ఎన్నో సవాళ్లు

ఎన్నో సవాళ్లు!

ఎన్నో సవాళ్లు!
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రెండో సారి పాలనా పగ్గాలు చేపట్టింది. ఉద్యమకాలం నాటి కంటే కూడా ఓటర్లు అత్యధిక మెజారిటీని కట్ట బెట్టారు. ఈ క్రమంలోనే ప్రజలు ఆ పార్టీ బాధ్యతను మరింత పెంచారు. 2014లో టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో చాలావరకు హామీలుగానే మిగిలిపోయినా తెలంగాణ కొత్త రాష్ట్రం అని, తొలి నాలుగేళ్లే కావడంతో హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయామని అధినాయకులు వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఇవ్వని హామీలను నెరవేర్చగలిగామని ప్రచారం చేసుకున్నారు. పైగా 60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై అధికారాన్ని ఐదేళ్లలోనే తిరిగి ఢిల్లీకో, అమరావతికో అప్పగిద్దామా? అని సూటిగా ప్రశ్నించారు.
పెండింగ్‌ హామీలు
ఈ ఎన్నికల్లో మొత్తం 24 అంశాల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. అయితే 2014లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. ఇక కొత్త మేనిఫెస్టోపై ఎలా ముందుకెళ్తారన్న విమర్శలు అప్పుడే వినిపిస్తున్నాయి.
తాగు, సాగునీటిపై ప్రధాన దష్టి
2014 మేనిఫెస్టోలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పుకున్నారు. అది కార్యరూపం దాల్చలేదు. రెండో సారి గెలిచిన తర్వాత కేసీఆర్‌ ఆ లక్ష్యం నెరవేరుస్తా మని మరోసారి హామీ ఇచ్చారు. కొత్తగా పది థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తామని, తద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా మన్నారు. అయితే పది విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం జరగలేదు. కానీ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఆశించినంతగా అమల్లోకి రాలేదు. జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, మండల స్థాయిలో 30 పడకల ఆస్పత్రుల నిర్మాణాలు హామీలుగానే మిగిలాయి. పెన్షన్ల మొత్తం పెంచడం ప్రజల్లో సంతృప్తికి కారణమైంది.
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై విపక్షాలు, ప్రజల నుంచి విమర్శల దాడి జరుగుతోంది. ఒకటీ రెండు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నిర్మించి, వాటిని మాత్రమే చూపిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ హామీ ఎప్పటికి పూర్తవుతుందో అని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌ బహిరంగ సభల్లో వెయ్యి మంది దాకా యువకులు తెలంగాణ కోసం అమరు లయ్యారని స్వయంగా ప్రకటించినా అమరులను ఆదుకున్న సంఖ్య 400 దాటలేదు. అమరుల స్మతిచిహ్నం నిర్మాణ ప్రతిపాదన చర్చలోకే రాలేదు.
కార్యరూపం దాల్చనివే ఎక్కువ
ఎస్సీలకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి; ఎస్టీలకు, మైనార్టీలకు 12శాతం; చట్టసభల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు ఓ ప్రహసనంగానే మిగిలాయి. రాష్ట్రంలో ప్రత్యేక టెక్స్‌టైల్‌ జోన్‌, మహిళా బ్యాంకులు, మహిళా పోలీస్‌స్టేషన్లు, మహిళా సంక్షేమబోర్డు ఏర్పాటు వంటి హామీలు ప్రతిపాదన లకు కూడా నోచుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్కేల్‌తో సమానంగా వేతనాలు, పెన్షన్లు ఇస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీ పక్కనబెడితే సీపీసీ విషయంలోనే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచుతామన్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక, హామీల గురించి ప్రశ్నిస్తే ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని హెచ్చ రించడం వివాదమైంది. మరోవైపు జర్నలిస్టులకు ఇంటిస్థలాలు, ఇళ్లు, అందరికీ అక్రిడిటేషన్‌, హెల్త్‌ కార్డులు, జర్నలిస్టు భవన్‌ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు కోర్టు జోక్యంతో అమలు చేయలేకపోయామన్నారు. మైనింగ్‌ యూనివర్సిటీ, కొత్తగా భూగర్భగనుల తవ్వకం కూడా అటకెక్కాయి. కాజిపేట్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊగిసలాడుతూనే ఉంది. జిల్లాకేంద్రాల్లో రింగ్‌రోడ్లు, హైదరాబాద్‌-జిల్లా కేంద్రాల మధ్య నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం, పుణె తరహాలో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ మరిచిపోయారు. తెలంగాణ సినిమా లకు ప్రోత్సాహం అంటూ, ఆంధ్రా సినిమాలను ప్రోత్స హిస్తూ తెలంగాణ సినిమాలను చిన్నచూపు చూస్తున్నా రన్న విమర్శలు వినిపించాయి. మరో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనలోనూ కదలిక లేదు.
మిషన్‌ కాకతీయ ‘కమీషన్‌ కాకతీయ’గా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇంటింటికీ తాగునీటి నల్లా లక్ష్యంతో మొదలెట్టిన మిషన్‌ భగీరథ ఇంకా పూర్తికాలేదు. మిషన్‌ భగీరథ పూర్తయితే తప్ప తదుపరి ఎన్నికల్లో ఓట్లు అడగబోనన్న కేసీఆర్‌ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి ఆ మాటను పక్కన బెట్టారు.
వెంటాడనున్న కొత్త మేనిఫెస్టో
ఇప్పుడు 2018లో హామీలు పరిశీలిస్తే అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.3,016కు పెంచుతా మన్నారు. వద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసును 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. నిరుద్యోగు లకు నెలకు రూ.3,016 భతి చెల్లిస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తామని, సొంతస్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తామని, రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయం 8 నుంచి 10 వేలకు పెంచుతామని, లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్‌ అమలుకు పోరాటం కొనసాగిస్తామని 2014 హామీ రిపీట్‌ చేశారు. రెడ్డి కార్పొరేషన్‌, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రకులాల్లోని పేదలకూ ప్రత్యేక పథకాలు అమల్లోకి తెస్తామని, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరికీ అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్స రాలకు పెంచడంతో పాటు ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని మరో మూడేళ్లు పెంచుతామనీ అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు, హైదరా బాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తామని తాజా మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ చెప్పింది.
ఇప్పుడా ఛాన్స్‌ లేదు
మొదటి విడత అధికారంలో తెలంగాణ పసిగుడ్డు అని చెప్పుకున్నారు. నిజంగానే కొత్తరాష్ట్రం సర్దుకోవడానికి, కుదురుకోవడానికి సమయం పట్టింది. మొదటి ప్రభుత్వంలో పూర్తిస్థాయి అనుభవం ఉండటంతో పాటు.. హామీలివ్వని వినూత్న పథకాలు కూడా ప్రవేశపెట్టడం, రెండోసారి ఇచ్చిన హామీల స్థాయి అంతకుమించి ఉండటంతో రెండోసారి ప్రకటనలతో దాటవేసేందుకు, చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు.
– సప్తగిరి.జి, 9885086126
ప్రాంతీయం, విశ్లేషణ

సరికొత్త చరిత్ర