సరిగ్గా 69యేళ్లక్రితం...స్వతంత్య్ర భారతావనిలో హైదరాబాద్ సంస్థానం
విలీనమైన రోజు. రజాకార్ల అరాచకాలు, నిజాం నవాబు చెర నుంచి విముక్తైన రోజు.
1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్య్రమని ప్రపంచానికి తెలుసు.
కానీ..హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాతే 1948 సెప్టెంబర్ 17వ తేదీన
దేశానికి పూర్తి విముక్తి లభించింది.
స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వానికి బ్రిటిష్
వాళ్లు పగ్గాలు అప్పగించా రు. అదే సమయంలో... 543 సంస్థానాలు కూడా దేశంలో
విలీనమయ్యాయి. కానీ నిజాం పాలన లోని హైదరాబాద్ సంస్థానం మాత్రం ససేమిరా
అంది. అప్పటివరకూ బ్రిటిష్ వాళ్లకు సామంతు డిగా కొనసాగిన హైదరాబాద్
నవాబు.. ఆసఫ్ జాహీ వంశస్థుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనది
స్వతంత్య్ర రాజ్యమని ప్రకటించు కున్నాడు.
దీంతో అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని హైదరాబాద్‌తో పాటు.. ఔరంగాబాద్,
నాందేడ్, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ తదితర ప్రాంతాల్లో నిజాం నిరంకుశ
పాలన కొనసాగింది. రజాకార్లు చెలరేగిపోయారు. హిందువులు కనిపిస్తే చాలు..
నరికి చంపేశారు. హిందూ మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నిజాం
నవాబు స్వతంత్య్ర రాజ్యంలో హిందువుల ఊచకోత కొనసాగింది. స్వతంత్య్ర
భారతదేశంలో కూడా మరో ఏడాదికి పైగా ఇక్కడి జనం అరాచకాల మధ్య నలిగిపోయారు.
ఈ క్రమంలోనే ఇక్కడి ప్రజలు భారతదేశంలో విలీనమైతే తప్ప తమకు భద్రత లేదని
భావించారు. మరోవైపు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోన్న భారత ప్రభుత్వం
'ఆపరేషన్ పోలో' చేపట్టింది. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల
మేరకు మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేత త్వంలోని భారత సైన్యం హైదరాబాద్
సంస్థానాన్ని నలువైపుల నుంచి చుట్టుముట్టింది.
అదే సమయంలో భారత సైన్యాన్ని ఎదిరించి ఢిల్లీ ఎర్రకోటపైనే ఆసఫ్‌జాహీ
పతాకాన్ని ఎగురవేస్తామని అప్పటి రజాకార్ల నాయకుడు కాశీంరజ్వీ ప్రకటించా డు.
అటు రజాకార్లు గానీ.. ఇటు నిజాం సైన్యం గానీ.. అదే సమయంలో భారత సైన్యాన్ని
ఎదిరించేందుకు పాకిస్తాన్ సాయం కోరుతూ వర్తమానం పంపాడు నిజాం నవాబు.
అటు.. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిజాం నిరంకుశ పాలన నుంచి
ప్రజలను విముక్తి చేయాలన్న లక్ష్యంతో సెప్టెంబర్ 13వ తేదీన భారత
ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' మొదలుపెట్టింది. నాలుగు రోజుల్లోనే నిజాంను
దారికి తెచ్చింది.
భారత ఆర్మీ ముందు నిలువలేక పోయాయి. ఓవైపు యుద్ధం సాగుతున్న సమయంలో
హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఎక్కడికక్కడ భారత సైన్యానికి సహకరించి
నిజాం మూకలను అంతమొందించేందు కు సహకరించారు. ఫలితంగా భారత సైన్యం
హైదరాబాద్‌లో అడుగుపెట్టకముందే నిజాం నవాబు తన సంస్థానాన్ని భారతదేశంలో
విలీనం చేస్తున్నట్లు లొంగుబాటు ప్రకటించాడు.
కాలక్రమంలో రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాద్ సంస్థానంలోని మెజారిటీ
ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చాయి. కొన్ని జిల్లాలు మహా రాష్ట్రలోకి,
కర్నాటకలో అంతర్భాగమయ్యాయి. అయితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మినహా.. మిగతా
రాష్ట్రాల్లోని అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్
17వ తేదీన అధికారికంగా 'విమోచన దినోత్సవ వేడుకలు' నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక
రాష్ట్రంగా విభజించాలంటూ తెలంగాణ ఉద్యమం అరవయ్యో దశకంలోనే మొదలైంది. వేలాది
మంది ప్రాణాలు కోల్పోయినా.. కాంగ్రెస్ కుటిల నీతితో ఉద్యమాన్ని
అణచివేసింది. ఇక మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్.. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడ్డాక 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' అధికారికంగా
నిర్వాహిస్తామని అనేకసార్లు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై
మూడేళ్లు గడిచినా ఆ మాటే మరిచారు. కేవలం హైదరాబాద్‌లోని రజాకార్ల వారసుల
పార్టీ అయిన ఎంఐఎంను నొప్పించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం విమోచన
ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే
బీజేపీ ప్రతియేటా నిరసన యాత్రలు చేపడుతూనే ఉంది. అధికారికంగా సెప్టెంబర్
17న విమోచన ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తోంది. మరి ఈ ఎదురుచూపులు
ఇంకెన్నాళ్లో?
(-హంసిని సహస్ర సాత్విక)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి