27, మే 2011, శుక్రవారం
27, ఏప్రిల్ 2011, బుధవారం
1, మార్చి 2011, మంగళవారం
07-08-2002.
అగాథం
కమ్ముకుంటున్న యాంత్రికత
అంతరిస్తున్న విశ్వసనీయత
పక్కనున్నోడే కంట్లో పొడిచి
నొప్పిగా వుందా అని పరామర్శిస్తున్న తీరు
అందరూ మనచుట్టే
మనమూ అందరి మధ్యే
ఎవరి పథకం వాళ్లదే
ఎవడు కొసదాకా తోడుంటాడో
ఎవడు కోవర్టవుతాడో తెలియదు
నమ్మక ద్రోహాలూపగటి వేషాలూ
వంచించబడుతున్న స్నేహాలూ
వెర్రెత్తిన స్వార్థం నీడలో
బరువెక్కి పోతున్న బాధ్యతలు
నీతులు, నిజాయితీలు అన్నీ
చెవులకింపైన సందేశాలే
ఆచరణకు అందనంత దూరంలోఆదర్శాలు
పనికి మనిషికీ మధ్య అగాథం
మనిషికీ మనిషికీ మధ్య అగాథం
అగాథాల మధ్య ఆరాటం
అరణ్య రోదన
రెండు మనసుల మధ్య
వారధి లేనంత కాలం
పరిధి లేని బాధల మధ్య
విలవిల్లాడుతూ జీవితం !
- సప్తగిరి (సర్దార్)
అగాథం
కమ్ముకుంటున్న యాంత్రికత
అంతరిస్తున్న విశ్వసనీయత
పక్కనున్నోడే కంట్లో పొడిచి
నొప్పిగా వుందా అని పరామర్శిస్తున్న తీరు
అందరూ మనచుట్టే
మనమూ అందరి మధ్యే
ఎవరి పథకం వాళ్లదే
ఎవడు కొసదాకా తోడుంటాడో
ఎవడు కోవర్టవుతాడో తెలియదు
నమ్మక ద్రోహాలూపగటి వేషాలూ
వంచించబడుతున్న స్నేహాలూ
వెర్రెత్తిన స్వార్థం నీడలో
బరువెక్కి పోతున్న బాధ్యతలు
నీతులు, నిజాయితీలు అన్నీ
చెవులకింపైన సందేశాలే
ఆచరణకు అందనంత దూరంలోఆదర్శాలు
పనికి మనిషికీ మధ్య అగాథం
మనిషికీ మనిషికీ మధ్య అగాథం
అగాథాల మధ్య ఆరాటం
అరణ్య రోదన
రెండు మనసుల మధ్య
వారధి లేనంత కాలం
పరిధి లేని బాధల మధ్య
విలవిల్లాడుతూ జీవితం !
- సప్తగిరి (సర్దార్)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)