23, డిసెంబర్ 2015, బుధవారం

అవకాశవాదం ఇంకెన్నాళ్లు?

సనాతన భారతీయ సంస్క ృతిని మరుస్తూ.. విపరీత పోకడలకు పాల్పడటం ఇటీవలికాలంలో ఎక్కువైంది. ఓటు బ్యాంకు రాజకీయాలు, అవకాశ వాద నిర్ణయాలు  సర్వసాధారణంగా మారాయి.  ఫలితంగా ప్రజలు గందరగోళంలో పడటమే కాదు.. అపశ్రుతులూ, అనూహ్య పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. అనాలోచిత నిర్ణయాల కారణంగా అంతగా ప్రాధాన్యం లేని చిన్న అంశాలే దేశాన్ని కుదిపేసేలా, ప్రజలను తీవ్ర భయాందోళనలో, సందిగ్ధంలో పడేసేలా పరిస్థితులు రూపుదిద్దుకుం టున్నాయి. తాజాగా టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాల వివాదం కర్నాటక సరిహద్దు దాటి దక్షిణాదిలో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఉత్తరాదికీ కూడా పాకింది.

నిర్ణయంలోనే రాజకీయం

టిప్పుసుల్తాన్జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంలోనే రాజకీయం ఉంది. ఇన్నేళ్లూ గుర్తుకు రాని టిప్పుసుల్తాన్ను ఒక్కసారిగా ఆకాశానికెత్తడమంటే దానివెనుక నిగూఢం ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఆయన ముస్లిం అన్న ఒకే కారణంతో ఉత్సవాలకు కాంగ్రెస్ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టిప్పుసుల్తాన్పేరిట జనాన్ని మతపరంగా విడదీయడం ఓరకమైన అసహనానికి కారణమైంది. దురుద్దేశ్యంతో కూడిన నిర్ణయాన్ని విశ్వ హిందూపరిషత్తో పాటు.. పలు సంస్థలు తప్పుబట్టాయి.

చరిత్రలో భిన్న కోణాలు

18 శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పూ సుల్తాన్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. బ్రిటిషు వాళ్లకు లొంగిపోకుండా ఎదురొడ్డి పోరాడిన ఏకైక భారతీయ రాజుగా టిప్పుసుల్తాన్ను చెబుతారు.   పరాక్రమానికి మారుపేరుగా ఆయన్ను వర్గం వారు గుర్తిస్తే.. హిందువులు, క్రైస్తవుల పట్ల పరమ కిరాతకంగా వ్యవహరించాడని చరిత్రకారులు చెప్పుకొస్తారు. ఏమాత్రం మతసహనం లేకుండా పరిపాలన సాగించాడని, అనేక ఆలయాలను ధ్వసం చేశాడని, పర్షియన్ ఉర్దూను ప్రోత్సహించి కన్నడభాషను చంపేశాడని, మంగుళూరు, కేరళలో అనేక చర్చిలను టిప్పూసుల్తాన్ ధ్వంసం చేశాడని  ముస్లిం చరిత్రకారుల గ్రంథా ద్వారానే మనకు తెలుస్తున్నది.

ఇద్దరు బలి

టిప్పుసుల్తాన్జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామని కర్నాటకలోని అధికార కాంగ్రెస్ ప్రకటించినప్పటినుంచి... విపక్షాలు, జనం నుంచి వ్యతిరేకత వచ్చినా సర్కారు వెనక్కి తగ్గలేదు. జయంతి వేడుకలను అడ్డుకుంటామని హెచ్చరించిన హిందూ సంస్థలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మడికెర పట్టణంలో వేడుక అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని.. హింసకు దారితీసింది. దీనిని అదుపు చేసేందుకు పోలీసు లాఠీచార్జ్ చేయడంతోపాటు భాష్పవాయు గోళాలను ప్రయోగిం చారు. ఘటనలో డీఎస్ కట్టప్ప (60) అనే వీహెచ్పీ కార్యకర్త ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. సంఘటన అనంతరం కూడా మరో హత్య జరిగింది. మంగళూరుకు సమీపంలోని బంత్వాల్ ప్రాంతంలో హరీశ్ (28), సమియుల్లా అనే ఇద్దరు స్నేహితులు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కత్తితో దాడిచేశారు. దీంతో హరీశ్ మృతిచెందగా సమియుల్లా గాయాల పాలై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.

అగ్నికి ఆజ్యం పోసిన గిరీష్కర్నాడ్ :

సమయంలోనే ప్రముఖ కన్నడ రచయిత, నటుడు గిరీష్కర్నాడ్చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. బెంగళూరు విమానాశ్రయంతో పాటు గార్డెన్సిటీ ఫౌండర్అయిన కెంపెగౌడ స్థానంలో టిప్పు సుల్తాన్పేర్లు పెట్టాలని గిరీష్కర్నాడ్ సూచించారు. అంతేకాదు.. టిప్పుసుల్తాన్హిందువై ఉంటే శివాజీకి దక్కినంత గౌరవం దక్కేదని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. ఆయన వాదనను వ్యతిరేకించిన కొందరు.. కర్నాటకలో కొద్దిరోజుల క్రితం హత్యకు గురైన కవి కల్బుర్గీకి పట్టిన గతే పడుతుందంటూ గిరీష్కర్నాడ్ను హెచ్చరించారు కూడా.. దీంతో పోలీసులు గిరీష్కర్నాడ్కు భద్రతను పెంచాల్సి వచ్చింది. మరోవైపు.. కర్నాటక ప్రభుత్వం అధికారికంగా టిప్పు జయంత్యోత్సవాలు నిర్వహించడంపై కర్నాటకలోనే కాక.. పక్క రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  కర్నాటకలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. హిందువులను, వక్కలింగ వర్గాన్ని అవమానిస్తూ గిరీష్కర్నాడ్సామాజిక మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాడంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. టిప్పుసుల్తాన్జయంతి వేడుకల సందర్భంగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య సహా గిరీష్కర్నాడ్రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీశానని గుర్తించిన గిరీష్కర్నాడ్చివరకు దిగిరాక తప్పలేదు. తన వ్యాఖ్యపట్ల జనానికి క్షమాపణలు చెప్పారు.

మేధావుల అడ్రస్ఏదీ..?

మరోవైపు.. టిప్పు సుల్తాన్జయంతి వేడుకల వివాదం అంతకంతకూ పెరుగుతోంది. మైనారిటీలు, దళితులపై అక్కడక్కడా దాడులు జరిగితే గొంతు చించుకునే మేధావులకు.. హిందువుల పై దాడులు, హత్యలు పట్టవా అన్న వాదనా పెరుగుతోంది. కర్నాటకలో విహెచ్పీ కార్యకర్త కట్టప్ప మృతిపై ఎవరికీ నోరెందుకు పెగలడం లేదని ప్రశ్నిస్తున్నారు. టిప్పుసుల్తాన్ గొప్పవాడనే వారున్నా.. ఆయన హిందువు, ఇతర మతస్తుపై ఆకృత్యాలకు  తెగబడ్డాడన్న వాదన కూడా ఉంది. వివాదాల నడుమే ఒక మతం వారిని బుజ్జగించడానికి, ఆకర్షించడానికి అలాంటి వివాదాస్పద వ్యక్తి జయంతిని అధికారికంగా ఎందుకు జరపాలని హిందూ వాదులు ప్రశ్నిస్తున్నారు. మరో మతం వారిని రెచ్చగొట్టేందుకే నని మండిపడుతున్నారు.  అదే పని గోవధ పేరుతోనో, మరో పేరుతోనో హిందూత్వ వాదులు చేస్తే ఖండఖండాలుగా ఖండిస్తున్న మేధావులు.. ఇప్పు డెందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు. హిందుత్వ వాదులు చేస్తే తప్పు.. మైనారిటీలను సంతృప్తి పరిచేందుకు చేస్తే ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం మైనారిటీ విషయంలో మాత్రమే మేధావులు మాట్లాడటం వల్ల హిందువులలో అసహనం పెరగదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- లోకహితం మాసపత్రిక (డిసెంబర్‌ 2015) 
Link : http://www.lokahitham.net/2015/12/blog-post_85.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి