అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే దుస్సంప్రదాయం మరోవైపు.. సాధారణమైపోయాయి. ఇదేం కసాయి లోకమని ప్రశ్నిస్తున్నాయి. మానవజాతి పురోగతిని వెక్కిరిస్తున్నాయి.
స్త్రీలను దైవంగా పూజించే క్రమం నుంచి ఆడజాతి మనుగడనే శాసించే స్థాయికి దిగజారిపోయాం. ఇప్పుడు అమ్మాయి వద్దంటే.. భావితరానికి అమ్మ ఎక్కడ దొరుకుతుంది. అప్పుడు డబ్బులిచ్చి అమ్మను కొనుక్కుందామా... మనసుపెట్టి ఆలోచించండి.. మనుగడకే ఎసరు తెచ్చుకోకండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి