14, ఏప్రిల్ 2018, శనివారం

గుట్టువిప్పిన కాగ్‌

గుట్టువిప్పిన కాగ్‌

గుట్టువిప్పిన కాగ్‌
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాగ్‌ పేర్కొంది. రెవెన్యూలోటు ఉంటే మిగులు చూపారని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని దాటారని ఎత్తిచూపింది. రాష్ట్ర పురోభివృద్ధిలో ఆర్థిక నిర్వహణ అత్యంత కీలకం. ఈ అంశంలో ఉదాసీనత, నిబంధనలు ఉల్లంఘించడం, జవాబు దారీగా వ్యవహరించక పోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా అవినీతికి, నిధుల దుర్వినియోగానికి దారి తీస్తుందని కాగ్‌ హెచ్చ రించింది. రాష్ట్రంలో రూ.5392 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా రూ.1386 కోట్ల రెవెన్యూ మిగులును చూపారంది. అప్పు తెచ్చుకున్న నిధులను రెవెన్యూ రాబడులుగా జమచేసి ద్రవ్యలోటును రూ.2500 కోట్లు తక్కువ చేశారంది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 3.5 శాతమైతే, వాస్తవంగా 4.3 శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఖర్చును పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో బలహీనతలు స్పష్టంగా ఉన్నాయని కాగ్‌ తెలిపింది.
తెలంగాణ ధనిక రాష్ట్రమని ఊదరగొడుతున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాగ్‌ నివేదిక చెంపపెట్టు లాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని తాము చెప్పిన మాటలను అపహాస్యం చేశారని తమ ఆరోపణలన్నీ కాగ్‌ నివేదికతో బహిర్గతమయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ మిగులు ఉన్న రాష్ట్ర మంటూ ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.
ఏజి రాజీనామా
అజీబ్ సింగ్ (ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్)
గతవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో నెలకొన్న ప్రకంపనలు మరుసటి వారం కూడా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా ప్రభుత్వ పరంగా, రాజ కీయంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ప్రభుత్వానికి, ఏజికి మధ్య సమన్వయం కొరవడిందన్న సంకేతాలు వెలువడ్డాయి. తన మాటకు ప్రభుత్వం పెద్దగా విలువ ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న చర్చ న్యాయవర్గాల్లో సాగుతోంది.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజున సభలో కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ శాసన సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేశారు. ఈ ఘటన మార్చి 12న జరగగా వారి సభ్యత్వాల రద్దుకు సంబంధించిన బులెటిన్‌ను అసెంబ్లీ 13వ తేదీన విడుదల చేసింది. అయితే ఆ రెండు సీట్లు ఖాళీ అయినట్లు ఇచ్చిన నోటిఫికేషన్‌ గవర్నర్‌ ఆమోద ముద్రతో జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాని సభ్యత్వ రద్దు నుంచి నోటిఫికేషన్‌ వరకూ సచివాల యమే నిర్ణయం తీసుకుంది. ఇందులోని లోపాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో ఆరు వారాల వరకూ షెడ్యూలు విడుదల చేయవద్దని ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి సంబంధించిన సిసి ఫుటేజీని మార్చి 27వ తేదీలోగా తమకు సీల్డ్‌ కవర్లో అందజేయాలని అదేరోజు అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆయన అంగీక రించారు. అయితే తమ అనుమతి తీసుకోకుండానే సిసి ఫుటేజీలు కోర్టుకు ఇస్తామని ఏజి హామీ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు తెలియకుండానే ఈ కేసును వాదించే బాధ్యతలు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వేకు ప్రభుత్వం అప్పగిం చిందన్న నిర్ణయం ఏజిని మనస్తాపానికి గురిచేసిందం టున్నారు.
కొత్త పంచాయతీరాజ్‌ బిల్లు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పంచాయతీరాజ్‌ కొత్త బిల్లు, మున్సిపల్‌ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో కాలం చెల్లిన పాత చట్టం స్థానంలో కొత్త అంశాలు వచ్చి చేరాయి. సభ ఆమోదించటానికి ముందు పంచాయతీరాజ్‌ బిల్లులోని కొన్ని అంశాలపై బిజెపి, తెలుగుదేశం, సిపిఎం సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేయగా వాటికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమాధానమిచ్చారు. బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని బిజెపి, తెలుగు దేశం, సిపిఎంలు కోరాయి. ఈ బిల్లు ఆదరా బాదరాగా తెచ్చిందేమీ కాదని, రెండేళ్లుగా వందల సంఖ్యలో సమావేశాలను నిర్వహించి అనేక మంది నిపుణుల నుంచి అభిప్రాయాలను తెలుసుకొన్న తర్వాతే వివిధ అంశాలను పొందుపర్చామని సిఎం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల సమగ్రచట్టం కూడా తీసుకొస్తామని ప్రకటించారు.
ఈ భేటీ వెనక మర్మమేంటి ?
కేంద్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ను సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు పలు దఫాలుగా ప్రకాష్‌రాజ్‌ కెసిఆర్‌తో చర్చించారు. గతంలోనే సిఎంను కలిసేందుకు ప్రకాష్‌రాజ్‌ సమయం కోరగా మార్చి 29వ తేదీన ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా సిఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంతో ప్రకాష్‌రాజ్‌ వెళ్లారు. మొదట రెండు గంటలపాటు ప్రకాష్‌రాజ్‌తో భేటీ అయిన కెసిఆర్‌ అసెంబ్లీకి తనతో పాటు ఆయనను కూడా తీసుకెళ్లారు. తిరిగి అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లే సమయంలోనూ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో రెండు గంటల పాటు ప్రకాష్‌రాజ్‌తో చర్చలు జరిపారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చను లేవనెత్తింది. దేశంలో కొత్త జాతీయ కూటమి ఏర్పాటుకు సిఎం కెసిఆర్‌ తీసుకున్న చొరవను ప్రకాశ్‌రాజ్‌ ప్రశంసించినట్లు తెలిసింది.
– సప్తగిరి
( jagrithi
http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%97%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e2%80%8c/

3, ఏప్రిల్ 2018, మంగళవారం

స్పీకర్‌ సంచలన నిర్ణయం

స్పీకర్‌ సంచలన నిర్ణయం

స్పీకర్‌ సంచలన నిర్ణయం

తెలంగాణలో గడిచిన వారం అనూహ్య పరిణా మాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజు గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టేబుల్‌ ఎక్కి హెడ్‌ఫోన్‌ విసరడంతో ఆ హెడ్‌ఫోన్‌ తగిలి శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కుడికంటికి గాయమైంది. దీంతో ఆయనకు సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొదట 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆపరేషన్‌ అవసరం లేదని ప్రకటించి డిశ్చార్జ్‌ చేశారు.
స్పీకర్‌ సంచలన నిర్ణయం
ఈ పరిణామం తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తూ గెజిట్‌ జారీచేశారు. దాన్ని ఎలక్షన్‌ కమిషన్‌కూ పంపించారు. అంతేకాదు, గవర్నర్‌ ప్రసంగానికి ఆటకం కలిగిస్తూ నినాదాలు చేశారంటూ అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డితో సహా 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బడ్జెట్‌ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‌ చేశారు. వారిలో జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డి ఉన్నారు.
అటు శాసన మండలిలోనూ విపక్ష నేత షబ్బీర్‌ అలీతో పాటు మరో ఐదుగురు సభ్యులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, సంతోష్‌, దామోదర్‌ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలను ఈ సెషన్‌ ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు.
ఇదే ప్రథమం
అయితే ఎమ్మెల్యేల సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేయడం దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిణామం ఎక్కడా చోటు చేసుకోలేదని అంటున్నారు. ఈ చర్యను అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.
అలా ఎందుకు చేయలేదు ?
తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు గాంధీభవన్‌లో 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ సీనియర్లు, ముఖ్యనేతలంతా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరాం కూడా దీక్షా శిబిరానికి వచ్చి తన మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యం దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరించొద్దని టిజెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ సూచించారు. ఒకవేళ శాసన సభ్యులు సభా సంప్రదాయాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే ఎథిక్స్‌ కమిటికి ఎందుకు సిఫారస్‌ చేయలేదని, ఏకపక్షంగా సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
దీక్ష అనంతరం ఢిల్లీలో జరిగిన ఎఐసిసి ప్లీనరీకి తెలంగాణ నుంచి ముఖ్యనేతలంతా తరలివెళ్లారు. అయితే.. అసెంబ్లీ సభ్యత్వం రద్దయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేల కోటాలో గదులు కేటాయించొ ద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. వాళ్లను మాజీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
హైకోర్టులో పిటిషన్‌
ఇదే పరిణామంపై కాంగ్రెస్‌ నేతలు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ తన పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ నేతల తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. సభలో గవర్నర్‌ ఉన్న సమయంలో గవర్నర్‌ నేతత్వంలో సభ నడుస్తుందని, సమావేశాలు మొదలయ్యాక సభ స్పీకర్‌ అధీనంలోకి వస్తుందని, కానీ ఈ వ్యవహారంలో సభ్యత్వాలు రద్దు చేసే నిర్ణయం స్పీకర్‌ తీసుకున్నారని పాయింట్‌ లేవనెత్తారు. పైగా ముందస్తు హెచ్చరిక లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని న్యాయస్థానం దష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో ఆయనను సాగనంపిన సమయంలో బాగానే ఉన్న మండలి చైర్మన్‌ ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే సంపత్‌ వీడియోలో లేకున్నా అతనిపై కూడా చర్యలు తీసుకున్నారని వాదించారు. మొత్తానికి సభ్యత్వాల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశ్యం కనిపిస్తోందని కోర్టు దష్టికి తీసుకెళ్లారు. వీరి వాదనలు విన్న హైకోర్టు మరో 6 వారాల వరకు నల్గొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల సిడిని 22వ తేదీ లోగా కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో పెట్టి ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.
ఎవరి వ్యూహాల్లో వారు..
ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించింది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుండటంతో కాంగ్రెస్‌ పార్టీని ఆత్మరక్షణలో పడేయడంలో భాగంగానే అదను చూసి టిఆర్‌ఎస్‌ సర్కారు గతంలో ఎప్పుడూ లేని నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇటు భారతీయ జనతాపార్టీ తన వ్యూహాల్లో నిమగ్నమైంది.
ఈ నేపథ్యంలోనే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. బిజెపి రాష్ట్ర పదాధికారులు, ఒబిసి మోర్చా, సోషల్‌మీడియా సమావేశాల్లో ప్రసంగించారు. 2014 తర్వాత దేశంలో 14 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. త్రిపురలో సంస్థాగతంగా ఎలాంటి బలం లేకపోయినా అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్నాటక ఎన్నికల తర్వాత దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటా యని, తెలంగాణలోనూ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తామని ప్రకటించారు. దీంతో అప్పుడే తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– సప్తగిరి 
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AF%E0%B0%82/

మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?


మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?


మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?

- పవార్‌ అవరోధం.. కారత్‌ విశ్లేషణం..
తెలంగాణ సిఎం కెసిఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు మూడు వారాలుగా నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు అవసరమైన వ్యూహాలు, నెలకొన్న సమస్యలు, వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితుల గురించి ముమ్మరంగా హోమ్‌వర్క్‌ చేశారు. ఈ క్రమంలోనే కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కెసిఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటన చేశాక వేసిన తొలి అడుగు ఇదే. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటులో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇద్దరూ కలిసి సమష్టిగా మీడియాతో మాట్లాడారు.
కోల్‌కతా వేదికగా తొలి కూటమి పురుడు పోసుకోవడం ఆనందంగా ఉందని కెసిఆర్‌ చెప్పారు. మమతతో భేటీకి చాలా ప్రాధాన్యముందని, చర్చలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగాయని, కొన్ని అంశాలపై అంగీకారం కూడా కుదిరిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కూటమి ఒకటి, రెండు పార్టీలకు మాత్రమే పరిమితం కాదన్న కెసిఆర్‌ ఇది ప్రజాకూటమిగా ఉంటుందన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఇది మంచి ఆరంభం. దేశం మార్పు కోరుకుంటోంది. దేశాభివృద్ధి లక్ష్యంగా బలమైన సమాఖ్య కూటమిపై కెసిఆర్‌తో చర్చించాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలోపేతమవుతుంది. మాకు బలమైన దార్శనికత ఉంది. ఈ కూటమికి నాయకత్వం సమస్య రానేరాదు. భావసారూప్యమున్న అన్ని పార్టీలను కలుపుకొని పోతాం’ అని చెప్పారు.
థర్డ్‌ ఫ్రంట్‌ను నడిపించేది తానేనని కెసిఆర్‌ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తాము ఏ పార్టీ దగ్గరికి వెళ్లబోమని కెసిఆరే ఓ ఫ్రంట్‌ అని ఆయన కుమారుడు తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కూడా ఓ సందర్భంలో చెప్పారు. కానీ దానికి భిన్నంగా కెసిఆరే మొదటగా కోల్‌కతా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఫ్రంట్లో ఎవరికి అవకాశం ఇచ్చినా ఫ్రంట్‌ నాయకుడిగా మాత్రం కెసిఆరే ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. పలు సందర్భాల్లో కెసిఆర్‌ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు కూడా. ఫ్రంట్‌ ప్రయత్నం సక్సెస్‌ అయితే ప్రధాని పీఠంపై కూర్చుంటానని, లేదంటే తెలంగాణకే పరిమితమవుతానని అంతర్గత సమావేశాల్లో కెసిఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సన్నిహితులు చెబుతు న్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకంగా ఎవరు ముందుకొస్తారా అని ఎదురుచూస్తున్న మమతా బెనర్జీ యాక్టివ్‌ కాకముందే తానే వెళ్లి ఆమెను కలిస్తే నాయకత్వం విషయంలో తర్వాత పేచీ ఉండబోదన్నది కెసిఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే ఇలాంటి కలల్లో ఉన్న కెసిఆర్‌కు కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ షాకిచ్చారు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో ఎన్‌డి టివితో మాట్లాడిన జెఠ్మలానీ కెసిఆర్‌ నెలకొల్పబోయే ఫెడరల్‌ ఫ్రంట్‌కు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతం కాగలదని స్పష్టం చేశారు. దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ నడపగలిగే శక్తి, సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే రాం జెఠ్మలాని కెసిఆర్‌ గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
మరోవైపు కెసిఆర్‌ ఫ్రంట్‌కు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ అవరోధంగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన.
2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్‌సిపి కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో శరద్‌పవార్‌కున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పరస్పర అవగాహనలో భాగంగానే బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నిటినీ తన చిరకాల మిత్రుడు కాంగ్రెస్‌ వెనక మోహరింపజేసే కృషిని శరద్‌ పవార్‌ తన భుజాలపై వేసుకుని యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి తెలిసిన మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కోల్‌కతాలో తన భేటీని ఫలవంతం అని మాత్రమే పేర్కొన్నారని విశ్లేషకులు అంటున్నారు. బిజెపియేతర కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచే ప్రతిపాదనపై తొందర వద్దని, భావసారూప్య పార్టీలన్నిటితో చర్చలు జరగనివ్వాలని కెసిఆర్‌కు మమతా సూచించారని సమాచారం.
ఇదే సమయంలో సిపిఎం సీనియర్‌ నేత ప్రకాష్‌ కారత్‌ వ్యాఖ్యలు కూడా థర్డ్‌ఫ్రంట్‌ అంశంపై కీలకంగా నిలుస్తున్నాయి. కెసిఆర్‌ మూడో కూటమి నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించబోవని ప్రకాశ్‌ కారత్‌ అభిప్రాయపడ్డారు. ‘ఒక్క కెసిఆరే కాదు ఆ ప్రయత్నం ఎవరు చేసినా అంతే. బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి నిర్మించడం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలు వేరు. విధి విధానాల్లో, ప్రాంతీయ ప్రయోజనాల్లో ఎన్నో వైరుధ్యాలుంటాయి. ఇవన్నీ వాటి వాటి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక గొడుగు కిందకి రావడం అసాధ్యం. ఒకవేళ కూడగట్టినా అవి నిలబడవు. డిఎంకె, ఆర్‌జెడి లాంటి పక్షాలు ఎప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉంటాయి. బిజెపిని ఓడించాలంటే ఒక్కటే మార్గం. రాష్ట్రాల వారీగా బిజెపి-వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో జరిగింది ఇదే’ అని ప్రకాశ్‌ కారత్‌ పేర్కొన్నారు. గతంలో యుపిఏ తరహాలో ఓ కూటమి ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని అయితే కాంగ్రెస్‌ పట్ల విశ్వసనీయత లేనందున దాని సారథ్యానికి మిగిలిన పార్టీలు సమ్మతించవని, అందుచేత కాంగ్రెస్‌ నేతృత్వ ఫ్రంట్‌ కూడా విఫలమవుతుందని కారత్‌ తేల్చేశారు.
– సప్తగిరి, 9885086126

link :   ()
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%81/

13, మార్చి 2018, మంగళవారం

ప్రజాస్వామ్యం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్న శక్తులు


అన్ని మతాలనూ ఆదరిస్తోన్న ప్రజాస్వామిక దేశం భారతదేశం. వసుధైవకుటుంబకం అని ప్రపంచమంతా ఒక కుటుంబంగా భావించిన మహోన్నత ఔదార్యం భారతీయులది. కానీ రాజకీయ, ఆర్ధిక, సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కొందరు హిందూ సమాజాన్ని చీల్చే పనిలో పడ్డారు. మతాలు వేరైనా కలిసి ఉంటున్న జనం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యం పేరిట కొద్దిమంది ప్రజలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారుతున్నారు. ఆ ప్రజాస్వామ్యం వల్లే తమలాంటి మతాలకు ఇక్కడ చోటు దక్కిందన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చి పోతున్నారు.

మొన్నటి గుజరాత్‌ ఎన్నికల్లో, నిన్నటి నాగాలాండ్‌ఎన్నికల్లో భయంకర పరిణామాలు సమాజంలో ప్రకంపనలు సష్టిస్తున్నాయి. మతం పేరిట ఈ కుప్పిగంతుల వ్యవహారాలు అవసరమైనంత స్థాయిలో ప్రచారంలోకి రాకున్నా.. చాపకింద నీరులా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు దాపురించాయి. 
గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా  గాంధీనగర్‌ అర్జిడయాసిస్‌పేరిటఆర్చ్‌బిషప్‌ థామస్‌మాక్వాన్‌ సంతకంతో ఓ లేఖ విడుదలైంది. జాతీయవాద దళాల నుంచి భారత దేశాన్ని రక్షించేందుకు.. ప్రార్థన చేయాలని, జాతీయవాదులంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్లకు ఓటు వేయొద్దని ఆ లేఖ సారాంశం. అంతేకాదు.. మనదేశం లౌకిక ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందని కూడా లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రభావం దేశమంతా కనిపించే అవకాశం ఉన్నందున.. ఇక్కడ ఎన్నికల్లో సైలెంట్‌గా తమపని తాము చేసుకుపోవాలని పిలుపునిచ్చారు ఆర్చ్‌బిషప్‌.
ఇప్పుడు నాగాలాండ్‌లోనూ ఇదే పరిస్థితి పునరావతమైంది. నాగాలాండ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ కౌన్సిల్‌ పేరిట ఎన్నికల సమయంలో లేఖ విడుదలయ్యింది. ఎన్నికల్లో మీరు త్రిశూలం వైపు వెళ్తారా..? సిలువవైపు నిలుస్తారా? అని ప్రశ్నిస్తూ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అట్సిడోలి సంతకంతో ఈ బహిరంగలేఖ సంధించారు. హిందూత్వ వాదులకు ఓటు వేయొద్దని చర్చ్‌కౌన్సిల్‌పిలుపునిచ్చింది. ఈశాన్య ప్రాంతంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలని క్రైస్తవులకు సూచించింది. 
మరోవైపు.. గుజరాత్‌లో జిగ్నేష్‌మేవాని దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఓ దళిత నాయకుడిని పోలీసులు అరెస్ట్‌చేశారన్న సాకుతో నిరసనలు చేపడుతూ అమాయక దళితులను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారన్న విమర్శలున్నాయి. యూపీలోని షెహరాన్‌ జిల్లాలో ఠాకూర్‌-దళిత ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజాద్‌ను గత ఏడాది జూలైలో హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరిసిస్తూ ఇప్పుడు జిగ్నేష్‌మేవాని జనంలో చిచ్చు రేపుతున్నారు. 
మహారాష్ట్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించి భీమా కొరిగావ్‌హింసకు కారణమైన జిగ్నేష్‌మేవానిపై పుణే పోలీసులు కేసు ఫైల్‌చేశారు. అయితే. పుణే పోలీసులు కేసు బుక్‌చేసిన తర్వాత రోజే మహారాష్ట్రలో మాయమై, ఢిల్లీలో ప్రత్యక్షమైన మేవాని, తనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఢిల్లీలో యువ హంకర్‌ర్యాలీ తలపెట్టాడు. కానీ జనం లేక సభ వెలవెల బోయింది. సభలో మొత్తం ఖాళీ కుర్చీలే కనిపించాయి. వేలమంది హాజరవుతారనుకున్న సభకు కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే హాజరు కాగా, అందులో వందమందిదాకా పాత్రికేయులున్నారు. మరో 100మంది జిగ్నేష్‌మేవాని అనుచరులే కావడం గమనార్హం. 
కొన్ని దశాబ్దలుగా దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలు జాతీయవాదానికి బీటలు వారుస్తున్న దుష్ట శక్తుల పన్నాగాలను స్పష్టం చేస్తున్నాయి. సాంస్కతిక జాతీయ వాదాన్ని వ్యతిరేకించే శక్తులు దేశంలో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి పని గట్టుకొని ప్రయత్నం చేస్తున్నాయి. 
ఇప్పుడిప్పుడే కుంభకోణాల నుంచి బయటపడుతూ.. అవినీతి, అక్రమాల రహితంగా దేశం ముందుకు దూసుకెళ్తున్న సమయంలో మత సంస్థలు, జిగ్నేష్‌లాంటి వ్యక్తులు చేసే ఇలాంటి జిమ్మిక్కులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఇలాంటి వాళ్ల వెనకున్న కుట్రలను తెలుసుకుంటూ జాగరూకతతో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 
- హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మార్చి 2018 సంచికలో ప్రచురితం)
 
link : http://www.lokahitham.net/2018/03/blog-post_52.html

8, మార్చి 2018, గురువారం

హైద‌రాబాద్ పారిశ్రామిక య‌వ‌నిక‌పై మ‌రో మ‌ధుర జ్ఞాప‌కం

                                 -  వ‌రల్డ్ ఐటీ కాంగ్రెస్ స‌ద‌స్సుతో పెరిగిన తెలంగాణ ప్ర‌తిష్ట‌

                                    
    హైద‌రాబాద్‌లో మొట్ట‌మొద‌టి సారిగా జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఐటీ కాంగ్రెస్ స‌ద‌స్సుతో ఇన్ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీలో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. హైద‌రాబాద్ పారిశ్రామిక యవనికపై మ‌రో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంలో తొలి ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ స్థాయి స‌ద‌స్సుల‌కు హైద‌రాబాద్‌ను వేదిక‌ను రూపొందించ‌డంలో ఇంకో మెట్టెక్కింది.  2018 తొలినాళ్ల‌లోనే ఐటీ కాంగ్రెస్ నిర్వ‌హ‌ణ‌తో తెలంగాణ ప్ర‌తిష్ట మ‌రోసారి ఖండాంత‌రాల‌కు తీసుకెళ్లేందుకు దోహ‌ద‌ప‌డింది.  అంతర్జాతీయ ఐటీ మార్కెట్‌లో మహానగరానికి ప్రత్యేక స్థానం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సు ద్వారా రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు లభించనున్నాయి. కొత్తగా వచ్చే ఐటీ సంస్థల ద్వారా భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో ఐటీ రంగంలో పెట్టుబడిదారులకు ఆసక్తి పెరిగింది. 35దేశాల నుంచి తరలి వచ్చిన ఐటీ సంస్థల అధిపతులు, నిపుణులు, ప్రతినిధులు హైద‌రాబాద్‌లో మౌళిక స‌దుపాయాలు చూసి ఫిదా అయ్యారు. వచ్చే నాలుగేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్.. కేంద్ర‌ప్ర‌భుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామా లకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరవేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నాస్కామ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ రంగంలో సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదిరింది. దీంతో వచ్చే రెండేళ్ళలో విరివిగా పెట్టుబడులు వస్తాయని భరోసా కుదిరింది.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గడిచిన మూడున్నరేళ్ళలోనే ప్రభుత్వం ప్రకటించిన ఐటి పాలసీ, టి-హబ్‌తో రాష్ట్ర ప్రతిష్ట ఎంతో పెరిగింది. వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో ఇక్కడ నెలకొల్పబడిన ఐటి కంపెనీల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఐటి కాంగ్రెస్‌లో 30 దేశాల నుంచి సుమారు 500 మంది వివిధ ఐటి కంపెనీల అధిపతులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 మంది ఐటిరంగ నిపుణులు పాల్గొన్నారు.   టాప్‌ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీరిలో ఉన్నారు. ఈ సదస్సులో 50కి పైగా చర్చాగోష్టిలు, మరో 50కి పైగా అత్యాధునిక ఐటీ రంగ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కేంద్ర సాంకేతిక విజ్ఞానశాఖ, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌), ప్రపంచ ఐటీ సర్వీసుల అలయెన్స్‌ (డబ్ల్యుఐటిఎఫ్‌)ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. 

    మొదటిరోజు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సును ప్రారంభించి  ప్రసంగించారు. డిజిటల్‌ ఇండియా లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, బాధ్యతలను గుర్తుచేశారు. అదే సమయంలో ఐటి సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, తద్వారా టెక్నాలజీ అభివ ద్ధి, ఆ పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరవేసే అంశాలపై ప్రధాని మార్గనిర్దేశం చేశారు. అనంతరం కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌, కేంద్ర ఐటిశాఖ కార్యదర్శి ఏపి సహాని, తెలంగాణ‌ ఐటిశాఖ మంత్రి కేటీ రామారావు తదితరులు తమ ప్రసంగాలతో ఐటి ప్రపంచాన్ని ఆకట్టు కున్నారు. అత్యంత మేధో సంపత్తి కలిగిన ఐటిరంగ నిపుణులు తమ విధి నిర్వహణలో పని ఒత్తిడిని తట్టుకునే విధానంపై ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్‌ గంటపాటు ప్రసంగించి ఐటి దిగ్గజాలను ఆనందపరవశంలో ముంచెత్తారు.

    కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌ స్టేట్‌గా ఎదుగుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌ద‌స్సు చివ‌రిరోజు ప్ర‌సంగంలో ఆశాభావం వ్య‌క్తం చేశారు.  విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు. టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు. భారత్‌లో తొలిసారి టెలి మెడిసిన్‌ను ఇక్కడే ప్రారంభించామని గుర్తు చేశారు. టీ ఫైబర్‌తో ఇండ్లు, స్కూళ్లు, పిహెచ్‌సిలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. గ్రామాల్లో కూడా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, ప్రతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని సూచించారు. ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారని, భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందని చెప్పారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య అని, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా చేయుచ్చు అని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలల డిజిటలైజేషన్‌ ప్రారంభించామని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి రాష్ట్రంలో ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఉద్ఘాటించారు. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు సెక్టార్‌ కంపెనీలు కూడా సామాజిక బాధ్యత కింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండో దశ టీ హబ్ త్వరలో ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్.. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం మార్చి 8న వీ హబ్ ప్రారంభిస్తామన్నారు.

    సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు తైవాన్‌లోని టాయుఆన్ నగరంతో తెలంగాణ‌ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకట్టుకోవడం, పరిపాలనలో సాంకేతిక సహకారం, సార్టప్‌లకు మద్దతు, విద్యా సంస్థలతో ఒప్పందాలు, అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులపై ప్రదర్శనల ఏర్పాటు విషయంలో పరస్పర సహకారం కోసం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

    తెలంగాణలో డాటాసైన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో నాస్కామ్‌ అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐటీ సదస్సులో రెండోరోజు రోబో సాఫియా ప్రసంగం, ఇంటర్వ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన చౌమహాలా ప్యాలెస్‌లో ప్రతినిధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్క తి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంగీత విభావరి వారిని అలరించింది. ఐటీ కాంగ్రెస్ చివ‌రిరోజున హెచ్‌ఐసీసీలో ప్రముఖ నటి దీపికా పదుకునే ప్రసంగం, కళాకారుల జానపద గేయాలు, ఆటలు, పాటలతో ఆనందోత్సాహాలతో సదస్సును ముగించారు.

    వచ్చే ఏడాది అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 9 వరకు అర్మేనియాలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ 23వ సదస్సును నిర్వహిస్తామని డబ్ల్యూఐటీఎస్‌ఏ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఐటీ, పరిశ్రమల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బాటన్‌ను అందుకున్నారు.
(జాగృతి వారపత్రిక కోసం 27.02.2018)
================

ప్రజాస్వామ్యం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్న దుష్టశక్తులు

                                                                                               - హంసిని సహస్ర సాత్విక

    అన్ని మతాలనూ ఆదరిస్తోన్న ప్రజాస్వామిక దేశం భారతదేశం. ప్రధానంగా హిందూ సంస్కృతికి పుట్టినిల్లయినా.. ఏ ఇతర మతాన్ని కూడా కించపరచని మహోన్నత వ్యక్తిత్వం హిందువులది. ఏ మతం వాళ్లయినా.. స్వేచ్ఛగా ఎదిగేందుకు ఏ చిన్న అడ్డంకి కూడా కలిగించక పోవడం వల్లే.. క్రమంగా ఇతర మతాల ప్రార్థనాలయాలు, జనాభా సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గల్లీ గల్లీకి చర్చీలు పుట్టుకొచ్చాయి. వాడవాడకూ మసీదులు వెలుస్తున్నాయి. చివరకు ఆ మంచితనాన్నే మరో రకంగా భావిస్తున్నాయి పరాయి మత మూకలు. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఏకంగా బహిరంగ లేఖలే విడుదల చేసే స్థాయికి చేరాయి.

    విచ్చల విడిగా తమ మత వ్యాప్తి చేసుకుంటూ నిలదొక్కుకున్న  క్రైస్తవ పాస్టర్లు, ఆర్చి బిషప్‌లు ఇక హిందూ సమాజాన్ని చీల్చే పనిలో పడ్డారు. మతాలు వేరైనా కలిసి ఉంటున్న జనం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యం పేరిట కొద్దిమంది ప్రజలను రెచ్చగొట్టే స్థాయికి దిగజారుతున్నారు. ఆ ప్రజాస్వామ్యం వల్లే తమలాంటి మతాలకు ఇక్కడ చోటు దక్కిందన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు.

    మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో, నిన్నటి నాగాలాండ్‌ ఎన్నికల్లో భయంకర పరిణామాలు సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరిట ఈ కుప్పిగంతుల వ్యవహారాలు అవసరమైనంత స్థాయిలో ప్రచారంలోకి రాకున్నా.. చాపకింద నీరులా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు దాపురించాయి.

    గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా నవంబర్‌ 21వ తేదీన గాంధీనగర్ అర్జిడయాసిస్‌ పేరిట ఆర్చ్‌ బిషప్‌ థామస్‌ మాక్వాన్‌ సంతకంతో ఓ లేఖ విడుదలైంది. జాతీయ వాద దళాల నుంచి భారత దేశాన్ని రక్షించేందుకు.. క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలని, జాతీయ వాదులంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్లకు ఓటు వేయొద్దని ఆ లేఖ సారాంశం. అంతేకాదు.. మనదేశం లౌకిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కూడా లేఖలో లెక్చర్లు ఇచ్చారు. గుజరాత్‌ ఎన్నికల ప్రభావం దేశమంతా కనిపించే అవకాశం ఉన్నందున.. ఇక్కడ ఎన్నికల్లో సైలెంట్‌గా తమపని తాము చేసుకుపోవాలని పిలుపునిచ్చారు ఆర్చ్‌ బిషప్‌. లేఖలో ఏ రాజకీయ పార్టీ పేరు ప్రస్తావించకుండా.. పరోక్షంగా బీజేపీని టార్గెట్‌ చేశారు.

    ఇప్పుడు నాగాలాండ్‌లోనూ ఇదే పరిస్థితి రిపీటయ్యింది. నాగాలాండ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ కౌన్సిల్‌ పేరిట ఎన్నికల సమయంలో లేఖ విడుదలయ్యింది. ఎన్నికల్లో మీరు త్రిశూలం వైపు వెళ్తారా..? సిలువవైపు నిలుస్తారా? అని ప్రశ్నిస్తూ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అట్సిడోలి సంతకంతో ఈ బహిరంగలేఖ సంధించారు. బిజెపి, హిందూత్వ వాదులకు ఓటు వేయొద్దని చర్చ్‌ కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. నార్త్‌ఈస్ట్‌ ప్రాంతంలో బీజేపీకి, హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలని క్రైస్తవులకు సూచించింది.

    మరోవైపు.. గుజరాత్‌లో జిగ్నేష్‌ మేవాని దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఓ దళిత నాయకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారన్న సాకుతో నిరసనలు చేపడుతూ అమాయక దళితులను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారన్న విమర్శలున్నాయి. యూపీలోని షెహరాన్ జిల్లాలో ఠాకూర్-దళిత ఘర్షణల్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజాద్‌ను గత ఏడాది జూలైలో హిమాచల్ ప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరిసిస్తూ ఇప్పుడు జిగ్నేష్‌మేవాని జనంలో చిచ్చు రేపుతున్నారు.

    అయితే.. 'యువ హంకర్‌ ర్యాలీ' పేరిట ఢిల్లీలో చేపట్టిన నిరసనలో జిగ్నేష్‌మేవానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జనాలు లేక బోసిపోయింది. తనకు మద్దతుగా వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావించిన జిగ్నేష్‌ మేవానికి శృంగ భంగమైంది. మహారాష్ట్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించి భీమా కొరిగావ్‌ హింసకు కారణమైన జిగ్నేష్‌ మేవానిపై పుణే పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. అయితే. పుణే పోలీసులు కేసు బుక్‌ చేసిన తర్వాత రోజే మహారాష్ట్రలో మాయమై, ఢిల్లీలో ప్రత్యక్షమైన మేవాని, తనకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని, దానిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో యువ హంకర్‌ ర్యాలీ తలపెట్టాడు. కానీ జనం లేక సభ వెలవెలబోయింది. సభలో మొత్తం ఖాళీ కుర్చీలే కనిపించాయి. వేలమంది హాజరవుతారనుకున్న సభకు కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే హాజరు కాగా, అందులో వందమందిదాకా పాత్రికేయులున్నారు. మరో 100మంది జిగ్నేష్‌ మేవాని అనుచరులే కావడం గమనార్హం.

    కొన్ని దశాబ్దలుగా దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలు జాతీయ వాదానికి బీటలు వారుస్తున్న దుష్ట శక్తుల పన్నాగాలను స్పష్టం చేస్తున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదాన్ని వ్యతిరేకించే శక్తులు దేశంలో అంతర్గత సంఘర్షణలు నిర్మాణం చేయటానికి పని గట్టుకొని ప్రయత్నం చేస్తున్నాయి.

    ఇప్పుడిప్పుడే కుంభకోణాల నుంచి బయటపడుతూ.. అవినీతి, అక్రమాల రహితంగా దేశం ముందుకు దూసుకెళ్తున్న సమయంలో క్రైస్తవ సంస్థలు, జిగ్నేష్‌ లాంటి వ్యక్తులు చేసే ఇలాంటి జిమ్మిక్కులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఇలాంటి వాళ్ల వెనకున్న కుట్రలను తెలుసుకుంటూ జాగరూకతతో ఉండాల్సిన ఆవశ్యకత ఇప్పుడు అత్యవసరం.
(లోకహితంలో ప్రచురణ కోసం మార్చి 2018)
==============================