ఓవైపు
ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర
మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో
ఆసక్తికరమైన, అనూహ్యమైన వాదన అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది. అసలు
హిందూమతాన్నే అంతం చేస్తామంటూ ప్రతిన బూనుతున్న ఇస్లాం మతస్తుల తొలిప్రవక్త
శివుడే అన్న ప్రకటన ఆ మతోన్మాదులకు ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. ఆ ప్రకటన
చేసింది ఇస్లాం వ్యతిరేకులో, హిందూ మతపెద్దలో కాదు. జమైతే ఉలేమా అధిపతి,
మతగురువు అయిన ముఫ్తీ మహమ్మద్ ఇల్యాస్.
సనాతన ధర్మాన్ని పాటించే ముస్లింలు
శివపార్వతులను తమ సృష్టికర్తలుగా భావించడానికి సందేహించకూడదని కూడా ఇల్యాస్
సూచించారు. రామజన్మభూమి అయోధ్య వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఫ్తీ
మహమ్మద్ ఇల్యాస్ వ్యాఖ్యలను మిగతా మతగురువులు జీర్ణించుకోకపోగా.. అవి ఆయన
వ్యక్తిగత వ్యాఖ్యలని తేలిగ్గా తీసుకొన్నప్పటికి ఇల్యాస్ వ్యాఖ్యలు చాలా
దేశాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ముఫ్తీ మహమ్మద్ ఇల్యాస్ వ్యాఖ్యలు
అక్షరసత్యాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమర్థించారు. ఖురాన్ కన్నా
వేదాలే ముందు పుట్టాయని, భారతావనికి అవి పురాతన శాసనాలని, వేదాలను ప్రపంచం
మొత్తం గౌరవిస్తోందని గుర్తు చేశారు. ఇల్యాస్ ఇరుమతాల మధ్య సోదరభావం
చాటిచెప్పే ఉదాహరణను చెప్పారంటూ ప్రశంసించారు.
మతగురువు ఇల్యాస్ చేసిన
వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే... వాస్తవ పరిస్థితులు, సంప్రదాయాలు,
సంస్కృతులను అధ్యయనం చేస్తే, ఆయన వాదన నూటికి నూరుపాళ్ళూ నిజమేనన్న విషయం
బోధపడుతుంది. నిజానికి ఇస్లాం మతం పుట్టి 1400 సంవత్సరాలు అయ్యింది. అలాగే
క్రైస్తవ మతం పుట్టి 2వేల సంవత్సరాలు పైగా అయ్యింది. అంతకుముందు ప్రపంచంలో
ఉన్న ఆరాధనా పద్ధతులను ఏదో ఒకరూపంలో ఈ మత ప్రవక్తలు స్వీకరించి ఉంటారు.
క్రమంగా ఆ పురాతన ఆరాధనా పద్ధతులు, సంస్కృతులను నాశనం చేసేందుకు ఇప్పుడున్న
వాళ్ళు సంకల్పిస్తున్నారు. ఇక ఇస్లాం విషయానికి వస్తే ఆ మతం పుట్టకముందు
ఇరాన్ లో పర్షియన్స్ ఎక్కువగా ఉండేవారు. పర్షియన్ మతగ్రంథం 'జెండ్
అవెస్థా'. మన హిందూ మతానికి చెందిన ఋగ్వేదానికి సామీప్యంగా ఉంటుంది.
ఖాబాలో
ఉన్న ఆలయంలో ముస్లింలు ఇప్పటికి శివుడిని ఆరాధిస్తారు. అక్కడి పద్ధతులన్నీ
హిందూసంప్రదాయం మాదిరిగానే ఉంటాయి. శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
హిందువుల మాదిరిగానే మొక్కులు తీర్చుకునేందుకు ముస్లింలు కూడా ఆ ఆలయం దగ్గర
తలనీలాలు సమర్పించుకుంటారు. హిందూ బ్రాహ్మణులు జంధ్యం ధరించినట్లుగానే ఆ
ఆలయంలోకి వెళ్ళే ముస్లింలు ఖచ్చితంగా ఓ తెల్లపంచె జంధ్యం మాదిరిగా
కట్టుకుంటారు. ప్యాంటుకు బదులు తెల్లని పంచె కట్టుకుంటారు.
ఈ ఉదాహరణలు
చాలు, ఇస్లాం మతానికి మూలం శైవం అని చెప్పడానికి. ప్రకృతిని ఆరాధించడమంటే
శివుడిని ఆరాధించడమే. ఈ సృష్టికి మూలం శివుడే అన్న విషయాన్ని గుర్తించిన
ఇస్లాం గురువు ఇల్యాస్.. ఆ మతస్తులకు ఓ మార్గం చూపించినట్లుగా చెప్పవచ్చు.
మతోన్మాదులుగా మారిన, మారుతున్న వాళ్ళ ఆలోచనల్లో మార్పు తెచ్చేవిగా
ఉన్నట్లు భావించవచ్చు.