హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన్ని గణనాథులు ఆక్రమించేశారు. సాగర్ చుట్టూ విఘ్నేశ్వరుని విగ్రహాలు కంఠాభరణంలా కనిపిస్తున్నాయి. జంటనగరాల్లోని కాలనీలు, వీధులు, రోడ్లన్నీ గణేశుని శోభాయాత్రలో మునిగిపోయాయి. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్లకు తోడు.. మొబైల్ క్రేన్లతో వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి కాస్త మందకొడిగా తరలివచ్చిన గణనాథులు.. సాయంత్రానికి హైదరాబాద్ రోడ్లను ఆక్రమించేశారు. ప్రధాన శోభాయాత్ర మార్గం ఇసకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. భక్తుల భజనలు, యువతుల కోలాటాలు, యువకుల సందడి మధ్య గణేశులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ వరద నీటితో నదులను తలపించాయి. అయినా.. భారీ వర్షంలోనే భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. తెల్లవార్లూ గణేశ నిమజ్జనోత్సవం ఉధృతంగా సాగనుంది. ఇటు.. నిమజ్జనం సందర్భంగా నగరంలోని అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేశారు. శోభాయాత్రలోని ప్రధాన కూడళ్లు, హుస్సేన్‌సాగర్ చుట్టూ సిసి కెమెరాలు అమర్చిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
18, సెప్టెంబర్ 2013, బుధవారం
హుస్సేన్‌సాగర్‌కు కంఠాభరణంలా గణపయ్యలు

17, సెప్టెంబర్ 2013, మంగళవారం
రూపాయి - పాపాయి
ఇదీ వాస్తవం !
చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం
అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్
ఇదే యూపీఏ తాజా నినాదమట
కానీ చేతులు ఇప్పటికే బొబ్బలెక్కాయి
ప్రధాని వయసుతో పరుగుతు తీస్తోన్న రూపాయి
అంతుచిక్కని అగాథం వైపు జారిపోతున్న పాపాయి
మేకపోతు గాంభీర్యం భరోసా ఇవ్వడం లేదోయి
మొత్తానికి పరిస్థితులు గాలిలో దీపంగా మారాయి
గతమెంతో ఘనమని మన్మోహన్ కు పేరు
1991లో ముంచెత్తిన ఆర్థిక సంక్షోభం ఆనాడు
సంస్కరణలతో అదుపులోకి వచ్చిన పగ్గాలు
దీర్ఘకాలంలో చూపిస్తున్నాయి ప్రతికూల ఫలితాలు
రూపాయి పతనానికి చిహ్నం ఒక కారణమట
ఆ చిహ్నం మారిస్తే ఫలితం ఉంటుందట
వాస్తు నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవమట
నష్ట నివారణ దిశగా ఉద్ధండుల మథనమట

- హంసినీ సహస్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)