సంక్షేమానికే పెద్దపీట
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన
తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్య మంత్రిగా కేసీఆర్
చరిత్ర సష్టించారనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ గోపాల్‌రెడ్డి
ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్యలు సీఎం పదవిలో ఉండి
బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఓటాన్ అకౌంట్
మొత్తం లక్షా 82 వేల కోట్ల విలువైన
బడ్జెట్‌ను కేసీఆర్ తెలంగాణ రెండో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరో మూడు
నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి
స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. దీంతో రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి
బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రంలో
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత
రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఈ సందర్భంగా ముఖ్యమంతి
చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత
మంత్రివర్గ విస్తరణ పూర్తయినా ఆర్థిక మంత్రిత్వ శాఖను ఎవరికీ కేటాయించలేదు
సీఎం కేసీఆర్. దీంతో అసెంబ్లీలో తానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రం
ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ ఆర్థికమంత్రి ¬దాలో ఐదు బడ్జెట్‌లను అసెంబ్లీలో
ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్ ఈసారి శాసనమండలిలో బడ్జెట్‌ను
ప్రవేశపెట్టారు.
పెరిగిన వద్ధిరేటు
బడ్జెట్ పద్దును చదివి వినిపించిన సీఎం
కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైం దని
ప్రస్తావించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు.. సంక్షేమ రంగాలు ఉమ్మడి
రాష్ట్రంలో పడకేశాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నిరంగాల్లో
తెలంగాణ వెనుకబడిందని ఆక్షేపిం చారు. అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే
తాము విద్యుత్ సమస్యను అధిగమించామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్య
తీరడంతో వ్యవసాయం, పరిశ్రమ లకు నిరంతరం కరెంట్ ఇవ్వగలుగుతున్నామని
చెప్పారు. అతి తక్కువ కాలంలో అభివద్ధి పథంలో నడిచి మిగతా రాష్ట్రాలకు
ఆదర్శంగా నిలిచామని.. యావత్ దేశానికి తెలంగాణ మోడల్‌గా నిలువడం
గర్వకారణమన్నారు. వివిధ అంశాల్లో నిర్ణీత లక్ష్యంతో ముందుకుసాగుతూ.. తక్కువ
సమయంలో అభివద్ధి సాధించామని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ వద్ధి దేశ
సగటు కన్నా తక్కువగా ఉండేదని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు
పెరిగిందనే విషయాన్నే బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు
కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి టీఆర్‌ఎస్ అధికారం
చేపట్టేందుకు దోహదపడ్డా యన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ
గణనీయమైన వద్ధి సాధించిందన్నారు. ప్రస్తుత వద్ధి రేటు 10.6 శాతం ఉండటమే
దీనికి నిదర్శమని తెలిపారు.
‘ఆసరా’ పింఛన్ల పెంపు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
వద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు
వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే
పింఛను మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2,116కు పెంచనున్నట్లు ముఖ్యమంతి సభలో
ప్రకటించారు. అలాగే దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116
పెంచనున్నట్లు స్పష్టంచేశారు. వద్ధాప్య పింఛనుకు కనీస వయసు అర్హతను 60
సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తామని
ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు
కేటాయిస్తున్నట్లు తెలిపారు.
లక్షా 82 వేల కోట్ల పద్దుతో
సంక్షేమాభివృద్ధి పథకాలను కొనసాగిస్తూనే.. 2019-20 సంవత్సర బడ్జెట్
రూ.1,82,017 కోట్లు ప్రతిపాదించారు సీఎం కేసీఆర్. ఇందులో రెవెన్యూ వ్యయం
రూ.1,31,629 కోట్లు.. మూలధన వ్యయం రూ.32,815 కోట్లు.. రెవెన్యూ మిగులు
రూ.6,564 కోట్లుగా లెక్కగట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.1450 కోట్లు
కేటాయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ భృతి కోసం రూ.1810
కోట్లు , ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581 కోట్లు , ఎస్టీల అభ్యున్నతి కోసం
రూ.9,827 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమానికి
రూ.2004 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు, సన్న బియ్యం రాయితీ
కోసం రూ.2,774 కోట్లు కేటాయి స్తున్నట్లు ప్రకటించారు. రైతు బీమా కోసం
రూ.650 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు మరణించే రైతులకు ఈ పథకంతో మేలు
జరగనుంది. ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందజేస్తారు. రైతుబంధు
పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయిం చారు. గతేడాది ఎకరానికి రూ.4 వేలు
ఇవ్వగా ఈ ఏడాది నుంచి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు ఈ పథకం
ద్వారా అందిస్తారు. వెనుకబడిన తరగతుల వారికి అండగా ఉంటామనే హామీ మేరకు
ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు ఇస్తామని పద్దులో ప్రస్తావించారు.
అలాగే వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,500 కోట్లు
కేటాయించి రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తామని ప్రక టించారు. కంటి వెలుగు
పథకం వలె ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు, పంచాయతీలకు 2 ఫైనాన్స్
కమిషన్ల నుంచి రూ.3,256 కోట్లు కేటాయించారు. టీఎస్ ఐపాస్ ద్వారా
రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు అందజేశామని.. దీంతో 8.58 లక్షల ఉద్యోగాలు
వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో తెలిపారు. మొత్తం గంటపాటు
బడ్జెట్ పద్దును కేసీఆర్ ప్రసంగించగా సభ్యులు బల్లచరిచి అభినందనలు
తెలిపారు.
రుణమాఫీలో ట్విస్ట్!
గతేడాది డిసెంబర్ 11 లోపు వ్యవసాయ రుణాలు
తీసుకున్న రైతులకు లక్ష రూపాయలు మాఫీ ప్రకటించారు. 2018 డిసెంబర్ 11వ
తేదీన రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ కారణంగా దాన్ని
దృష్టిలో పెట్టుకొని.. ఆలోగా రుణాలు తీసుకున్న రైతులకే లక్ష రూపాయల రుణమాఫీ
చేస్తామని ప్రకటించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హామీల అమలు దిశగా..
కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్
ప్రతిపాదనలు రెండున్నర నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చేసిన
వాగ్దానాలు నెరవేర్చే దిశగా కనిపించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం అనే రెండు లక్ష్యాలను సాధించడానికి
ఉద్దేశించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు.
కేసీఆర్ చేసిన బడ్జెట్ ప్రసంగాన్ని
అనుసరించి.. నిరుద్యోగులకు నెలకు రూ. 3,116 రూపాయలు నిరుద్యోగభృతి
చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు
కేటాయిం చారు. అయితే.. ఈ కేటాయింపు ఏ ప్రాతిపదికన చేశారో, నిరుద్యోగులను
ఎట్లా గుర్తించారో, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంతమందికి ఈ
పథకం వర్తిస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయవలసి ఉన్నది. వ్యవసాయరంగానికి,
నీటిపారుదల రంగానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేటాయింపులు
గణనీయంగా పెరిగాయి. వివిధ రకాల పేదలకు ఇచ్చే ఆసరా పింఛన్ల మొత్తాన్ని
వెయ్యి రూపాయల నుంచి రూ. 2,116కు పెంచారు.
అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షలు
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల
కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున సాయం అందించాలని తెలంగాణ
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలకు
కారణమైంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీ
విద్యార్థుల కోసం 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి
ప్రతిపాదించారు. ముస్లిం బాలలకూ, ఎస్‌సీ, ఎస్‌టీ బాలలకు ఉద్దేశించిన
గురుకుల పాఠశాలలు వెయ్యి దాకా ఉన్నాయి. 2018-19 బడ్జెట్ వ్యయం సవరించిన
అంచనాల ప్రకారం రూ. 353 కోట్ల మిగులు తేలింది. పన్నుల నుంచి రాబడి రూ.
94,776 కోట్లు వచ్చాయి. 2018-19 కంటే ఇది రూ. 22,000 కోట్లు అధికం. రియల్
ఎస్టేట్ నుంచి ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. సేవారంగం సంతప్తికరంగా వద్ధి
చెందుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి.
దృష్టిసారించాల్సిన అంశాలు..
రైతుబంధు పథకంలో ఎక్కువ భూమి కలిగి ఉన్న
వారిని, వ్యవసాయం చేయకుండా కౌలుకు ఇచ్చేవారిని మినహాయించి, కౌలుదారులనూ,
వ్యవసాయ కూలీలనూ ఆదుకునే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల సామాజిక
న్యాయం అనే సూత్రం సాధ్యమయ్యే అవకాశం ఉంది. విద్యుత్ సంక్షోభాన్ని తొలి
ప్రభుత్వంలోనే అధిగమించడం అభినందించదగిన విషయమే అయినా.. విద్యుత్ కొనుగోలు
చేసే వ్యవస్థను మరింత హేతుబద్ధంగా సవరించినట్లయితే వ్యయం తగ్గించే అవకాశం
ఉన్నదేమో పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలకు ఇరవై నాలుగు గం4టల
విద్యుత్ సరఫరా అవసరమన్నది నిర్వివాదాంశం. 24 గంటలూ వ్యవసాయరంగానికి
కరెంటు సరఫరా చేస్తున్న ప్రభుత్వం పగలు సరఫరా చేస్తే సరిపోతుందేమో అధ్యయనం
చేస్తే పరిశ్రమలకు అవసరమైనంత కరెంటును అందించే అవకాశంతో పాటు విద్యుత్
మిగులును సాధించవచ్చు. విద్యాశాఖకు కేటాయించిన నిధుల్లో 2018-19 కంటే
2019-20లో వెయ్యి కోట్ల రూపాయలు తగ్గించారు. గత అయిదేళ్లలో మొత్తం బడ్జెట్
వ్యయంలో విద్యాశాఖకు కేటాయింపులు 10.88 శాతం నుంచి 6.78 శాతానికి
తగ్గిపోవడం గమనార్హం. వైద్యశాఖకు సైతం రూ. 5,536 కోట్లు మాత్రమే
ప్రత్యేకించారు. ఈ రెండు రంగాలపైనా ప్రభుత్వం దష్టి సారించ వలసిన అవసరం
ఉంది.
– సప్తగిరి.జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి