తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మానసపుత్రికగా చెప్పుకుంటున్నడబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ పథకం ఆచరణ పక్కన బెట్టి... ఆదిలోనే తీవ్రవిమర్శలకు, అనుమానాలకు కారణమవుతోంది. ఇటీవలి కాలంలో కేసీఆర్ఎక్కడికి వెళ్లినా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించిప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఒకరకంగా డబుల్బెడ్రూమ్ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పటికే పలు కాలనీలు,మురికివాడల్లో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న పేదలు.. ముందయితేతమ ఇళ్లకు పట్టాలు ఇప్పించమంటూ వేడుకుంటున్న వేదన.. అరణ్యరోదనేఅవుతోంది. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ను వివిధ కాలనీల్లో జనం నేరుగా నిలదీసినపరిస్థితులున్నాయి. అయితే వారిపై అసహనం వ్యక్తం చేస్తూనే తెలివిగాసమాధానం దాటవేస్తున్న సీఎం.. డబుల్ బెడ్ రూమ్ ఆశచూపి నిప్పుపై నీళ్లుచలుతున్నారు.
హైదరాబాద్‌లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం..అందుకుఅవసరమైన స్థలం ఎక్కడుందన్న విషయాన్ని విస్మరిస్తోంది. త్వరలోజీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్ర రాజధానిలో పాగా వేయడంపైనేపూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్న కేసీఆర్.. ఓటర్లను ఆకర్షించేందుకే ఈ ప్రకటననుచేస్తున్నారన్న వాదనలో అతిశయమేమీ లేదు. అయితే. ఇదే సమయంలోఅనుకున్నంత వేగంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు పూర్తి కావన్న వాస్తవమూగుర్తెరిగిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఓయూ భూము ప్రతిపాదనను తెరపైకితెచ్చారని తొస్తోంది. ఫలితంగా అంశాన్ని పక్కదారి పట్టించొచ్చన్నది టీఆర్ఎస్ బాస్ఆలోచనగా చెబుతున్నారు. ఓయూ విద్యార్థుల శక్తి యుక్తులేమిటన్నదికేసీఆర్కు తెలియనివి కాదు... తెంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో ఉస్మానియాయూనివర్సిటీ పాత్రే కీలకమన్నది కూడా జగమెరిగిన సత్యం. ఈ ప్రకటనవివాదాస్పదమవుతుందని తెలిసీ కేసీఆర్ ఈ ఆలోచనకు పదును పెట్టారు.మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి గట్టెక్కేదాకా... డబుల్బెడ్రూమ్పథకాన్ని కొంతకాలం అటకెక్కించేందుకు ఈ తరహా వ్యూహం పన్నారని తొస్తోంది.అందుకే.. యూనివర్సిటీకి అంత స్థలమెందుకని బహిరంగంగా ప్రకటించివిద్యార్థులను మరింత రెచ్చగొట్టాలని భావిస్తున్నారు.
కేసీఆర్ ముందస్తు వ్యూహమో, విద్యార్థుల ఆగ్రహ జ్వాలో కానీ... తేనెతుట్టెకదిపినట్లయ్యింది. తమ మౌనాన్ని చేతగాని తనంగా భావిస్తున్నారంటూ విద్యార్థిలోకం కదం తొక్కింది. చారిత్రాత్మక యూనివర్సిటీ స్థలాను వదులుకునేదే లేదనితెగేసి చెప్పారు విద్యార్థులు. ఇప్పటిదాకా ఆక్రమణకు గురైన స్థలాలను కూడావదలబోమని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాలనుఆక్రమించినట్లు ఆరోపణలున్న ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చెందిన హోటల్పైనా,మరో పెట్రోల్ బంకుపైనా ఓయూ విద్యార్థులు దాడులు చేశారు. ఫర్నీచర్ ధ్వంసంచేశారు. ఓయూ భూమిని అంగుళం కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.విద్యార్థుల ఆగ్రహానికి పోలీసులు రంగంలోకి దిగి బవంతంగా అరెస్టు చేయాల్సినపరిస్థితి నెలకొంది.
మరోవైపు... ఓయూ భూముల రగడ అటు రాజకీయంగానూ దుమారం లేపింది.కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, రాచరిక పాలనను గుర్తుకుతెస్తున్నారంటూ ఇటు ప్రతిపక్షలు అటు ప్రజాసంఘాలు ముక్త కంఠంతోవిమర్శించాయి. కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశాయి.అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్యార్థులజోలికెళ్లొద్దంటూ సుతిమెత్తగా తెంగాణ సీఎంను హెచ్చరించారంటే కేసీఆర్ దూకుడుఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు నాయిని నర్సింహారెడ్డివిశ్వవిద్యాలయ భూముల జోలికి రాము అని ప్రకటించారు. ఇది తాత్కాలికమా?
- హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మాసపత్రికలో ప్రచురితం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి