26, జూన్ 2019, బుధవారం

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…
ఎన్నికల తంతు పూర్తయి, అధికారికంగా ఫలితాలు వెలువడి 20 రోజులు గడిచినా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో కొలువుదీరలేదు. గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ¬ంమంత్రిగా మహమూద్‌ అలీ మినహా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సొంత రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అతి విశ్వాసం!
అత్యధిక స్థానాలు గెలుపొంది.. తెలంగాణ రాష్ట్ర సమితి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌లో తనకు తిరుగేలేదన్న ఆత్మవిశ్వాసం ఎక్కువైందని విపక్షాలు విమర్శి స్తున్నాయి. తాను చెప్పిందే వేదం.. తాను తీసుకున్న నిర్ణయాలే ఫైనల్‌ అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి కనిపిస్తోందని.. అందుకు నిదర్శనం రాష్ట్రంలో ఇంకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
ఇద్దరే..!
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంటరిగా కాకుండా ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి నుంచీ ఊహించినట్లే గతంలో నాయిని నిర్వ హించిన ¬ంశాఖ మంత్రి పదవిని మహమూద్‌ అలీకి కట్టబెట్టారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ¬ంమంత్రి మినహా అధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఈ పరిణా మాలు విపక్షాల విమర్శలకు కారణమవుతున్నాయి. కానీ కేసీఆర్‌ మాత్రం విపక్షాల విమర్శలను అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
పాలన గాలికొదిలి..
రాష్ట్రంలో పాలన విధానాలను గాలికొదిలి ముఖ్యమంతి కేసీఆర్‌ దేశ రాజకీయాలంటూ పర్యటనలు చేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం.. విశాఖలో శారదాపీఠాన్ని సందర్శించి.. ఒడిశా, అటునుంచి పశ్చిమబంగలో పర్యటనలు సాగించడం, చివరగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోదీని కలిసి రావడం రాజకీయంగా గందరగోళాన్ని సష్టించింది. అసలు తనను గెలిపించిన ప్రజలకు సీఎం ఏం సందేశం ఇస్తున్నారన్న ప్రశ్నను లేవనెత్తుతోంది.
సాధారణంగా ఇల్లు చక్కదిద్దుకొని బయట పనులు చూసుకోవాలంటారు. కానీ కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వాన్ని వదిలేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటనలు సాగించడం ఒక్క కేసీఆర్‌కే చెల్లుతోందన్న విమర్శలు చివరకు సొంతపార్టీ నుంచి కూడా వ్యక్తమవు తున్నాయి.
అందుకేనా?
తన కుమారుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ అత్యంత తెలివిగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఎన్నికల ముందునుంచే కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టి.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవసరమైతే ఢిల్లీలోనే మకాం వేస్తారన్న చర్చ జరిగింది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఈ వాదనలను బలపరిచాయి. అందరూ అనుకున్నట్లే ఎన్నికలు పూర్తవగానే కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని కట్టబెట్టారు. అంటే పార్టీలో తన తర్వాత కేటీఆరే నన్న సంకేతాలు ఇచ్చారు కేసీఆర్‌. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన స్థానం అలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సముచిత స్థానం ఇవ్వాల్సిందే!
కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు ఇవ్వాలన్న ఆలోచనే తొందరపాటు చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్లకే ఇంత తొందర అవసరమా? అన్న ప్రశ్నలు కూడా వినిపి స్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హరీశ్‌కి కూడా తగిన ప్రాధాన్యం కలిగిన పదవి ఇస్తే బాగుంటుందన్నది ఆయన అభిమానులు, సన్నిహితుల ఆలోచనగా తెలుస్తోంది.
జోరు పెంచిన కేటీఆర్‌
అటు కేటీఆర్‌ కూడా తండ్రికి తగ్గ తనయుడిలాగే దూసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటనలకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన కృతజ్ఞత సభల్లో పాల్గొన్నారు. మొదట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం కాగానే పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీని మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. కేటీఆర్‌ రాష్ట్రం మొత్తం పర్యటించి మంచి పట్టు సాధించిన తర్వాతే మంత్రివర్గాన్ని కొలువుదీర్చాలన్న ప్రతిపాదన కేసీఆర్‌లో ఉన్నట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కేటీఆర్‌ సుడిగాలి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.
కుటుంబ పాలన!?
అసలు తొలి ప్రభుత్వంలోనే కుటుంబ పాలన అన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు కేసీఆర్‌. అయినా ఆ విమర్శలను పట్టించుకోలేదు. కుమారుడు, కూతురు, మేనల్లుడి పదవులు రాజ్యాంగ బద్ధంగా గెలిచినవని సర్దిచెప్పుకున్నారు. కానీ.. రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని సృష్టించి మరి తన కుమారుడికి కట్టబెట్టడం ఓ రకంగా రాజకీయ కలకలం సష్టించింది. కుటుంబ పాలన అన్న విమర్శ లను వాస్తవం చేసే దిశగానే కేసీఆర్‌ మళ్లీ అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిజర్వేషన్ల ‘లొలి’
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించు కోవాలని బీసీ కుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాయి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, దీనికోసం సీఎం అధ్యక్షతన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రితో చర్చించి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని వారు సూచించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించా లని కాంగ్రెస్‌ పార్టీ సైతం డిమాండ్‌ చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతాన్ని తగ్గించలేదని.. ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి పోరాటానికి పిలుపునిచ్చిన పాల్గొనడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అయితే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ అంశం గురించి కేసీఆర్‌ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని, ఏబీసీడీఈ వర్గీకరణ చేయాలని కోర్టుకెళ్లిన కాంగ్రెస్‌ నేతలే ఇప్పుడు రిజర్వేషన్లు తగ్గాయంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చి బీసీలకు 61.19 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ పెట్టాం. అది ఆమోదం కూడా పొందిన తర్వాత కాంగ్రెస్‌ నేతలే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలని హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. దాంతో హైకోర్టు దాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తే ఆ కోర్టు కూడా కొట్టేసింది. పైగా జనవరి 10 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు నిర్వహించవలసి వస్తోందని కేసీఆర్‌ చెప్పారు.
ఈ అంశంలో నిజానిజాలను పక్కన పెడితే ఎన్నికల తర్వాత ఘోర పరాజయం పాలై తలో దిక్కూ వెళ్లిపోయిన కూటమి పార్టీలన్నీ మళ్లీ ఏకతాటి మీదకొచ్చినట్టుగా తెలుస్తోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు కూటమి పార్టీలన్నీ కలసి పోరాడతాయని పిలుపునిచ్చాయి.

హరీశ్‌కు తగ్గిన ప్రాధాన్యం!

రోజురోజుకి టీఆర్‌ఎస్‌లో పార్టీ ముఖ్య నేత, కేసీఆర్‌కు మేనల్లుడు హరీశ్‌రావుకు ప్రాధాన్యం తగ్గుతోందనే చెప్పాలి. కావాలనే కేసీఆర్‌ ..తన తనయుడు కేటీఆర్‌ను ముందుకు తీసుకొచ్చారన్న ప్రచారం సొంతపార్టీలోనే సాగుతోంది. అయితే హరీశ్‌కి స్వతహాగా ఉన్న ఇమేజ్‌ను ఏదీ అడ్డుకోలేక పోయింది. ఆయన ఈ ఎన్నికల్లో లక్షా 20వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దేశ చరిత్రలోనే ఇప్పటిదాకా నమోదైన భారీ మెజారిటీల్లో ఇది రెండోది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా చూసు కుంటే ఇప్పటిదాకా నమోదైన అతిపెద్ద మెజారిటీ ఇదే. అంటే రాజకీయ నాయకుడిగా తనదైన స్థానానికి మరింత గట్టి పునాదులు వేసుకున్నారు హరీశ్‌. కానీ పార్టీలో చూస్తే ఆయనకు రోజురోజుకూ ప్రాధాన్యం తగ్గిపోతున్నట్లు పరిణామాలు సూచిస్తు న్నాయి. అయినా ఏ రోజూ అసంతప్తిని బయట పెట్టకుండా చిరునవ్వుతోనే విమర్శలు, కామెంట్లకు సమాధానాలు ఇవ్వడం ఆయనకే చెల్లుతోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తీరుపై సొంతపార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని పునాదుల నుంచి కాపాడుకుంటూ వచ్చిన హరీశ్‌కి కూడా కేటీఆర్‌తో పాటే సముచిత స్థానం కల్పించాలన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆకాంక్షగా చెబుతున్నారు. కానీ ఆ కోణంలో ఇప్పటివరకూ పార్టీలో సాగుతున్న ప్రయత్నాలైతే కనిపించడం లేదు. అయితే ఈ విషయంలో మరో భిన్నమైన వాదన కూడా తెరపైకి వచ్చింది. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా హరీశ్‌ను జాతీయ రాజకీయాల్లో తనకు తోడుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో, పార్టీలో పూర్తి స్థాయి భాద్యతలు అప్పగించడం లేదని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.
– సప్తగిరి.జి, 9885086126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి