సెటిలర్లకూ టిక్కెట్లు
– టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై పోరాటం చేయాలని సిడబ్ల్యూసిలో నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోని సెటిలర్లు సానుకూలంగా మారే అవకాశం ఉందని టిపిసిసి వర్గాలు భావిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో సెటిలర్లలో ఎక్కువమంది టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం వల్లనే గ్రేటర్ పరిధిలో ఆ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని టిపిసిసి అంచనా వేస్తోంది. ఒక రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతామని తెలిసినా మాట నిలబెట్టుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలకు సానుకూలత ఉందని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పిసిసి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా, రాయలసీమ వాసులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారేనని, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలోనూ, పార్లమెంటు, అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లోనూ వారికి తగిన ప్రాతినిథ్యం కల్పిస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇచ్చామన్న కోపంతో గత ఎన్నికల్లో వారు కాంగ్రెసేతర పార్టీలకు ఓటేశారని, గత ఎన్నికలకు, ఇప్పటికి వాతావరణంలో సమూల మార్పు వచ్చిందన్నారు.
హైదరాబాద్‌లో అత్యంత ప్రభావం చూపే మైనారిటీలు, ఆంధ్రా, రాయలసీమ వాసులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతారని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టిఆర్‌ఎస్‌లో టిక్కెట్ల విషయంలో తీవ్రమైన సమస్య ఏర్పడనుందని భావించారు. ఆ పార్టీలో చాలామంది అభద్రతా భావం, తీవ్ర అసంతప్తితో ఉన్నారని, చాలామంది ముఖ్యులు తమతో టచ్‌లో ఉన్నారని, వారిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్ బాంబు పేల్చారు.
తెలంగాణను తాకిన ‘హోదా’ సెగలు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ¬దా అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ సెగలు పుట్టిస్తోంది. ఏపిలో అన్ని రాజకీయ పార్టీలు ¬దా గళం అందుకోవడంతో ఇటు తెలంగాణకూ ఆ ప్రకంపనలు విస్తరించాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తామని సిడబ్ల్యూసిలో తీసుకున్న నిర్ణయం వేడిని మరింత రగిల్చింది.
ఏపికి ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలను తెలంగాణకు కూడా ఇవ్వాలని, అలా ఇవ్వలేకుంటే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదంటూ పార్లమెంటులో టిఆర్‌ఎస్ ఎంపిలు ఓ రకంగా యుద్ధమే చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చలో ఏపి డిమాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రత్యేక హొదాకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్ పార్టీ నేతలు టి-కాంగ్రెస్ నేతలపై మాటల దాడి ప్రారంభించారు. ఏపి ఒక్కదానికే ప్రత్యేక ¬దా ఇస్తే రాయితీల కోసం తెలంగాణ పరిశ్రమలు ఆంధ్రాకు తరలిపోతాయని, అలాంటి నిర్ణయానికి ఎలా మద్దతు ప్రకటిస్తారని నిలదీశారు.
కాంగ్రెస్ ఎదురుదాడి
టిఆర్‌ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నేతలూ దీటుగానే స్పందించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని పరిశ్రమలు సాధించారని అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ప్రత్యేక హోదా హామీ ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ¬దా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకే సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
తర్వాత కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో ప్రత్యేక హోదా అంశంపై ఎన్‌డిఏ భాగస్వామిగా ఉన్న టిడిపి బయటికి వచ్చింది. ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, టిఎంసి, ఎస్పి మద్దతు పలకడం దేశ ప్రజల దృష్టిని ఆకర్శించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న టిఆర్‌ఎస్ విభజన హామీలపై పార్లమెంటులో గళం విప్పింది. అయితే ముందస్తుగా ఎన్నికలొస్తే ప్రత్యేక హోదాను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇటు టిఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగానూ టిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. ¬దాకు అనుకూలంగా కెసిఆర్, ఎంపి కవితలు చేసిన వ్యాఖ్యలను, వ్యతిరేకంగా హరీశ్‌రావు చేసిన ప్రసంగాలను జోడించి వైరల్ చేస్తున్నారు. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందకుంటే తెలంగాణ వచ్చుండేదే కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ రెవెన్యూ మొత్తం తెలంగాణకే వర్తిస్తున్న నేపథ్యంలో పారిశ్రామికంగా ఎపి ఎదిగేందుకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చారని, దానికి అనుగుణంగానే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సాధించలేని టిఆర్‌ఎస్‌కు ఇతర రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడే నైతికత లేదని టి-కాంగ్రెస్ నేతలు విమరిస్తున్నారు.
– సప్తగిరి, 98850 86126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%82-%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి