అడుగుజాడ

పేజీలు

  • హోమ్
  • సొంత కవిత్వం
  • రైలుమిత్ర
  • వెబ్‌సైట్‌

20, ఆగస్టు 2016, శనివారం

చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ డాక్యుమెంటరీ (రెడ్‌ అలర్ట్)

మనసులు దోచిన టీవీ స్టార్‌ ఉన్నట్టుండి శవమై తేలింది. ప్రియుడే కారణమన్నారు.. ఆధారాలూ ఉన్నాయన్నారు. ఆ తర్వాతే కథ మలుపు తిరిగిందా..? టీవీ స్టార్‌ సూసైడ్‌ మిస్టరీపై స్పెషల్‌ డాక్యుమెంటరీ.


 యాంకర్‌  :
------------
ఫూల్స్‌డే నాడు జరిగిన ఆ సంఘటన అబద్ధమయితే బాగుండేది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే జీవితం ముగిసిపోయింది. కానీ.. ఆ విషాదం వెనుక ఎన్నో ప్రశ్నలు. ఎన్నెన్నో సందేహాలు. వాటిని మించిన ట్విస్ట్‌లు. అసలేం జరిగింది..? ఎలా జరిగింది..?

 ఏప్రిల్‌ 1వ తేదీ... 2016వ సంవత్సరం...
ముంబైలో ఓ సెల్‌ఫోన్‌ మోగింది...
ఇవతలివైపు సోమా బెనర్జీ...
అవతలివైపు ఓ టీవీఛానెల్‌ రిపోర్టర్‌...
వాయిస్‌ ఓవర్‌ 1 :
ఏప్రిల్‌ 1వ తేదీ... 2016వ సంవత్సరం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓఇంట్లో సెల్‌ఫోన్‌ మోగింది. ఇవతలివైపు సోమా బెనర్జీ అనే పెద్దావిడ కాల్‌ ఆన్సర్‌ చేసింది. ఆమెకు ఫోన్‌ చేసి పలకరించింది ఓ టీవీఛానెల్‌ రిపోర్టర్‌.
స్పాట్‌...

మీ కూతురు ఎలా చనిపోయిందమ్మా..?
అమె ఆత్మహత్య చేసుకుందా..?
ఎవరైనా హత్య చేశారా..?
ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి..?
హత్య చేసేంతటి శత్రువులెవరైనా ఉన్నారా..?
వాయిస్‌ ఓవర్ 2 :
మీ కూతురు ఎలా చనిపోయిందమ్మా..? అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. అమె ఆత్మహత్య చేసుకుందా..? ఎవరైనా హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి..? హత్య చేసేంతటి శత్రువులెవరైనా ఉన్నారా..? అవతలివైపు నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
స్పాట్‌...


వెల్లువలా ప్రశ్నలు
కోపంతో ఊగిపోయిన సోమా బెనర్జీ
ఏప్రిల్‌ఫూల్‌ చేయాలంటే వేరే కహానీలు చెప్పండి...
కూతురు చనిపోయిందంటూ ఫూల్‌ చేయాల్సిన అవసరం ఉందా..?
వాయిస్‌ ఓవర్‌ 3 :
ఒకదాని వెనుక మరొకటి.. ప్రశ్నలు వెల్లువలా వస్తుండటం.. అదీ తన కూతురు చనిపోయిందని చెబుతూండటంతో సోమా బెనర్జీకి కోపం నషాళానికంటింది. షటప్‌.. అంది ఒక్కసారిగా... ఏప్రిల్‌ ఒకటో తేదీ అని ఏప్రిల్‌ ఫూల్‌ చేయాలంటే ఇంకేవైనా కహానీలు చెప్పాలిగానీ.. నా కూతురు చనిపోయిందంటూ ఇంత ధైర్యంగా ఎలా చెబుతున్నావంటూ ప్రశ్నించింది. నేను ఫూల్‌ కాలేదని, ఫోన్‌ పెట్టేయాలని అరిచింది.
స్పాట్‌...

కీడు శంకించిన సోమా ముఖర్జీ
కూతురికి ఏమైనా ఆపద సంభవించిందా..?
నిజంగానే కూతురు చనిపోయిందా..?
వాయిస్‌ ఓవర్‌ 4 :
జర్నలిస్టుతో ఫోన్‌ సంభాషణ ముగించిన సోమా ముఖర్జీని ఏదో కీడు శంకించింది. ఎవరో టీవీ ఛానెల్‌ రిపోర్టర్‌ చెప్పినట్లు తన కూతురికి ఏమైనా ఆపద సంభవించిందా..? నిజంగానే తన కూతురు చనిపోయిందా..? ఇలా.. అనేక రకాల ప్రశ్నలు తన మెదడును తొలిచేస్తున్నాయి.
స్పాట్‌..

మరుసటి క్షణమే వినిపించిన పిడుగులాంటి వార్త
కూతురు విగతజీవిగా మారందన్న వార్త నమ్మలేకపోతోంది
కూతురు లేదని తెలిసి దు:ఖం కట్టలు తెంచుకుంది
వాయిస్‌ ఓవర్‌ 5 :
మరుసటి క్షణంలోనే.. ఆ తల్లి పిడుగులాంటి వార్త విన్నది. జర్నలిస్టు చెప్పింది నిజమేనని గ్రహించింది. తాను సొంతకాళ్లపై ఎదగడంతో పాటు... తమకూ పేరు ప్రతిష్టలు తెచ్చిన కూతురు ఇంత చిన్న వయసులోనే ఇలా విగత జీవిగా మారిందన్న వార్తను ఆమె నమ్మలేక పోతోంది. భవిష్యత్తుపై ఎన్నో కలల గూళ్లు కట్టుకున్న కూతురు లేదని తెలిసి దు:ఖం కట్టలు తెంచుకుంది.
స్పాట్‌...

మధ్యాహ్నం సమయం...
ముంబైలోని బంగూర్‌ నగర్‌...
ఓ ఇంట్లో యువతి ఆత్మహత్య...
సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతున్న యువతి...
ఉరేసుకుందని డిసైడైన స్థానికులు...
వాయిస్‌ ఓవర్‌ 6 :
ఏప్రిల్‌ ఒకటోతేదీ మధ్యాహ్నం సమయం. మరోవైపు.. ముంబైలోని బంగూర్‌ నగర్‌ కాలనీ అంతటా కలకలం చెలరేగింది. బంగూర్‌నగర్‌లోని ఓ ఇంట్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడటం చూసి వచ్చినవాళ్లు భయంతో వణికిపోతున్నారు. అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందని నిర్ధారించుకున్నారు.
స్పాట్‌...

వయసు 24 యేళ్లుంటుంది...
అందరూ వచ్చేసరికే ఉరికి వేలాడుతోంది...
ఇరుగు పొరుగు వాసులకు గొడవలు గుర్తుకు వచ్చాయి...
ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు
కన్నీళ్లు పెట్టుకున్నారు
వాయిస్‌ ఓవర్‌ 7 :
అమ్మాయి వయసు 24 యేళ్లుంటుంది. చుట్టుపక్కల వాళ్లు అందరూ వచ్చేసరికే ఉరికి వేలాడుతోంది. ఈ దృశ్యం చూడగానే.. కొద్దిరోజులుగా ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఇరుగు పొరుగు వాసులకు గుర్తుకు వచ్చాయి. కానీ. .ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఇంత చిన్నవయసులోనే నూరేళ్లు నిండాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
స్పాట్‌...

కొంతసేపటికి ముందు ఆ ఇంట్లోనుంచి బయటికెళ్లిన యువకుడు
తిరిగొచ్చాక చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు
లోపలినుంచి గడియపెట్టుకుందన్నాడు
తలుపు తెరవడం లేదని ఆదుర్దాగా చెప్పాడు
గడియ.. అందరూ వచ్చాక తెరుచుకుందా..?
వాళ్లంతా రాకముందే ఆ యువకుడే తెరిచాడా..?
వాయిస్‌ ఓవర్‌ 8 :
ఈ సీన్‌ జరగడానికి కొంతసేపటిముందు ఆ ఇంట్లోనుంచి ఓ యువకుడు బయటికి వెళ్లాడు. కాసేపయ్యాక తిరిగొచ్చాడు. చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచాడు. అమ్మాయి లోపలినుంచి గడియ పెట్టుకుందని చెప్పాడు. ఎంత పిలిచినా తలుపు తెరవడం లేదని ఆదుర్దాగా చెప్పాడు. మరి.. లోపలినుంచి గడియ.. వాళ్లంతా వచ్చాక తెరుచుకుందా.. లేక అతనొక్కడే తెరిచాడా అన్నది మాత్రం స్పష్టం కాలేదు.
స్పాట్‌...

అమ్మాయిని కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్లారు
కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు
అప్పటికే చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
సిద్ధార్థ్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం
వాయిస్‌ ఓవర్‌ 9 :
అందరూ కలిసి లోపలికెళ్లి చూస్తే ఎదురుగా డెడ్‌బాడీ.. ఫ్యాన్‌కు వేలాడుతూ అమ్మాయి. హుటాహుటిన అమ్మాయిని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. ఆ ఏరియాలోనే ప్రముఖమైన కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రిలో చేర్చారు. కానీ.. అప్పటికే ఆ యువతి చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ ఆస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు.
స్పాట్‌...

అమ్మాయిది సొంతిళ్లు
కుటుంబసభ్యులు వేరేచోట ఉంటారు
అమ్మాయికి ఇంకా పెళ్లికాలేదు
అంత సంపన్నురాలా..?
యువతి ఒక్కర్తే ఇంట్లో ఉంటుందా..?
ఇంట్లోనుంచి బయటి కెళ్లిన యువకుడెవరు..?
కాసేపటికే ఎందుకు తిరిగొచ్చాడు..?
వాయిస్‌ ఓవర్‌ 10 :
అమ్మాయి చనిపోయిన ఇల్లు ఆమె సొంతిల్లు. కుటుంబసభ్యులందరూ వేరేచోట ఉంటారు. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. మరి.. ఈ వయసులోనే ఆ అమ్మాయికి సొంతిల్లు కొనుక్కునేంత ఆదాయం ఉందా..? అంత సంపన్నురాలా..? కుటుంబ సభ్యులంతా వేరేచోట ఉంటున్నారంటే.. ఆ యువతి ఒక్కర్తే ఆ ఇంట్లో ఉంటుందా..? మరి.. పెళ్లికాని ఆ యువతి ఇంట్లో నుంచి మధ్యాహ్నం వేళ బయటికెళ్లిన యువకుడెవరు..? ఆ తర్వాత కాసేపటికే అతను ఎందుకు తిరిగొచ్చాడు..? అన్నీ జవాబు లేని ప్రశ్నలే... ఇవన్నీ చిక్కుముడులే...
స్పాట్‌...

యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగానే కనిపించకుండా పోయాడు
సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు
వాయిస్‌ ఓవర్ 11 :
ఆ యువతి చనిపోయిన తర్వాత కాసేపు అక్కడే తచ్చాడిన యువకుడు.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగానే కనిపించకుండా పోయాడు. కొద్దిరోజుల దాకా అదృశ్యమయ్యాడు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు.
స్పాట్‌...

యువకుడికీ, అమ్మాయికీ సంబంధమేంటి..?
కొద్దిరోజుల దాకా పరారీలో ఎందుకున్నాడు..?
నిజంగా అమ్మాయిది ఆత్మహత్యేనా..?
అందుకు ప్రేరేపించింది ఎవరు..?
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి.?
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..?
వాయిస్‌ ఓవర్‌ 12 :
అమ్మాయి చనిపోయిన విషయం మొదట గుర్తించింది ఆ యువకుడే అయితే.. అతనికీ ఆమెకూ ఉన్న సంబంధమేంటి..? యువతి మరణం తర్వాత కొద్దిరోజులు ఎందుకు పరారీలో ఉన్నాడు..? అసలు ఆమె మృతికి. ఇతనికీ సంబంధముందా..? నిజంగా ఆ అమ్మాయిది ఆత్మహత్యేనా.. ఆత్మహత్యే అయితే అందుకు ప్రేరేపించింది ఎవరు..? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి.? లేదంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా..? ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలుగా మిగిలాయి.
స్పాట్‌....

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌ ఫేం.. ప్రత్యూష బెనర్జీ.
యువకుడు నిర్మాత రాహుల్‌రాజ్‌ సింగ్‌.
ఇద్దరూ లవర్స్‌.. కలిసి సహజీవనం కూడా చేశారు
వాయిస్‌ ఓవర్‌ 13 :
చనిపోయిన యువతి.. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌ ఫేం.. ప్రత్యూష బెనర్జీ. ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ యువకుడు నిర్మాత రాహుల్‌రాజ్‌ సింగ్‌. ఇద్దరూ స్నేహితులు. కాదు.. కాదు.. లవర్స్‌.. అంతేకాదు.. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు.
స్పాట్‌...

హిందీలో 'బాలికా వధు'..తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'
దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు
చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ అంటే.. ఫ్యాన్స్‌ చెవి కోసుకుంటారు
నటనతో సీరియల్‌కే కలరింగ్‌ను తెచ్చిపెట్టిన ప్రత్యూష
అనేక సీరియళ్లలోనూ తనదైన నటనాశైలి
వాయిస్‌ ఓవర్‌ 14 :
హిందీలో 'బాలికా వధు' పేరుతో, తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా అనువాదమై ప్రసారమైన ఈ సీరియల్‌కు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఇక.. ఆ సీరియల్‌ ప్రధాన పాత్రధారి అయిన చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ అంటే.. ఫ్యాన్స్‌ చెవి కోసుకుంటారు కూడా. తన నటనతో మొత్తం సీరియల్‌కే కలరింగ్‌ను తెచ్చిపెట్టింది. అత్యద్భుతమైన నటనతో, అమాయకపు ఫోజులతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.చిన్నవయసులోనే.. అద్భుతమైన అభిమానాన్ని చూరగొంది. ఇదొక్కటే కాదు.. అనేక సీరియళ్లలోనూ తనదైన నటనాశైలిని కనబర్చింది. అతిచిన్న వయసులోనే.. నటనారంగంలోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది ప్రత్యూష బెనర్జీ. కానీ 24యేళ్ల వయసులోనే ఈలోకం విడిచి వెళ్లిపోయింది.
స్పాట్‌...
======================================
 Chinnari Pellikuturi  TWO - pkg (నేపథ్యం, సీరియల్స్‌)
========================
చిన్నారి పెళ్లి కూతురుగా సుపరిచితురాలైన ప్రత్యూష.. ఆ తర్వాత కెరీర్‌లో దూసుకుపోయింది. సీరియళ్లే కాదు.. రియాల్టీ షోలలోనూ పాల్గొంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక ఆదరణ సంపాదించింది.

మరుసటిరోజు ప్రత్యూషబెనర్జీ మృతదేహానికి అంత్యక్రియలు
అత్తారింటికి పంపేందుకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు...
దు:ఖసాగరం మధ్య ప్రత్యూషను స్మశానానికి సాగనంపారు
పెళ్లి దుస్తులు డిజైన్‌ చేయాలంటూ డిజైనర్‌ రోహిత్‌ వర్మకు చెప్పిన ప్రత్యూష
ఆ విషయాన్ని తలచుకుంటూ వెక్కివెక్కి ఏడ్చిన స్నేహితుడు
వాయిస్‌ ఓవర్‌ 1 :
తన ఇంట్లోనే ఉరేసుకున్న స్థితిలో కనిపించిన ప్రత్యూష బెనర్జీ మృతదేహానికి మరుసటిరోజు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యుల రోదనలు, అయిన వాళ్ల కన్నీటి మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యూష అంత్యక్రియల తంతు పూర్తయ్యింది. త్వరలోనే పెళ్లి  చేసి అత్తారింటికి పంపించేందుకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు.. ప్రత్యూషను దు:ఖ సాగరం మధ్య స్మశానానికి సాగనంపారు. అంతేకాదు.. తొందర్లోనే తనకు పెళ్లి దుస్తులు డిజైన్‌ చేయాల్సి ఉంటుందని తన స్నేహితుడైన డిజైనర్‌ రోహిత్‌ వర్మకు చెప్పింది ప్రత్యూష. ఆమెను చివరి చూపులు చూసేందుకు వచ్చిన రోహిత్‌ వర్మ ఈ విషయాన్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్న వాళ్లను కలచివేసింది.
స్పాట్‌...

ఆత్మహత్య కాదన్న కుటుంబసభ్యులు
ప్రియుడిపై అనుమానాలు
వాయిస్‌ ఓవర్ 2 :
ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. నుదుటి మీద తాజా సింధూరం కనిపిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు కుటుంబసభ్యులు. అదృశ్యమైన ప్రియుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మరణానికి రాహులే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
స్పాట్...

ఆనంది పాత్రలో ప్రత్యూష బెనర్జీ
మొదట చిన్నారి పెళ్లికూతురు పాత్రలో అవికాగోర్‌
2013లో ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష బెనర్జీ
వాయిస్‌ ఓవర్‌ 3  :
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో ఆనంది పాత్ర ద్వారా ప్రత్యూష బెనర్జీ మహిళల అభిమానాన్ని చూరగొంది. ఈ సీరియల్‌లో చిన్నారి పెళ్లికూతురు పాత్రలో మొదట అవికాగోర్‌ నటించింది. అవికాగోర్‌కు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు రావడంతో.. 2013లో ఆ సీరియల్‌ నుంచి తప్పుకుంది. దీంతో.. ప్రత్యూష బెనర్జీ చిన్నారి పెళ్లికూతురిగా ఎంట్రీ ఇచ్చింది.
స్పాట్‌...

చిన్నారి పెళ్లికూతురుకు మరింత కళ
దేశవ్యాప్తంగా అభిమానులు
వాయిస్‌ ఓవర్ 4 :
ప్రత్యూష బెనర్జీ ఎంటరయ్యాక.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌కు మరింత కళ వచ్చింది. తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో నటనతో ఆకట్టుకున్న ప్రత్యూష.. తర్వాత మరికొన్ని సీరియల్స్‌లోనూ వివిధ పాత్రలు పోషించింది.
స్పాట్‌...

హిందీలో 'బాలికావధు'.. తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'
'ససురాల్‌ సిమర్‌కా' వంటి ఉత్తరాది సీరియల్స్‌
బిగ్‌బాస్‌ - 7, ఝలక్‌ దిఖ్‌ లాజా - 5...
కామెడీ క్లాసెస్‌ వంటి రియాల్టీ షోల్లో పాల్గొంది
వాయిస్‌ ఓవర్‌ 5 :
హిందీలో నిర్మించిన బాలికా వధు సీరియల్‌నే తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా అనువాదం చేసి ప్రసారం చేశారు. అందులో హీరోయిన్‌ పాత్రను పోషించింది ప్రత్యూష బెనర్జీ. ససురాల్‌ సిమర్‌కాతో పాటు మరికొన్ని ఉత్తరాది టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. బిగ్‌బాస్‌ - 7, ఝలక్‌ దిఖ్‌ లాజా - 5, కామెడీ క్లాసెస్‌ వంటి రియాల్టీ షోల్లోనూ ప్రత్యూష పాల్గొంది. అయినా.. అటు ఉత్తరాదిలో 'బాలికా వధుగా' ఇటు. .తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగానే టెలివిజన్‌ ప్రేక్షకులు ఆమెను ఆదరించారు.
స్పాట్‌...

కుటుంబ సభ్యుల్లోనే కాదు.. అభిమానుల్లోనూ విషాదం
వాయిస్‌ ఓవర్ 6 :
నటనారంగంలోకి ప్రవేశించిన అతితక్కువ కాలంలోనే పేరున్న సీరియల్స్‌లో నటించి, ప్రేక్షకుల మెప్పును పొందిన ప్రత్యూష బెనర్జీ మృతి ఇటు.. కుటుంబసభ్యులు, బంధువుల్లోనే కాదు.. అటు.. అభిమానుల్లోనూ విషాదం నింపింది.
స్పాట్‌...

మిస్టరీగా మారిన ప్రత్యూష మరణం
రకరకాల ఊహాగానాలు
షికార్లు చేసిన పుకార్లు
వారం రోజుల తర్వాత ప్రియుడు రాహుల్‌ అరెస్టు
వాయిస్‌ ఓవర్‌ 7 :
మరోవైపు.. ప్రత్యూష మరణం మిస్టరీగా మారింది. ప్రత్యూష చనిపోయిన రోజు ఆమెతో పాటే ఉన్న ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ కనిపించకుండా పోవడంతో కొద్దిరోజులు కేసు ముందుకు సాగలేదు. మృతిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనేక పుకార్లు, వాదనలు షికారు  చేశాయి. వారం రోజుల తర్వాత పోలీసులు ప్రత్యూష ప్రియుడు రాహుల్‌ను అరెస్టు చేశారు. ప్రత్యూషతో అతనికున్న అనుబంధం, చనిపోయే ముందు ఆమె మానసిక స్థితి, అసలు ఆమెది ఆత్మహత్యా..? హత్యా..? అన్న కోణాన్నీ విశ్లేషించే ప్రయత్నం చేశారు.
స్పాట్...
==========================================
 Chinnari Pellikuturi  Three - pkg
========================
యాంకర్‌ :
ప్రత్యూష బెనర్జీ మరణం వెనుక మిస్టరీ ఏంటి..? పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పింది..? ప్రత్యూష ప్రియుడు పోలీసుల విచారణలో వెల్లడించిన అంశాలేంటి..? పోలీసులు దర్యాప్తులో ఏం తేల్చారు..? ప్రత్యూష బెనర్జీ కుటుంబసభ్యుల డిమాండ్‌ ఏంటి..? అసలు ఈ మరణం వెనుక ఏం జరిగింది.

రాహుల్‌ రాజ్‌సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు
14 గంటల పాటు రాహుల్‌పై ప్రశ్నల వర్షం
వాయిస్‌ ఓవర్‌ 1 :
సంచలనం సృష్టించిన ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 306, 505, 506 తదితర అభియోగాలతో కేసు నమోదు చేశారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో ప్రశ్నించారు. ఏకధాటిగా 14 గంటల పాటు ప్రశ్నించి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
స్పాట్...

దర్యాప్తు సమయంలోనే అనేక ఊహాగానాలు
చనిపోయేముందు ప్రియుడితో వాట్సాప్‌లో చాటింగ్‌
వాయిస్‌ ఓవర్ 2 :
ఓవైపు పోలీసుల దర్యాప్తు సాగుతున్న సమయంలోనే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. చనిపోయేముందు ప్రత్యూష..తన ప్రియుడికి పుంఖాను పుంఖాలుగా వాట్సాప్‌ మెస్సేజ్‌లు పంపించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. చివరి ఫోన్‌కాల్‌ అతనికే చేసిందన్న విషయమూ నిర్ధారణ అయ్యింది. 
స్పాట్‌...

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మలాంద్‌లోని కార్నివాల్‌ మాల్‌కు ప్రత్యూష
రాహుల్‌ కొట్టడంతో కిందపడిపోయిన ప్రత్యూష
ఆరోజే ప్రత్యూష చనిపోయింది
వాయిస్‌ ఓవర్‌ 3 :
మరోవైపు.. ఆత్మహత్యకు ముందు.. ప్రత్యూష బెనర్జీ తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో కలిసి, మలాంద్‌లోని కార్నివాల్ మాల్ కు వెళ్లిందని, అక్కడే వాళ్లిద్దరికీ పెద్ద గొడవైందన్న ప్రచారం జరిగింది. ఈ గొడవలో రాహుల్‌.. ఆమెను గట్టిగా కొట్టాడని, కిందపడిన ఆమెను లేవదీసే ప్రయత్నం కూడా చేయలేదని, ఇది జరిగిన రోజే ఆమె చనిపోయిందని చెప్పుకున్నారు.
స్పాట్‌...

ప్రియుడితో ప్రత్యూషకు సమస్యలు
ప్రత్యూష ఫోన్‌తోనే పరారైన రాహుల్‌
వాయిస్‌ ఓవర్ 4 :
ఇక.. ప్రత్యూషను హాస్పిటల్‌కు తీసుకెళ్లాక.. రాహుల్‌ ప్రశాంతంగా చిప్స్‌ తింటూ గడిపాడని, అతనిలో టెన్షన్‌గానీ, బాధగానీ కనిపించలేదని ఆమె కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. చనిపోయే ముందు కొద్ది రోజులుగా ఆమె రాహుల్ రాజ్ సింగ్ తో సమస్యలు ఎదుర్కొంటోందని ఆమె సన్నిహితులు వాపోయారు. ఇక.. రాహుల్‌ పరారయ్యే ముందు ప్రత్యూష ఫోన్‌ కూడా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై ఆరోపణలు, అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
స్పాట్‌...

ముందస్తు బెయిల్‌కోసం రాహుల్‌ ప్రయత్నాలు
బెయిల్‌ రద్దు చేయాలంటూ ప్రత్యూష తల్లి పిటిషన్‌
మహారాష్ట్ర సీఎంకు ప్రత్యూష తల్లి లేఖ
వాయిస్‌  ఓవర్ 5 :
పోలీసు కేసులు, ప్రశ్నల నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పొందేందుకు రాహుల్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ముంబైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేశాక.. దాన్ని రద్దు చేయాలంటూ అటు.. ప్రత్యూష తల్లి కూడా కోర్టును ఆశ్రయించింది. త‌మ కూతుర్ని చంపేసిన రాహుల్‌కి ముంద‌స్తు బెయిలు ఇవ్వొద్దని వాదించింది. ఆ తర్వాత పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేయడం, తర్వాత బెయిల్‌పై విడదల కావడం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత.. తమ కూతురి మృతి కేసులో నిందితుడైన ఆమె ప్రియుడు రాహుల్‌ తమను బెదిరిస్తున్నాడంటూ ప్రత్యూష తల్లి సోమా ముఖర్జీ ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
స్పాట్‌...

ప్రత్యూష చివరి ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ విన్న న్యాయస్థానం
'నన్ను క్యారెక్టర్‌ లేని దానిగా ముద్ర వేశారు...
నాకు జీవితంలో ఇంకేం మిగిలింది..? అని ప్రశ్నించిన ప్రత్యూష
వాయిస్‌ ఓవర్‌ 6 :
మరోవైపు..  ప్రత్యూష చివరి ఫోన్‌కాల్‌ రికార్డింగ్స్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆ ఫోన్‌.. ప్రియుడు రాహుల్‌రాజ్‌సింగ్‌కే చేసినట్లు నిర్ధారించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోను న్యాయస్థానం విన్నది. తనను క్యారెక్టర్‌ లేని దానిగా ముద్రవేశారని, తనకు జీవితంలో ఇంకేం మిగిలిందని ప్రశ్నించింది ప్రత్యూష. అయితే.. ప్రత్యూష మాట్లాడుతుండగానే రాహుల్‌ ఫోన్‌ కట్‌ చేశాడని న్యాయస్థానం గుర్తించింది.
స్పాట్‌...

గతంలోనూ ప్రత్యూష ఆత్మహత్యాయత్నం
వాయిస్‌ఓవర్ 7 :
ఈ క్రమంలోనే మరో వాదన కూడా తోడైంది. ప్రత్యూష ఇలా ఎక్సట్రీమ్ స్టెప్ తీసుకోవటం తొలిసారి కాదని, గతంలో మాజీ బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసిందని, అప్పుడు అదృష్టవశాత్తూ బతికిపోయిందని ఆమె స్నేహితులు తెలిపారు.
స్పాట్‌...

రెండుసార్లు సూసైడ్‌కు ప్రయత్నించిన ప్రత్యూష
ఓసారి విషం తాగింది...
మరోసారి బాల్కనీనుంచి దూకేందుకు ప్రయత్నించింది
వాయిస్‌ ఓవర్‌ 8 :
ప్రత్యూష గతంలోనూ రెండు సార్లు సూసైడ్‌కు ప్రయత్నించిందని ఆమె స్నేహితురాలు సారా ఖాన్ చెప్పింది. ఓసారి విషం తాగి చనిపోయేందుకు ప్రయత్నించిందని తెలిపింది. మరోసారి ఓ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు బాల్కనీ నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించిందని చెప్పింది. ఆ రెండు సందర్భాల్లో తానే కాపాడినట్లు కూడా సారా ఖాన్ వెల్లడించింది. చివరకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరు పెట్టుకుంది.
స్పాట్‌...

ప్రత్యూష కేసులో కొత్త ట్విస్ట్‌
చనిపోయేముందు మద్యం మత్తులో ప్రత్యూష
వాయిస్‌ఓవర్ 9 :
దర్యాప్తు సాగుతున్న కొద్దీ ప్రత్యూష కేసులో కొత్త ట్విస్ట్‌ బయట పడింది. చనిపోయే ముందు ప్రత్యూష మద్యం సేవించిందని తేలింది.
స్పాట్‌...  
==========================================
R Alert Chinnari Pellikuturi  Four - pkg
========================
ప్రత్యూష చనిపోయేముందు మద్యం తాగిందన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.  పైగా.. ప్రత్యూష రెండు నెలల గర్భవతి.. అంతేకాదు.. అబార్షన్‌ కూడా చేయించుకుంది. ప్రత్యూషకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు విస్తుగొలిపాయి.

బయటపడుతోన్న కొత్త అంశాలు
మోతాదుకు మించి తాగిందంటున్న మెడికల్‌ రిపోర్టు
గర్భవతి, అబార్షన్‌ కూడా చేయించుకుంది
వాయిస్‌ ఓవర్‌ 1 :
ప్రత్యూష కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ కొత్త కొత్త అంశాలు బయటపడ్డాయి. ప్రత్యూష చనిపోయేముందు విపరీతంగా మద్యం సేవించిందని తేలింది. 135 ఎంజీ ఆల్కాహాల్ తీసుకుందని మెడికల్‌రిపోర్టులో తేలినట్లు చెబుతున్నారు. ఇది యావరేజ్ కంటే చాలా ఎక్కువ అని అంటున్నారు. అంతేకాదు.. అమె గర్భవతి అని, అబార్షన్‌ కూడా చేయించుకుందన్న విషయం తెలిసి కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. తమ కూతురి చావుకు ఖచ్చితంగా ఆమె ప్రియుడే కారణమని తల్లిదండ్రులు వాదించారు.
స్పాట్‌..

ప్రత్యూష గర్భం దాల్చడం నిజమేనా..?
అబార్షన్‌ చేయించుకున్న విషయమూ వాస్తవమేనా..?
ఎందుకా నిర్ణయం తీసుకుంది..?
బంధాన్ని తెంచుకునేందుకే అబార్షన్‌ చేయించుకుందా..?
రాహుల్‌ ఒత్తిడి తెచ్చి అబార్షన్‌ చేయించాడా..?
వాయిస్‌ ఓవర్ 2  :
పెళ్లికి ముందే ప్రత్యూష గర్భం దాల్చడం నిజమేనా..? అబార్షన్‌ చేయించుకున్న విషయమూ వాస్తవమేనా..? ఒకవేళ అదే నిజమైతే.. ఎందుకా నిర్ణయం తీసుకుంది..? రాహుల్‌తో గొడవల నేపథ్యంలో బంధాన్ని తెంచుకునేందుకే అబార్షన్‌ చేయించుకుందా..? లేదంటే రాహుల్‌ ఒత్తిడి తెచ్చి అబార్షన్‌ చేయించాడా..? అన్న విషయాలూ మిస్టరీగా మారాయి.

ప్రత్యూష తాగుడుకు బానిసైందన్న రాహుల్‌
పరస్పర అంగీకారంతోనే అబార్షన్‌
వాయిస్‌ ఓవర్ 3 :
ప్రత్యూష ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేశాడు. ఆమె తాగుడుకు బానిసైందని.. డ్రగ్స్‌, ఆల్కహాల్‌ మోతాదుకు మించి తీసుకోవడం అలవాటైందని, ఈ విషయం ఆమె స్నేహితులకు కూడా తెలుసని రాహుల్‌ పేర్కొన్నాడు.  అంతేకాదు.. ప్రత్యూష గర్భం దాల్చిందని, అబార్షన్‌ చేయించుకుందన్నాడు. పరస్పర అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకుందని కూడా చెప్పాడు. పోలీసుల విచారణలోనూ రాహుల్‌ ఇవే విషయాలు చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. 
స్పాట్...

ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు
పిచ్చాపాటీ ఉదయం దాకా కొనసాగింది
నిద్రలేచాక ప్రత్యూష మళ్లీ తాగుతూ కూర్చుందన్న రాహుల్‌
బయటికి వెళ్లివచ్చేసరికే దారుణం జరిగిపోయిందన్న రాహుల్‌
మందుకొట్టి మరీ తరచూ గొడవ పడేవాళ్లు
వాయిస్‌ ఓవర్ 4 :
ప్రత్యూష చనిపోయే ముందురోజు ఆమె ఇంట్లో తనతో పాటు.. మరో కామన్‌ ఫ్రెండ్‌ ముగ్గురం కలిసి పార్టీ చేసుకున్నామని, ఉదయం దాకా పిచ్చాపాటీ కొనసాగిందని రాహుల్‌ చెప్పాడు. తాను నిద్రలేచే సరికి ప్రత్యూష మళ్లీ తాగుతూనే కూర్చుందని, దీంతో ఇద్దరి మధ్యా చిన్న గొడవ జరిగిందన్నాడు. తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగిపోయిందని బాధపడ్డాడు రాహుల్‌ రాజ్‌ సింగ్‌. అయితే.. వీరి అపార్ట్ మెంట్లలోని ఇరుగుపొరుగు వాళ్ళు కూడా ప్రత్యూష బెనర్జీ, రాహుల్ లు మందుకొట్టి మరీ తరచూ గొడవ పడేవారని చెబుతున్నారు. అంటే.. చనిపోయేముందు కొద్దిరోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు తీవ్రరూపం దాల్చాయన్నది మాత్రం వాస్తవమేనని తేలింది.
స్పాట్‌...

ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్‌
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది
డబ్బు తల్లి అకౌంట్‌లో డిపాజిట్‌ చేసిందన్న రాహుల్‌
రాహులే డబ్బు డ్రా చేశాడన్న తల్లి
ప్రత్యూష అకౌంట్‌ నుంచి రాహుల్‌ ఖాతాలోకి రూ.24 లక్షలు
వాయిస్‌ఓవర్ 5 :
వీటికి తోడు.. ఈకేసులో మరో ట్విస్ట్‌ కూడా బయటకు వచ్చింది. ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవని, ప్రముఖ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని తీవ్ర ఒత్తిడికి గురైందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె డబ్బంతా వాళ్ల అమ్మ అకౌంటులో డిపాజిట్‌ చేసేదని ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్‌ రాజ్‌ ఆరోపించాడు. మరోవైపు.. ప్రియాంక అకౌంట్‌ నుంచి ఆమె ప్రియుడు రాహులే డబ్బు డ్రా చేశాడని ప్రియాంక తల్లి కోర్టులో వాదించింది. అయితే.. ప్రత్యూష బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రాహుల్‌ ఖాతాలోకి 24 లక్షల రూపాయలు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
స్పాట్‌...

రాహుల్‌ రాజ్‌సింగ్‌వైపే అనుమానపు చూపులు
వాయిస్‌ ఓవర్ 6 :
ఇక.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, ఇది ఖచ్చితంగా హత్యే అని కుటుంబసభ్యులు వాదిస్తూనే ఉన్నారు. అయితే అందరూ ప్రత్యూష మృతి విషయంలో ఆమె ప్రేమికుడు రాహుల్ రాజ్ సింగ్ వైపు అనుమానంగా చూస్తున్నారు.
స్పాట్‌...

====================
End Anchor
------------- 
తల్లిదండ్రుల అనుమానాలు, ప్రియుడి ప్రతివాదనల మధ్య... సాగుతున్న ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు బయటపడతాయో చూడాలి.
===================
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 8:05 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

19, ఆగస్టు 2016, శుక్రవారం

అనాథాశ్రమం పేరిట చిన్నారులతో భిక్షాటన



చిన్నారులను ఆదరిస్తామనేది ముసుగు మాత్రమే... అనాథ శరణాలయం అనేది కేవలం బోర్డుకే పరిమితం. చిల్లర వేషాలతో చెలరేగిపోతున్న ముష్టియా. మన కళ్లు మనల్నే మోసం చేసేలా.. నయవంచక నాటకాలతో చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న కంత్రీగాడి స్టోరీ.

సమాజాన్ని ఉద్ధరిస్తామంటారు...
సేవ చేస్తున్నామంటూ ఊదరగొడతారు...
అరచేతిలో స్వర్గం చూపిస్తారు...
తెర వెనుక వేరే తతంగం నడిపిస్తారు...
 సమాజాన్ని ఉద్ధరిస్తామంటూ కొందరు బయల్దేరతారు. సమాజం కోసమే సేవ చేస్తున్నామంటూ ప్రచారంతో ఊదరగొడతారు. ఎదుటివాళ్లకు తాము చేస్తున్న ఘనకార్యాన్ని చెబుతూ అరచేతిలో స్వర్గం చూపిస్తారు. కానీ.. తెర వెనుక వేరే తతంగం నడిపిస్తారు.


సర్వసాధారణమైన వ్యవహారాలు
అవసరాలు, పరిస్థితులను బేరీజు వేసుకొని రంగంలోకి దిగుతారు
 కొంత కాలంగా ఇలాంటి వ్యవహారాలు సర్వ సాధారణమైపోయాయి. సమాజం అవసరాలను, గ్రామాల స్థాయిలో పరిస్థితులను, పేదలు, అనాథలు, అమాయకుల అవసరాలను బేరీజు వేసుకుంటూ రంగంలోకి దిగుతారు.


అనాథలు, వృద్ధుల ఆశ్రమాలు చైల్డ్‌ వెల్ఫేర్‌ హోమ్‌లంటారు
నిబంధనలు తెలియవు
మార్గదర్శకాలతో వాళ్లకు పనిలేదు
పిల్లలనే అస్త్రాలుగా వాడుకుంటారు
 అనాథలు, వృద్ధుల ఆశ్రమాలంటూ.. చైల్డ్‌ వెల్ఫేర్‌ హోమ్‌లంటూ కలరింగ్‌ ఇస్తారు. ఎవరి దృష్టీ పడని ప్రాంతాలు ఎంచుకొని బోర్డులు పెడతారు. అసలు నిబంధనలంటే వాళ్లకు తెలియవు. ఇలాంటి కేంద్రాలు ఎలా నిర్వహించాలో మార్గదర్శకాలతో పనిలేదు. వాటి పేరు చెప్పుకొని తమ పబ్బం గడుపుకుంటారు.  చైల్డ్‌ హోమ్‌ల నిర్వాహకులు.. పిల్లలనే అస్త్రాలుగా వాడుకుంటారు. వెలుగులోకి వస్తే తప్ప.. ఎవరికీ కనిపించని ఓ మాఫియా తరహా వ్యవహారమిది.

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో చిన్నారుల భిక్షాటన
కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌లో నలుగురు చిన్నారులను గుర్తించారు పోలీసులు. ఇద్దరు బాలురు, మరో ఇద్దరు బాలికలు భిక్షాటన చేస్తున్నారు. చేతిలో హుండీలు పట్టుకొని కనిపించిన వారినల్లా డబ్బులడుగుతున్నారు. అంత చిన్న వయసులో వీళ్లకు ఇదేం పరిస్థితి అని చలించిపోయారు. దగ్గరికెళ్లి వాళ్ల గురించి వివరాలు ఆరా తీశారు.

అనాథాశ్రమానికి చెందినవాళ్లమన్నారు
భిక్షాటన చేయాలని ఆశ్రమ నిర్వాహకుడి ఆదేశం
తాము ఓ అనాథాశ్రమానికి చెందిన వాళ్లమని చెప్పారా చిన్నారులు. తమ ఆశ్రమం నిర్వాహకుడి ఆదేశాల మేరకు ఇక్కడ భిక్షాటన చేస్తున్నామని చెప్పారు. దీంతో.. తీగలాగిన పోలీసులు డొంకంతా కదిలించారు.

హైదరాబాద్‌లో రోజూ చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
భిక్షాటన అనేది సామాన్యమైన విషయం కాదు. హైదరాబాద్‌లో కేవలం భిక్షాటనపైనే రోజూ కోట్ల రూపాయలు చేతులు మారతాయన్న విషయం తెలిసిందే. దాన్ని ఆసరాగా తీసుకున్న ఆశ్రమ నిర్వాహకుడు చిన్నారులనే పావులుగా వాడుకున్నాడు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాలు ముదిరితే మాఫియా అనడం పరిపాటి.. మరి భిక్షాటనకూ ఓ సినిమాలో ఒక పేరు పెట్టారు.

చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం
బ్రహ్మపుత్ర అనాధాశ్రమంలో తనిఖీలు
నిర్వాహకుడు ఖమ్మం జిల్లా వాసి జేమ్స్‌
భిక్షాటన చేస్తున్న చిన్నారులిచ్చిన వివరాలతో చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారమిచ్చారు పోలీసులు. మెదక్‌ జిల్లా పటాన్‌ చెరు మండలం అమీన్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మపుత్ర అనాథాశ్రమంలో తనిఖీలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన జేమ్స్‌ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న 19మంది చిన్నారులను రెస్క్యూహోమ్‌కు తరలించారు.  

ప్రభుత్వ అనుమతి లేకుండానే జేమ్స్‌ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చైల్డ్‌లైన్‌ అధికారులు తెలిపారు. చిన్నారులను పాఠశాలకు పంపకుండా వారితో భిక్షాటన చేయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. జేమ్స్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.   బ్రహ్మపుత్ర అనాథాశ్రమం పేరిట ఇలాంటి తతంగం చాలా రోజుల నుంచి జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.


 
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 5:42 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

13, ఆగస్టు 2016, శనివారం

గ్యాంగ్‌స్టర్‌ నయీం డాక్యుమెంటరీ (రెడ్‌ అలర్ట్‌)





nayeem ONE
-------------
నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే రాజకీయ నాయకులు హడలెత్తిపోతారు. హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకే ఉండదు. అలాంటి నయీమ్‌ నేర చరిత్రపై రెడ్‌ అలర్ట్‌ స్పెషల్‌ డాక్యుమెంటరీ...

voice over
---------
నల్గొండ జిల్లా కనగల్‌ మండల కేంద్రం.... గ్యాంగ్‌స్టర్‌ నయీం పుట్టింది ఇక్కడే... కానీ.. అతని బాల్యం, విద్యాభ్యాసం, పెరిగింది.. అంతా ఇదే జిల్లాలోని భువనగిరి.
స్పాట్...(భువనగిరి వ్యూషాట్స్‌ వేసుకోండి.)

నయీం తండ్రి ఖాజా నసీరుద్దీన్‌ అప్పటి ఏపీఎస్‌ఈబీ.. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌. అందుకే.. అతని ఉద్యోగ రీత్యా కుటుంబం కనగల్‌ నుంచి భువనగిరికి మారింది. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుందీ కుటుంబం. నయీం తల్లి తాహెరాబేగం. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
స్పాట్‌...

కనగల్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో నయీం జన్మించాడు. భువనగిరికి మకాం మార్చిన సమయంలో నయీం బుడి బుడి అడుగులు వేస్తున్న వయసులో ఉన్నాడు. ఇక.. బాల్యమంతా అక్కడే గడిచింది. భువనగిరిలోనే చదివాడు. పరిసరాల్లో ఆడుకున్నాడు. చెట్టూ, పుట్టా తిరిగాడు. తన ఏజ్‌ వాళ్లతో కలిసి ఆడి పాడాడు. కాలేజీ చదువు కూడా అక్కడే సాగింది.
స్పాట్‌...

1991లో ఇంటర్మీడియట్‌ చదివాడు నయీం. కాలేజీలో చేరినప్పటినుంచే నయీం వ్యక్తిత్వంలో మార్పు కనిపించింది. ఆలోచనల్లో విభిన్నత గోచరించింది. తోటివాళ్లకు, నయీంకు మధ్య తేడా స్పష్టంగా ఉండటాన్ని అప్పటి పెద్దలు గమనించారు.
స్పాట్‌...

నయీం మరోకోణం చిన్నప్పుడు అతనితో కలిసి తిరిగిన వాళ్లకే తెలుసు. అతనిది విచిత్ర మనస్తత్వమని.. వాటి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకోవడం కొందరికి ఒళ్లు జలదరించేలా చేస్తుంది.
స్పాట్‌...

పాములు, తేళ్లతో ఆడుకునే వాడు నయీం... అతని రాక్షస మనస్తత్వానికి ఇదో మచ్చు తునక. అసలు వాటిని చూస్తేనే భయపడి ఆమడదూరం పరుగెత్తే వయసులోనే.. వాటిని పట్టుకొని ఆడుకోవడం చూస్తే అతనిలోని తెగింపు అర్థం చేసుకోవచ్చు.
స్పాట్...

విద్యార్థి దశలోనే సీపీఎం అనుబంధం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా- SFI లో పనిచేశాడు నయీం. ఆ తర్వాత పీపుల్స్‌వార్‌ అనుబంధ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ - RSU లో చేరాడు. ఆర్‌ఎస్‌యూలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ సమయంలోనే ప్రత్యేకంగా ఓ గ్రూప్‌ను మెయింటెయిన్‌ చేశాడు. అనుచరులను వెంటేసుకొని తిరిగాడు. అప్పుడే పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాలకు, కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యాడు నయీం.
స్పాట్‌...

అది 1991వ సంవత్సరం. ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలోనే  పీపుల్స్‌వార్‌తో అనుబంధాలు పెంచుకొన్నాడు నయీమొద్దీన్‌. అంతేకాదు.. ఓ తపంచాను కూడా సమీకరించుకున్నాడు. దాన్ని చూపించి భువనగిరిలోని కొందరు వ్యాపారవేత్తలను బెదిరించాడు. దీంతో.. వ్యాపారులు పోలీసుల శరణుజొచ్చారు. అప్పటికే ఓ గ్యాంగ్‌ను మెయింటెయిన్‌ చేస్తున్న నయీంతోపాటు.. అతని అనుచరులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. అంటే.. ఇంటర్‌ చదువుతున్నప్పుడే పోలీసులతో తొలివైరం మొదలైంది.
స్పాట్‌...

అదే యేడాది... నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో కలకలం. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఆసమయంలో గుట్టపైనే నయీం అరెస్టయ్యాడు. నాటు తుపాకీతో పాటు గ్రెనేడ్‌తో హల్‌చల్‌ సృష్టించి.. భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించాడు నయీం,. అంతేకాదు.. బ్రహ్మోత్సవ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి ప్రయత్నించాడు. దీంతో.. అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పాట్‌...

ఆర్‌ఎస్‌యూలో పనిచేసిన అనుభవంతో.. ఆ భావాలతో పెరిగిన నయీం.. అప్పటికే పీపుల్స్‌వార్‌తో సంబంధాలు పెంచుకున్నాడు. యాదగిరి గుట్ట కేసులో అరెస్ట్‌ అయి.. చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడే పీపుల్స్‌వార్‌ నేత శాఖమూరి అప్పారావుతో అనుబంధం పెంచుకున్నాడు. సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేశాడు. వారికి సన్నిహితుడిగా మెలిగి.. నమ్మిన బంటుగా మారాడు కూడా.
స్పాట్...

స్వతహాగా భిన్న ఆలోచనలతో సంచలనాలు సృష్టించడమంటే సరదా పడే.. నయీమొద్దీన్‌.. ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచించేవాడు. దాడులు, బెదిరింపులు, సెటిల్‌మెంట్‌లంటే ముందుండే వాడు. దీంతో.. పీపుల్స్‌ వార్‌లో కూడా నయీమ్‌కు ప్రత్యేక స్థానం లభించింది.
స్పాట్‌...
=================================================
=================================================
nayeem TWO
-------------
ఒక డీఐజీ స్థాయి పోలీసును టార్గెట్‌ చేయడమంటే మాటలు కాదు. అందుకు ఎంతో నేర్పు అవసరం. పలు సార్లు రెక్కీలు తప్పనిసరి. టార్గెట్‌ అయిన వ్యక్తి  మూవ్‌మెంట్స్‌పై కన్నేయాలి. అప్‌టూ డేట్‌ ఇన్ఫర్మేషన్‌ తెలుసుకొని ఉండాలి. ఏ సమయంలో ఎక్కడెక్కడికెళ్తున్నాడన్న దినచర్యను గమనిస్తూ ఉండాలి. ఇంతటి క్లిష్టమైన పనిని నయీంకు అప్పగించింది పీపుల్స్‌వార్‌ గ్రూప్‌.

voice over
----------
స్పాట్‌...
అప్పటికే పీపుల్స్‌వార్‌లో ఎంతోమంది సీనియర్లున్నా.. రెండుమూడేళ్ల నుంచే తమతో  సంబంధం ఉన్న... అప్పుడప్పుడే  ఎదుగుతున్న నయీంనే ఈ పనికి ఎంచుకుంది పీపుల్ష్‌వార్‌.
స్పాట్‌..

గురిపెట్టానంటే తప్పదన్న పేరు ప్రతిష్టలు తనకే దక్కాలన్న ఉత్సుకతతో ఉండే నయీం.. కూడా సరేనంటూ తలూపాడు. పీపుల్స్‌వార్‌ నాయకత్వం తనకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు అంగీకరించాడు.
స్పాట్‌...

1993 జనవరి 27వ తేదీ ఉదయం. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం. ఎందరో ప్రముఖులు, పోలీసు అధికారులు, సామాన్యులు కూడా మార్నింగ్‌ వాక్‌కు వచ్చారు. కాసేపట్లోనే కాల్పుల శబ్దం. స్టేడియం అంతా కలకలం. అంతా తేరుకునేలోగానే రక్తపు మడుగులో మూడు మృతదేహాలు. అందులో డీఐజీ వ్యాస్‌ డెడ్‌బాడీ. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.
స్పాట్‌...

పోలీసు డిపార్ట్‌మెంట్లో గ్రేహౌండ్స్‌ విభాగానికి ఆద్యుడు డీఐజీ వ్యాస్‌. అలాంటి డీఐజీనే చంపిన నయీం.. ఆ తర్వాత కాలంలో గ్రేహౌండ్స్‌కే కావాల్సిన వ్యక్తిలా మారాడు. తర్వాత పరిణామాలు అలాంటి పరిస్థితులకు వీలు కల్పించాయి.
స్పాట్‌....

డీఐజీ వ్యాస్‌ను హత్య చేసిన తర్వాత నయీం పోలీసులకు లొంగిపోయాడు. షరా మామూలుగా పోలీసులు జైలుకు పంపించారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమోగానీ.. అప్పటినుంచి పీపుల్స్‌వార్‌కు, నయీంకు శత్రుత్వం పెరిగిపోయింది. అతి కొద్ది కాలానికే పీపుల్స్‌వార్‌కు దూరమయ్యాడు నయీం. వ్యాస్‌ కేసులో జైలులో ఉన్న సమయంలో నయీంకు, పీపుల్స్‌వార్‌ అగ్రనేతలకు మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతారు.
స్పాట్‌...

ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు నయీమొద్దీన్‌. తన పంథా మార్చుకున్నాడు. ఆలోచనలకు పదును పెట్టాడు. మొదట ఎవరైతే తనను ఆదరించారో వాళ్లే తన శత్రువులుగా చెప్పుకున్నాడు.
స్పాట్...

నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం.. ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు. వాళ్లపైనే యుద్ధం ప్రకటించాడు. ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తానని శపథం చేశాడు. అందుకోసం ఏ పనైనా చేస్తానన్నాడు.
స్పాట్‌...

మావోయిస్టులపై పగబట్టినట్లు ప్రకటించుకుని కింగ్ కోబ్రాలను సృష్టించాడు. ఒక్క కింగ్‌కోబ్రాలే కాదు.. నల్లమల కోబ్రాస్‌, కాకతీయ కోబ్రాస్‌, నర్సా కోబ్రాస్‌, క్రాంతిసేన పేరిట చెలరేగి పోయాడు.
స్పాట్‌...

నయీం లక్ష్యాలు, కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన పోలీసులు.. అతన్ని చేరదీశారు. తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారని కథలు కథలుగా చెప్పుకుంటారు. కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా కూడా మారాడంటారు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారని సమాచారం. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు.
స్పాట్‌...
=================================================
=================================================
nayeem Three
-------------
ఓ సందర్భంలో నక్సల్స్‌ నుంచి ముప్పు ఉందన్న కారణంగా నయీమ్‌కు ప్రభుత్వమే భద్రత కూడా కల్పించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత భూ దందాలు, సెటిల్‌మెంట్ల కేసుల్లో నిండా మునిగిపోయాడు. మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.

voice over
----------
స్పాట్‌...
పోలీసుల నుంచి రహస్యంగా తోడ్పాటు అందడంతో.. నయీమొద్దీన్‌కు వేయి ఏనుగుల బలం వచ్చినట్లయ్యిందన్న వాదన ఉంది. పీపుల్స్‌వార్‌లో ఉన్నప్పుడు నయీం పాల్పడిన అరాచకాల కన్నా.. వాళ్లపై యుద్ధం ప్రకటించాక సృష్టించిన మారణహోమమే ఎక్కువ.
స్పాట్‌...

వ్యాస్‌ హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాక.. చిన్నప్పటినుంచి తనకు అనుబంధం ఉన్న భువనగిరికి మకాం మార్చాడు నయీం.. కొంతకాలం అటు.. పీపుల్స్‌వార్‌తో, ఇటు పోలీసులతో సంబంధాలు కొనసాగించిన దిట్ట నయీం. అప్పటికే ఓ ధృఢమైన అభిప్రాయానికి వచ్చినందున.. పీపుల్స్‌వార్‌ కదలికలను, వాళ్ల అరాచక ప్లాన్‌లను ఎప్పటికప్పుడు తనకు అండగా ఉండే పోలీసులకు చేరవేశాడన్న ప్రచారం ఉంది.
స్పాట్‌...

నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారని కథలు కథలుగా చెప్పుకుంటారు. కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా కూడా మారాడంటారు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారని సమాచారం. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు.
స్పాట్‌...

ఒకటి కాదు, రెండు కాదు.. 40కి పైగా హత్య కేసులు... వందకు పైగా బెదిరింపుల కేసులు. లెక్కలేనన్ని భూ దందాలు, సెటిల్‌మెంట్లతో సాగిన నయీం జీవితమే హింసాత్మకం.
స్పాట్‌...

కొన్నేళ్లపాటు నేరసామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఆ సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా తయారయ్యాడు. తన దారికి ఎవరైనా అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా నరికేశాడు.
స్పాట్‌...

1993లో ఐపీఎస్‌ వ్యాస్‌ను కాల్చి చంపడంతో మొదలు.. నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన ముందురోజు.. అతని అనుచరుడు వాజిద్‌ హత్య దాకా నయీం పాత్రపై అనేక ఆరోపణలు వచ్చాయి.
స్పాట్‌...

2000 డిసెంబర్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పౌర హక్కుల నేత పురుషోత్తంను హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో పట్టపగలే నరికిచంపిన కేసుతో పాటు.. మరో హక్కుల సంఘం నేత కరుణాకర్‌ను చంపిన కేసులోనూ నయీం నిందితుడు.
స్పాట్‌...

మరుసటి యేడాది అంటే.. 2001 ఫిబ్రవరిలో నల్గొండకు చెందిన ఏపీసీఎల్సీ నేత ఆజం అలీని నయీం గ్యాంగ్‌ కత్తులతో నరికి చంపేసిన ఘటనపై నల్గొండలో పోలీసు కేసు నమోదైంది. నయీమ్‌ జైలులో ఉండగానే ఈ హత్యకు కుట్ర చేశాడని ఆరోపణలున్నాయి.
స్పాట్‌...

అదే యేడాది డిసెంబర్‌లో శ్రీరాములు యాదవ్‌, బద్దుల మల్లేష్‌ యాదవ్‌, ఇక్కిరి సిద్దులు అనేముగ్గురిని మల్కాపూర్‌ శివారులో దారుణంగా హత్య చేశారు. పాత కక్షలతో నయీం గ్యాంగే ఈ హత్యలు చేసినట్లు కేసు చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.
స్పాట్‌...

2011లో నయీమొద్దీన్‌ ఆదేశాలతోనే అతని అనుచరులు.. మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో మెంబర్‌ అయిన కోనాపురి అయిలయ్య అలియాస్‌ సాంబశివుడును గొడ్డలితో నరికి చంపినట్లు వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉంది.
స్పాట్‌...

2014లో వలిగొండకు చెందిన అఫ్జల్‌ అహ్మద్‌ ఖాన్‌ను నయీం అనుచరులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. నయీం సూచనలతో అతని అనుచరులు షేక్‌ షకీల్‌, పాశం శ్రీను తదితరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
స్పాట్‌...

అలాగే.. కోనాపురి అయిలయ్య తమ్ముడైన మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్‌ నాయకుడు కోనాపురి రాములును కూడా నల్గొండలో నయీం ముఠా హత్య చేసింది. ఈ ఘటనపైనా నల్గొండ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
స్పాట్‌...

ఇవే కాదు.. మావోయిస్టు కార్యకర్త, ప్రజా గాయ‌కురాలు బెల్లి ల‌లిత హ‌త్య కేసులోనూ నయీమే కీలక నిందితుడు. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి.. ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడి 11సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు నయీం.
స్పాట్‌...

సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా ప్లాన్లు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. నేరాలు చేసే స్టయిల్‌ వెరైటీగా ఉంటుంది. నేరాలకు ప్లాన్‌ చేసేది ఒక గ్రూప్‌ అయితే.. ఆ నేరం చేసేది మరొక గ్రూప్‌. ఆ సంఘటన జరిగాక 48 గంటల్లోనే లొంగిపోయేది ఇంకో గ్రూప్‌. దీంతో.. పోలీసులు కూడా పక్కా సాక్ష్యాలు ఛేధించలేకపోయిన కేసులు ఎన్నో ఉన్నాయని చెబుతారు.
స్పాట్...

నయీం అరాచకాలు రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలోనూ పెట్రేగిపోయాయి. రాష్ట్రంలోనే కాక చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, వెస్ట్‌బెంగాల్‌లోనూ తననెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు. గుజరాత్‌లో ఆయుధాల స్మగ్లింగ్‌ కేసులో మోస్ట్‌వాంటెడ్‌ లిస్టులో ఉన్నాడు. 2008 ఏప్రిల్‌లో చోటారాజన్‌ అనుచరుడు అజీజ్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ వెనుక కూడా నయీం గ్యాంగ్‌తో విభేదాలే కారణమని సమాచారం.  అంతేకాదు.. బంగ్లాదేశ్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లి ఐఎస్ఐతో చేతులు కలిపినట్లు పోలీసువర్గాలు గుర్తించాయి.
స్పాట్‌....
=================================================
=================================================
nayeem  Four
-------------
నక్సల్స్‌పై యుద్ధం ప్రకటించాక భూదందాలు, సెటిల్‌మెంట్లనే ప్రధాన వ్యాపకంగా మార్చుకున్న నయీం.. గ్యాంగ్‌స్టర్‌ అవతారమెత్తాడు. తనకంటూ ఓ గ్యాంగ్‌ను రూపొందించుకున్నాడు. ఇక.. వెనుదిరిగి చూడలేదు. మాఫియా లెవెల్‌లో చెలరేగిపోయాడు.
స్పాట్‌...

voice over
----------
మొదట్లో హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నయీమ్‌.. ఆ తర్వాత రూట్‌ మార్చాడు. తన గ్యాంగ్‌ ఫామ్‌లోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక.. బాధ్యతలన్నీ గ్యాంగ్‌కు అప్పగించాడు. అందుకే నయీమ్‌ ప్రత్యర్థుల హత్య కేసుల్లో అతని అనుచర గణమే ప్రధాన నిందితులుగా ఉన్నారు.
స్పాట్...

భూ దందాలు, సెటిల్‌మెంట్లపై కన్నేసిన గ్యాంగ్‌స్టర్‌.. వివాదాస్పద భూముల్లోకి ఎంటరై అరాచకాలు సృష్టించాడు. సెటిల్‌మెంట్లలో తనదైన ముద్ర వేసుకున్నాడు.
స్పాట్‌...

ఎన్‌కౌంటర్లలో పలువురిని హతమార్చేందుకు తమకు సహకరించిన నయీమ్‌ను కొందరు పోలీసు అధికారులు బాగానే ఉపయోగించుకున్నారన్న వాదన ఉంది. ఓ దశలో పోలీసులు తమవల్ల కాని సివిల్‌ మ్యాటర్లు, భూ దందాలు, సెటిల్‌మెంట్లను నయీంతో చేయించారన్న ప్రచారమూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో షికార్లు చేస్తోంది. ఫలితంగా ప్రతిఫలాన్ని కూడా పొందారని చెప్పుకుంటారు.
స్పాట్‌...

అందుకే నయీం దందాకు పలువురు పోలీసు అధికారులే పరోక్ష సహకారం అందించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు.. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కదలికలూ ఎప్పటికప్పుడు నయీమ్‌కు చేరేవన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అతని ఇంట్లో ఏకంగా శాటిలైట్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు.
స్పాట్‌...

ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎదిగిన నయీం నేరసామ్రాజ్యం శాఖోపశాఖలుగా విస్తరించింది. రాను రానూ నయీం కాదు.. నయీం పేరు చెబితేనే వణుకు పుట్టే పరిస్థితులు దాపురించాయి.
స్పాట్‌...

నయీమ్‌ అంటే ఓ పేరు కాదు, మాఫియాకి అదో బ్రాండ్‌ నేమ్‌.. అన్నట్లుగా కార్యకలాపాలు కొనసాగాయి. 2007లో ఐపీఎస్‌ అధికారి వ్యాస్‌ హత్యకేసులో నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచిన సమయంలో.. పోలీసుల నుంచి తప్పించుకున్న నయీమొద్దీన్‌.. కొందరు పోలీసుల అండతో తన హవా నడిపించాడని చెబుతారు.
స్పాట్‌...

నయీమ్‌ పారిపోవడానికి పొలీసులే సహకరించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. అప్పటి నుంచి నయీమ్ పూర్తిగా అజ్ఞాతంలో వుంటూనే గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు.  గతంలో సాగించిన సెటిల్‌మెంట్లు కంటిన్యూ చేశాడు. అయితే.. అదే అదనుగా ఆయన పేరిట కొందరు అనుచరులు,  దగ్గరి బంధువుల దౌర్జాన్యాలు కూడా పెరిగిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి.
స్పాట్‌...

అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు. భాయ్‌ పేరుతో అతని గ్యాంగ్‌ ఊళ్లమీద పడింది. నియంతృత్వ పరిష్కారాలు, ఆదేశాలు.. కాదంటే చిత్రహింసలు పెట్టి ఖతం చేయడాలు కొనసాగాయి.
స్పాట్‌...

ఎవరిని టార్గెట్‌ చేసినా.. ముందు వాళ్ల చరిత్ర మొత్తం తెలుసుకుంటాడు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, బలహీనతల చిట్టా మొత్తం గ్యాంగ్‌ సహకారంతో చేతికి అందుతుంది. ఇక.. భాయ్‌ చెప్పిందే ఫైనల్‌. మరో మాటకు తావుండదు.
స్పాట్‌...

భూ దందా అయితే చెప్పిన రేటుకు అమ్మేయాలి. పంపకాలు, సెటిల్‌మెంట్లు అయితే.. రెండు పార్టీలూ భాయ్‌ చెప్పినంత సమర్పించుకోవాల్సిందే... లేకుంటే బతుకు బేజారే...
స్పాట్‌...

భాయ్‌ టార్గెట్‌ చేసిన వాళ్లకు మొదట ఫోన్‌ కాల్స్‌ వెళ్తాయి. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌లతో వేధింపులు కొనసాగుతాయి. మూవ్‌మెంట్స్‌ క్షణక్షణం వల్లెవేయడం ఎదుటివాళ్లను నిలువెల్లా వణికిస్తుంది. అంతే.. చేతనైతే డిమాండ్‌ చేసినంతా చేతుల్లో పెట్టాలి. లేకుంటే.. కాళ్లా వేళ్లాపడి ఎంతో కొంత బేరమాడుకోవాలి. కానీ.. ఊరికే వదిలేయడం మాత్రం అసంభవం.
స్పాట్‌...

తనకు ఎదురు తిరిగారనో, తన దందాకు అడ్డువచ్చారనో తెలిస్తే.. భాయ్‌ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టడు. నీడలా వెంటాడుతాడు. భయమంటే ఏంటో.. చావు ఎలా ఉంటుందో ఎదుటివాళ్లకు ప్రత్యక్షంగా చూపిస్తూ.. తాను చూస్తూ పైశాచిక ఆనందం పొందుతాడు. అతని చేతిలో హతమై.. గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదైన సందర్భాలూ అనేకం ఉన్నాయంటారు అతని మనుషులు.
స్పాట్‌...

మొత్తానికి సమాంతర ప్రభుత్వాన్నే నడిపిన నయీమ్‌.. అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్న పోలీసులు.. ఆరేళ్లుగా తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నారు. పోలీసులు తనగురించి వేట కొనసాగిస్తున్నారని కూడా ముందే పసిగట్టాడు నయీమ్‌. పోలీస్‌ టెక్నిక్స్‌ వంట బట్టించుకున్న ఈ గ్యాంగ్‌స్టర్‌.. తనదైన శైలిలో అండర్‌ వరల్డ్‌ను ఏర్పరచుకున్నాడు. పోలీసులు పసిగట్టలేనంత పకడ్బందీ వ్యూహాలు అమలు చేశాడు.
స్పాట్‌...

చివరి రోజుల్లో చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నయీం భాయ్‌.. తన సెక్యూరిటీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అనుచరులుగా తన అడుగులకు మడుగులొత్తిన వాళ్లను కొంతకాలమే చేరదీసి తర్వాత దూరం చేశాడు. గన్‌మెన్లనూ ఎప్పటికప్పుడు మార్చేసేవాడు. తన ఉనికి దొరక్కుండా జాగ్రత్తపడేవాడు.
స్పాట్‌...

మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో జరిగిన అనుచరుడి హత్యలో నయీం ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. జహీరాబాద్‌ నుంచి తెల్లవారుజామున నయీం.. తన గ్యాంగ్‌తో కలిసి హైదరాబాద్‌ మీదుగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు.
స్పాట్‌...

పోలీస్‌ రికార్డుల ప్రకారం.. జూలై 15వ తేదీన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి జెడ్పీటీసీ భర్తను సెల్‌ఫోన్‌లో బెదిరించింది నయీం గ్యాంగ్‌. యాంటీ నక్సలైట్‌ గ్రూప్‌ అయిన తమ అవసరాలకోసం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. మరుసటిరోజు కూడా ఫోన్‌చేసి బెదిరించడంతో పాటు.. అదేరోజు 'ఇది భాయ్‌సాబ్‌ హుకుం' అని మెస్సేస్‌ కూడా పంపింది. షాద్‌నగర్‌ వచ్చి ఆ మొత్తం సమర్పించుకోవాలని కూడా హుకుం జారీ చేసింది. ఈ సమయానికి నయీం షాద్‌నగర్‌ చేరుకున్నాడు.
స్పాట్‌...

తాను అంతమొత్తం ఇచ్చుకోలేనన్న జెడ్పీటీసీ భర్త గంగాధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా.. రంగంలోకి దిగిన పోలీసులు నయీం ఆట కట్టించారు. ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు.
స్పాట్‌...

నక్సలైట్ల ఆనుపానులు తెలుసుకొని వాళ్లకే ఎసరుపెట్టాడు. తర్వాత పోలీసులకు కోవర్టుగా మారి వాళ్ల పేరును ఉపయోగించుకొని చెలరేగిపోయాడు. మొత్తానికి మోస్ట్‌ వాంటెడ్‌గా మారి.. ఆపరేషన్‌ నయీంతో హతమైపోయాడు.
స్పాట్‌...
=================================================
=================================================
nayeem  Five
-------------
ఆపరేషన్‌ నయీమ్‌ సక్సెస్‌ అయ్యింది. అతనికి టార్గెట్‌గా మారిన వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులూ..  అతని నేర సామ్రాజ్యంపై దృష్టిపెట్టారు. మరి.. ఈ పరిణామాలతో పని పూర్తయినట్లేనా..? నయీం పీడ విరగడైనట్లేనా..?

voice over
----------
కారణమేదైనా.. ఉసిగొల్పింది ఎవరైనా.. నయీమ్‌.. ఓ నయా దందాకు మార్గం కనిపెట్టాడు. ఎవరి అవసరాలకు వారు వాడుకున్నా.. ఎదుటి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆ తర్వాత చెలరేగిపోయాడు. తనకు మొదట్లో అండగా ఉన్నవాళ్లకే ఏకు మేకై కూర్చున్నాడు.
స్పాట్‌...

కాలక్రమంలో ఆత్మవిశ్వాసం హద్దులు దాటింది. అత్యాశ మితిమీరిపోయింది. తనకు ఎదురేదీ లేదన్న ఆలోచన వక్రబుద్ధి పట్టించింది. ఎదుటివాళ్లు ఎవరైనా లెక్కచేయని తత్వం పెరిగిపోయింది.
స్పాట్‌...

ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిణామాలను పక్కనబెడితే.. పెట్రేగిపోయిన నయీం అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన ఎవరు అవునన్నా కాదన్నా.. హర్షించదగినదే... ఆరునెలలుగా పోలీసులు వేటాడటం నిజమే అయితే.. ఇన్నాళ్లూ అతని జాడ కనుక్కోలేకపోవడం వెనుక లోపాలను సమీక్షించుకోవాల్సిందే... పోలీసు వ్యూహం గురించి నయీమ్‌కు ముందే ఉప్పందినట్లు గ్రహిస్తేమాత్రం.. అలాంటి ఆలోచనలను కూకటివేళ్లతో పెకిలించి వేయాల్సిందే...
స్పాట్‌...

నయీం డైరీ.. ఓ మాఫియా పుట్ట. అందులో ప్రతి పంక్తిలోనూ అమాయకులను వేధించిన ఆనవాళ్లున్నాయి. పేజీ పేజీలోనూ అరాచకాల మూలాలున్నాయి. తాను చేసిన దందాలకు సాక్ష్యాలున్నాయి. తనకు సహకరించిన వాళ్ల బండారం ఉంది. బినామీల వ్యవహారం ఉంది. తాను పెంచి పోషించిన మాఫియా గ్యాంగ్‌ చిట్టా ఉంది.
స్పాట్‌...

గ్యాంగ్‌స్టర్‌ ఖతమైపోయాడు. మరి.. జనంతో ఆడుకున్న మాఫియా డాన్‌ ఒక్క నయీమేనా..? జనాన్ని పీడిస్తూ.. అరాచకాలకు పదును పెడుతూ.. చెలరేగిపోతున్న మిగతావాళ్ల సంగతేంటి..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం వెతకాలి. ఇలాంటి విష సంస్కృతిని మొక్కలోనే తుంచి వేయాలి.
స్పాట్‌...
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 6:15 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

10, ఆగస్టు 2016, బుధవారం

జాగృతి వారపత్రిక కృష్ణా పుష్కర సంచిక లో ప్రచురితమైన నా ప్రత్యేక కథనాలు





వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 9:08 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

2, జులై 2016, శనివారం

విశ్వమంతా ఒక్కటైన వేళ...

సరిహద్దులు చెరిగిపోయిన సమయం
ఆసనమేసిన యావత్ ప్రపంచం

                                                                                               - హంసిని సహస్ర సాత్విక



యోగా కోసం సరిహద్దులు చెరిగిపోయాయి. విశ్వమంతా ఒక్కటైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ప్రపంచస్థాయిలో పండుగ జరుపుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఆసన విన్యాసాలు చేసింది. యావత్ ప్రపంచం ఆసనమేసింది. కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి క్రమశిక్షణతో ఆసనాలు వేయడం కన్నుల పండువ అయ్యింది. గత యేడాదే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించగా.. ఈసారి రెండో యేడాది మరింత ఉత్సాహంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాలకు గాను లిబియా, యెమెన్‌ మినహా అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాయి. వీటిలో అరబ్ దేశాలు కూడా ఉండటం నిజంగా విశేషం. భారతీయ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉన్న యోగా.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి హాట్ ఫేవరేట్ అయ్యింది. ప్రాణాలను నిలబెట్టేదే కాదు.. నిత్యయన్వనాన్ని తెచ్చిపెట్టేది కూడా యోగా.

మోదీ ప్రతిపాదన.. ఐరాస ప్రకటన :
-----------------------------------
2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ యోగా ప్రాధాన్యతను వివరిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. అంతేకాదు.. జూన్‌ 21నే యోగా దినంగా ఎందుకు జరుపుకోవాలన్న దానిపైనా మోదీ స్పష్టత ఇచ్చారు. ఉత్తరార్థగోళంలో నమోదయ్యే అతిపెద్ద రోజు జూన్‌ 21. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆ తేదీకి ప్రాధాన్యత ఉంది. అందువల్లే యోగా దినోత్సవం ఆరోజు జరుపుకుంటే బాగుంటుందని ప్రతిపాదించారు. తదుపరి యేడాదే ఐక్యరాజ్యసమితి ఈమేరకు ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని యోగా వేదికపైకి తీసుకొచ్చింది. ఈయేడాది.. ''అభివృద్ధి ల‌క్ష్యాలు సాధించాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నం అవ‌స‌రం'' అన్న నినాదంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించింది ఐక్యరాజ్యసమితి.


ఢిల్లీలో ప్రణబ్‌, చండీగఢ్‌లో మోదీ...
---------------------------------------
ఐక్యరాజ్యసమితి యోగా వేడుకల్లో 139 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జగ్గీ వాసుదేవ్ యోగాసనాలు వేయించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. యోగా ఒక రోజు లాంఛనం కాకూడదని.. యోగా దైనందిన జీవతంలో భాగం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ఇక.. చండీగఢ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 30వేల మంది యోగా చేశారు. నరేంద్రమోదీ వందరకాల యోగాసనాలు ప్రదర్శించారు. యోగాకు ఒక మతం లేదని, యోగా వల్ల జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకునే వీలు కలుగుతుందని మోదీ గుర్తు చేశారు. ఇహలోక సుఖం కోసం ప్రతీ ఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేయాలని ఆయన సూచించారు. ఫరీదాబాద్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్.. యోగాసనాలు వేసి జనాన్ని ప్రోత్సహించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ యోగా చేశారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతాధళాలు కూడా యోగాలో భాగస్వాములయ్యాయి. భారత యుద్ద నౌక ఐఎన్ఎస్ విరాట్ సిబ్బంది కూడా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా 391 వర్శిటీలు, 16 వేల కాలేజీలు, 12 వేల పాఠశాలల్లో యోగా దినోత్సవం నిర్వహించారు. మనదేశంలోనే లక్షకు పైగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాల్లో 36 మిలియన్ల మంది యోగాసనాలు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ల జనం యోగాసనాలు వేసినట్లు భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన 173 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా కార్యక్రమాల్లో ప్రజలచేత ఆసనాలు వేయించాయి.

గర్భిణీల యోగా రికార్డు :
--------------------------
గుజరాత్ లోని రాజ్ కోట్ లో రెండువేల మంది గర్భిణీ మహిళలు ఏకకాలంలో యోగా చేయడం ద్వారా యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. యోగా చేస్తున్న వాళ్లకే కాదు.. కడుపులోని బిడ్డకూ ఆరోగ్యకరమే అని ప్రబోధించారు. అంతేకాదు.. సుఖప్రసవానికి కూడా యోగా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. మరోవైపు.. హైదరాబాద్ లోనూ వందమంది గర్భిణీలు యోగాసనాలు వేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

యోగా పోస్టల్ స్టాంప్ :
------------------------
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సూర్య నమస్కారాలతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

విశ్వవిద్యాలయాల్లో యోగా కోర్సులు :
-------------------------------------------
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతియేడాదీ అట్టహాసంగా జరుగుతున్నందున.. ఇదే స్ఫూర్తితో దేశంలోని విశ్వవిద్యాలయాల్లో యోగాను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. యోగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్ని నిర్వహించాలంటూ యూజీసీని ఆదేశించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది.

- హంసిని సహస్ర సాత్విక


(Published in LOKAHITHAM Monthly Magazine)
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 12:51 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

21, జూన్ 2016, మంగళవారం

ఆరోగ్యానికి యోగ

ఆరోగ్యానికి యోగ

జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకం

పుట్టుక నుంచి చావు వరకు వెంట వచ్చేది మన శరీరమే. ఇంకేవైనా మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే. ఎన్నోసార్లు దుస్తులు, ఇండ్లు, ఉద్యోగాలు మార్చుతాం, ఊర్లు, ఆహారాన్ని కూడా మారుస్తాం. సృష్టిలో అన్నీ మార్చగలం. శరీరం మాత్రం మనతోనే వస్తుంది. మనతోనే మట్టిలో కలిసిపోతుంది. అలాంటి శరీరాన్ని, మనసును రోగాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మన లక్ష్యాలు, ఆశయాలు సాధించగలుగుతాం. శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఏకైక సాధనం యోగా.
యోగా
యోగ అంటే వ్యాయామ, ఆధ్యాత్మికతల సమాహారం. ఇది హిందూత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం. అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి వంటి సాధనలకు పునాది. ధ్యానం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. హఠయోగం శరీరారోగ్యానికి తోడ్పడుతుంది. నిజానికి యోగమంటే ఇంద్రియాలను వశపరచుకొని ఏకాగ్రత సాధించడమే. నిత్యం యోగా సాధన చేస్తుంటే శారీరక, మానసిక సమస్యలు దరిచేరవు. ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యదాయిని యోగా.
యోగాసనాలు
ఆసనం అనేది ఒక భంగిమ. మన శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో కొన్ని భంగిమలను ‘యోగాసనాలు’గా గుర్తించారు. మనం అనుభవించే వివిధ మానసిక, భావోద్వేగ స్థితులకు శరీరం సహజంగానే ఒక భంగిమను తీసుకుంటుంది. ఆనందంగా ఉంటే ఒక విధంగా, కోపంగా ఉన్నప్పుడు మరోలా ఉంటాం. యోగాసనాల ద్వారా శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకు వెళ్లడం ద్వారా శరీరంలో చైతన్యం పెరుగుతుంది. యోగ సాధనలో ప్రావీణ్యత సంపాదిస్తే ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు.
యోగాతో లాభాలు
యోగా, ప్రాణాయామం ద్వారా లాభాలే ఎక్కువ. సందర్భం, అవసరాన్ని బట్టి కొన్ని పరిమితులు తప్పితే నష్టాలనేవి ఉండవు. నిత్యం యోగా చేయడం వల్ల శరీరం కాంతివంతమౌతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బద్ధకం తగ్గుతుంది. రక్తం శుభ్రపడుతుంది. రక్త సరఫరా సక్రమంగా జరిగి, ఆక్సిజన్‌ బాగా అందుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై శరీరం చురుకుగా తయారవు తుంది. కుండలినీ శక్తి మేలుకుంటుంది. రజోగుణం, తమోగుణం నశిస్తాయి. ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి.
జీర్ణశక్తి పెరగడానికి..
జీవక్రియలను క్రమబద్ధం చేయడానికి యోగా తోడ్పడుతుంది. బాలాసనం లేదా అధోముఖ శ్వానాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం, సుప్త వజ్రాసనం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట తగ్గేందుకు, జీర్ణశక్తి పెరిగేందుకు పశ్చిమోత్తానాసనం వేశాక పూర్వోత్తానాసనం వేయాలి. కొన్ని ఆసనాలను రెండు పక్కల (ఎడమ-కుడి, ముందుకు-వెనక్కు) చేయాలి. వీటిని కౌంటర్‌ ఆసనాలు అంటారు.
స్థూలకాయం తగ్గడానికి..
స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవు తాయి. బీపీ, మధుమేహం వంటి రోగాలు చుట్టు ముడతాయి. అందుకే ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు యోగా ఒక్కటే సరైన మార్గం. శరీర బరువును తగ్గించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. అబ్డామినల్‌ ఎక్సర్‌సైజ్‌లకి కూడా ఇది బాగా వర్తిస్తుంది. కొవ్వును కరిగించి, పొట్టను తగ్గించే ఆసనాల్లో త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం ప్రధానమైనవి. డైట్‌ ప్లాన్‌తో పాటు నిత్య యోగ సాధన చేస్తే తప్పనిసరిగా సన్నగా, నాజూగ్గా, ఆకర్షణీయంగా తయావరవచ్చు.
వివిధ ఆరోగ్య సమస్యలకు..
వైట్‌కాలర్‌, ఐటి ఉద్యోగులు, ప్రధానంగా కూర్చుని పనిచేసే వారు, కంప్యూటర్‌, లాప్‌టాప్‌లతో కుస్తీపట్టేవారికి కూర్చోవడం, నిలబడడంలో సమస్యలు లేక సయాటికా వంటి నొప్పులు వస్తాయి. వీటికి భుజంగాసనం చక్కగా పనిచేస్తుంది. విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నించాలి. భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపి వేయాలి. రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం చక్కని ఔషధం. అండాశయం, మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది. గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొంద వచ్చు. పెద్దప్రేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.
ఒత్తిడి నివారణకు..
ఆహారపు అలవాట్లు, అధిక శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల అనేక రుగ్మతలు ఎదురవు తాయి. ఒంట్లో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. యోగ సాధన ద్వారా మానసిక ఒత్తిడిపై ఒకేసారి కాకుండా క్రమంగా పైచేయి సాధిస్తాం. వజ్రాసనం, శుప్త వజ్రాసనం, పరిపూర్ణ వజ్రాసనం వంటివి ఇందుకు బాగా పనిచేస్తాయి. విద్యార్థులకూ ప్రశాంతత, ఏకాగ్రత కోసం యోగా సరైన సాధనం. పరీక్షలనగానే విద్యార్థులు ఆందోళన పడుతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది పిల్లలు చదివింది కూడా మర్చిపోతుంటారు. వీరికి యోగా చక్కని పరిష్కారం చూపిస్తుంది.
జ్ఞాపకశక్తిని కాపాడేందుకు..
ప్రస్తుత ఉరుకులూ పరుగుల యుగంలో కాలాన్ని అధిగమించి పరుగులు పెట్టాలన్న ఆలోచన పలు అనర్థాలకు కారణమవుతోంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మతిమరుపు. దీనికి మంచి ఔషధం యోగసాధన. ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది. వృద్ధాప్యంలో కలిగే మతిమరుపుకు కూడా యోగా ఓక సాధనం. సేతుబంధాసనం మెదడుకు కావాల్సిన విశ్రాంతినిస్తుంది. హలాసనం శరీరాన్ని, మెదడును శాంతపరుస్తుంది. యోగాభ్యాసం చేసే టప్పుడు శరీరాన్ని వివిధ భంగిమల్లోకి తీసుకెళ్తూనే, శ్వాసను పీల్చుకోవటం, వదలటం చేస్తాం. మానసిక ఏకాగ్రతను కూడా సాధిస్తాం.
ఆయువు పెరిగేందుకు..
దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు ఉన్న వాళ్లు యోగా చేస్తే నిరాశా నిస్పృహలనుంచి బయటపడ వచ్చు. వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు. జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. అనేక అధ్యయనాలు, సర్వేల ప్రకారం యోగా క్రమం తప్పకుండా చేయడం వల్ల క్యాన్సర్‌, మనోవైకల్యం, ఉబ్బసం, గుండె సంబంధించిన సమస్యలు దరిచేరకుండా దూరంగా ఉంచుతుంది. మనసూ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలను కూడా నియంత్రణలోకి తేవచ్చు. కాయకల్ప అనే యోగ ప్రక్రియ జీవన శక్తిని మెరుగు పరుస్తుంది. దీని ప్రాథమిక లక్ష్యం శరీర విధానాన్ని ఒక గాడిలో పెట్టడం. వృద్ధాప్య వేగం తగ్గించడమే.
సౌందర్యానికి యోగా..
అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ మరింత అందంగా ఉండాలంటూ తహతహ లాడుతుంటారు. అంతేకాదు కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా గురువులు. యోగా చేయడం వలన అమ్మాయిలు అందంగా కూడా ఉంటారంటు న్నారు. యోగాతో ముఖం, శరీరంలో కాంతి వస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగా కూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడి ఉంటుంది. శరీర సౌందర్యానికి ప్రాణాయామంతో పాటు తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
yogaకోపం అదుపులో ఉంచేందుకు
కొందరు తరచూ కోపం తెచ్చుకుంటారు. చిన్న చిన్న కారణాలకే ఆగ్రహంతో ఊగిపోతుంటారు. అలాంటివారికోసం యోగా మంచి సాధనం. కోపాన్ని అదుపు చేసుకోవాలంటే యోగాలో అగ్ని ముద్రను ప్రయత్నించండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రమే ఈ ముద్రను చెయ్యాలి.
సూర్య నమస్కారాలతో అనారోగ్యానికి చెక్‌
ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పలు యోగాసనాల కలయిక. సూర్యనమస్కారాలను ఏ వయస్సు వారైనా చేయ వచ్చు. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. వీటికి 12 మంత్రాలు కూడా ఉన్నాయి. మంత్రోచ్ఛారణతో సూర్యనమస్కారాలు చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది.
మిత్ర, రవ, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కర అనేవి ఈ 12 మంత్రాలు. మంత్రానికి ముందు ‘ఓం’ అని, చివర ‘య నమః’ అని చేర్చి మంత్రం ఉచ్ఛరించాలి.
పతంజలి అష్టాంగ యోగ సూత్రాలు :
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. అందుకే వీటిని పతంజలి యోగసూత్రాలు అంటారు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగ లోని అన్ని పద్ధతుల్ని పతంజలి ఒకచోట చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఇప్పుడు వీటిని అనుసరిస్తున్నారు.
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనం. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనేవి ఆ నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడాన్ని వివరిస్తుంది. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్ని సాధన చేయడం ఎలాగో వివరిస్తుంది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలాగో రాజయోగంలో వివరించారు. విభూతి యోగం జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో చెబుతుంది. మోక్షం ఎలా పొందాలో కైవల్యపద విశదీకరిస్తుంది. జీవికి మోక్షప్రాప్తిని కలిగించడమే యోగశాస్త్రం ప్రధాన ఉద్దేశ్యం.
1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యానము, 8. సమాధి అనేవి పతంజలి యోగసూత్రా లలోని అష్టాంగాలు.
యోగా – పరిమితులు
యోగా చేయడానికి ఒక విధానం ఉంది. ముఖ్యంగా యోగా పరకడుపున చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు. నేరుగా నేలపై కాక, దుప్పటి లేక చాప పరచుకొని దానిపై యోగసాధన చేయాలి. యోగ సాధన సమయంలో సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులు ధరించాలి, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయవచ్చు. ఆ ప్రదేశంలో మంచి గాలి, వెలుతురు ప్రసరించాలి. ఆనారోగ్య సమయాల్లోనూ, మహిళలు గర్భిణిలుగా ఉన్నప్పుడు యోగ చేయరాదు. ప్రారంభంలో ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నించకూడదు. క్రమంగా సమయం పెంచుకోవాలి. ఉచ్వాస నిశ్వాసలు సాధారణంగానే ఉండాలి. యోగాను మొదట గురువు వద్ద అభ్యసించాలి. తరువాత స్వంతంగా సాధన చేయవచ్చు. యోగసాధన ముగిశాక 20-30 నిమిషాల తర్వాత స్నానం చేయడం, ఆహారం తీసుకోవడం చేయవచ్చు.
జూన్‌ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఇప్పటివరకు యోగ గురించి తెలియని వారు ఆ రోజు నుండి అయినా యోగసాధన ప్రారంభిద్దాం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగాను, అందంగాను ఉంచుకుందాం.
– సప్తగిరి గోపగోని, 9885086126

జాగృతి వారపత్రికలో ప్రచురితం  : http://www.jagritiweekly.com/slider-news/%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97yoga/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 8:50 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

18, మే 2016, బుధవారం

యుపిఎకు అగస్టా గండం

                                 -    సోనియా మెడకు వేలాడుతున్న హెలికాప్టర్లు

(సప్తగిరి గోపగోని)


అగస్టా ఒప్పందం :

ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనేది హెలికాప్టర్ల తయారీ సంస్థ. వివిధ దేశాలకు అవసరమైన హెలికాప్టర్లను, వాళ్ల డిజైనింగ్‌కు అనుగుణంగా తయారుచేసి ఇవ్వడంలో పేరున్న ఈ సంస్థతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ సర్కారు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో  ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి అవసరమైన 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు రూ.3,600 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా రూ.360 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందం కోసం యూపీఏ ప్రభుత్వం నిబంధనలను కూడా సడలించింది. వాస్తవానికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో రక్షణశాఖ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. అప్పటి యూపీఏ పెద్దల హస్తంతోనే ఈ ఒప్పందం, ముడుపుల వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. తాజాగా దేశాన్ని, పార్లమెంటును కుదిపేస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కాంగ్రెస్‌ నేతలను వదిలేలా కనిపించడం లేదు.

బయటపడిన గుట్టు – ఇటలీకోర్టు తీర్పు :

    అగస్టా వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైకేల్‌ 2008లో ఆ కంపెనీ భారత విభాగం చీఫ్‌ పీటర్‌ హ్యూలెట్‌కు రాసిన లేఖ ఇటీవలే వెలుగు చూడటంతో అగస్టా తేనెతుట్టె కదిలింది. ఈ లేఖను విచారణాధికారులు ఇటీవలే ఇటలీ కోర్టుకు సమర్పించారు. డీల్‌ కుదరాలంటే సోనియాను ప్రసన్నం చేసుకోవాల్సిందేనంటూ మధ్యవర్తి ఆ లేఖలో సూచించడం పెద్ద దుమారాన్ని లేపింది.  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సహా అహ్మద్‌ పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు సోనియాకు అత్యంత దగ్గరివారుగా ఆలేఖలో మైకేల్‌ పేర్కొన్నాడు. ఈ స్కాంకు సంబంధించి స్వట్జర్లాండ్‌కు చెందిన మరో దళారి గిడోరాల్ఫ్‌ హష్కే వద్ద దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లో మైకేల్‌ రాసిన లేఖ కూడా ఉండటం అందరినీ నివ్వెర పరిచింది. ఈ రహస్యఫైళ్లు గత నెలలోనే వెలుగులోకి వచ్చాయి. ఇటలీలోని కోర్టు అగస్టా ఛాపర్ కేసు లావాదేవీలపై విచారణ జరిపి భారత్‌లోని రాజకీయ నాయకులకు ఈ సంస్థ ముడుపులు సమర్పించిందని తీర్పు చెప్పింది. ఇటలీలోని మిలన్‌ కోర్టు 250 పేజీలతో ఈ తీర్పు వెలువరించింది. ముడుపులు సమర్పించిన ఇటలీ సంస్థకు ఐదువేల డాలర్ల జరిమానా విధించింది. ఇటలీ కోర్టు తీర్పు 193వ పేజీలో సోనియాగాంధీ పేరు, 163-164 పేజీల్లో మన్మోహన్ సింగ్ పేరు ఉంది. 165వ పుటలో ఎస్.పి. త్యాగి సోదరుల పేర్లు ఉదహరించబడ్డాయి. ఇటలీ ప్రధాని మారియో మోంటే, రాయబారి టెర్రా షియానో పేర్లు కూడా జడ్జిమెంట్ కాపీలో ఉన్నాయి.

డ్రాఫ్ట్‌ బడ్జెట్‌..?

    అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు మధ్యవర్తులు భారత్‌లో అనేక మందికి భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బయటపడ్డ పత్రాల ఆధారంగా ప్రభుత్వంలోని పెద్దలు, రాజకీయ నేతలు, రక్షణ శాఖ అధికారులకు సుమారు రూ.430 కోట్ల మేర డబ్బులు చేతులు మారినట్లు బయటపడింది. ఎవరెవరికి ఎంతెంత చెల్లించారన్న వివరాలతో మధ్యవర్తి మైకేల్‌ రూపొందించిన కీలక పత్రం కూడా దర్యాప్తు అధికారులకు చిక్కింది. అయితే.. దానిపై డ్రాఫ్ట్‌ బడ్జెట్‌ అని రాసి ఉంది. ఇందులో సంక్షిప్త నామాలతో ముడుపుల వివరాలను పేర్కొన్నారు. పివోల్‌ అంటే పొలిటిషియన్స్‌ అనే శీర్షిక కింద ఏపీ అన్న అక్షరాలున్న వ్యక్తికి రూ.25కోట్లు ముట్టినట్లు రాశారు. ఎఫ్‌ఏఎం అంటే ఫ్యామిలీ అనే శీర్షిక కింద రూ.126 కోట్లు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. సోనియా పేరును సంక్షిప్త నామంలో సిగ్మోరా గాంధీగా పేర్కొన్నారు.

ఇక.. 2011-12మధ్య మైకేల్‌ భారత్‌కు 31సార్లు వచ్చి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఒప్పందం కుదరడానికి ముందుకూడా నేతలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో 1993 నుంచి క్రిస్టియన్ మైఖేల్ దాదాపు వందసార్లు ఇండియాకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో డీల్ కుదుర్చుకున్నట్లు కూడా గుర్తించారు.

శరవేగంగా దర్యాప్తు :

    అగస్టాపై దుమారం చెలరేగుతుండటంతో సీబీఐ ఈ వ్యవహారంపై శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన లక్షా అరవై అయిదువేల డాక్యుమెంట్ల ఆధారంగా సిబిఐ ఛార్జ్‌షీటు తయారు చేస్తున్నది. అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగి, అతని సోదరులతో పాటు.. పలువురిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న క్రిస్టియన్‌ మైకేల్‌ను అప్పగించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను కూడా సీబీఐ కోరింది.

హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ - ఈడీ కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణ బహదూర్‌ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది.   లావాదేవీలను   విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్‌నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి.

మరోవైపు.. అగస్టా కుంభకోణంలో తాను ముడుపులు స్వీకరించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి వరుసకు సోదరుడైన సంజీవ్‌ త్యాగి అంగీకరించినట్లు సిబిఐ వెల్లడించింది. అగస్టా హెలికాప్టర్ల డీల్‌లో మధ్యవర్తులైన గిడో హాష్కె, కార్లో గెరోసాలనుంచి తాను డబ్బు స్వీకరించినట్లు సంజీవ్‌ త్యాగి చెప్పినట్లు సిబిఐ  పేర్కొంది. త్యాగి సోదరులు ఎస్పీ త్యాగితో తమకు ఆస్తుల విషయంలో సంబంధాలున్నాయని చెప్పారు. మధ్యవర్తులైన హాష్కె, గెరోసాలతో తాను ఆర్థిక లావాదేవీలను నిర్వహించానని సంజీవ్‌ త్యాగి చెప్పారని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి.

పెయిడ్‌ జర్నలిస్టు..?

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఒక హిందీ చానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది.   సదరు జర్నలిస్టు అగస్టా వెస్ట్ ల్యాండ్ ఖర్చుతో తన భార్యతో కలిసి ఇటలీలో పర్యటించినట్లు ఈడీ కనుగొంది. ఈ జర్నలిస్టు, అతని కుటుంబంపై అగస్టా వెస్ట్ ల్యాండ్ 28 లక్షలు ఖర్చుచేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ సీనియర్ జర్నలిస్టుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ తో ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణానికి సంబంధించి సదరు సీనియర్ జర్నలిస్టును ఈడీ గత ఏడాది   కూడా ప్రశ్నించింది. ఇలా ఉండగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్ లో అగస్టావెస్ట ల్యాండ్ కుంభకోణంలో తొలి పెయిడ్ జర్నలిస్టును విచారించాలనడం కూడా చర్చకు దారితీసింది.

పార్లమెంటులో దుమారం !

         అగస్టా వెస్ట్‌ల్యాండ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. లోక్‌సభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది.  కావాలనే కాంగ్రెస్ పార్టీ అగస్టాతో ఒప్పందం కుదుర్చుకుందని రక్షణ మంత్రి పారికర్ లోకసభలో ఆరోపించారు. వీవీఐపీ చాపర్ల కొనుగోలు కోసం నిబంధనలు సైతం మార్చివేసిందన్నారు. ఒప్పందంలో కుదుర్చుకున్న బెంచ్‌ మార్క్‌ కంటే- కంపెనీ కోసం ధరను ఆరు రెట్లు పెంచడం జరిగిందన్నారు. 12 హెలికాప్టర్ల కోసం కాంగ్రెస్ ఆర్డర్ చేసిందని, ముడుపుల వ్యవహారం బయటపడడంతో ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు.. ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు (గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు.

అయితే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అగస్టా వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి పారికర్ ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. 

బోఫోర్స్‌లా సాగదు..!

బోఫోర్స్ స్కాం విషయంలో మాదిరి కాకుండా అగస్టా వివాదంలో పకడ్బందీగా ముందుకెళ్తామని రక్షణమంత్రి పరీకర్ లోక్‌సభలో తెలిపారు. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు బయటపడ్డ ఎస్పీ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌ల పాత్ర తక్కువేనన్నారు. యూపీఏ హయాంలో, వారి సహకారంతోనే అగస్టాకు హెలికాప్టర్ డీల్ దక్కిందనేది వాస్తవం. త్యాగి, గౌతమ్ కేవలం గంగానది (అవినీతి) లో చేతులు మాత్రమే కడుక్కున్నారు. అసలు గంగ ఎక్కడికెళ్లిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది’ అని అన్నారు. ఈ కుంభకోణంలో త్యాగి పాత్ర చాలా చిన్నదన్నారు. ఈ కేసులో ఏపీ, సిగ్నోరా పదాలకు అర్థమేంటో ప్రపంచమంతటికీ తెలుసని ఆ పేర్లను ప్రస్తావించి తన పేరు పాడుచేసుకోదలచుకోలేదన్నారు.

మరోవైపు.. అగస్టా కేసులో ఇటలీ కోర్టు తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌పై ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో దూకుడు, కేంద్రం పట్టుదల చూస్తూంటే అగస్టా వ్యవహారం త్వరలోనే తేలే పరిస్థితి కనబడుతోంది.

సప్తగిరి గోపగోని

98850 86126.


వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 10:58 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

Stat counter

View My Stats

మొత్తం పేజీ వీక్షణలు

బ్లాగు ఆర్కైవ్

  • ►  2022 (1)
    • ►  సెప్టెంబర్ (1)
  • ►  2020 (1)
    • ►  జనవరి (1)
  • ►  2019 (78)
    • ►  డిసెంబర్ (10)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (11)
    • ►  జులై (4)
    • ►  జూన్ (44)
    • ►  ఏప్రిల్ (6)
  • ►  2018 (47)
    • ►  నవంబర్ (18)
    • ►  జూన్ (2)
    • ►  మే (12)
    • ►  ఏప్రిల్ (7)
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (4)
  • ►  2017 (11)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (7)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ▼  2016 (17)
    • ▼  ఆగస్టు (4)
      • చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష బెనర్జీ డాక్యుమెంటర...
      • అనాథాశ్రమం పేరిట చిన్నారులతో భిక్షాటన
      • గ్యాంగ్‌స్టర్‌ నయీం డాక్యుమెంటరీ (రెడ్‌ అలర్ట్‌)
      • జాగృతి వారపత్రిక కృష్ణా పుష్కర సంచిక లో ప్రచురితమై...
    • ►  జులై (1)
      • విశ్వమంతా ఒక్కటైన వేళ...
    • ►  జూన్ (1)
      • ఆరోగ్యానికి యోగ
    • ►  మే (3)
      • యుపిఎకు అగస్టా గండం
    • ►  మార్చి (2)
    • ►  ఫిబ్రవరి (5)
    • ►  జనవరి (1)
  • ►  2015 (17)
    • ►  డిసెంబర్ (3)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (3)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  ఫిబ్రవరి (2)
  • ►  2014 (35)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (1)
    • ►  సెప్టెంబర్ (4)
    • ►  ఆగస్టు (10)
    • ►  జులై (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (1)
  • ►  2013 (17)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (2)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (9)
  • ►  2012 (9)
    • ►  మార్చి (1)
    • ►  జనవరి (8)
  • ►  2011 (4)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (2)

నా గురించి

Sapthagiri
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

FLAG Counter

Flag Counter

ప్రముఖ పోస్ట్‌లు

  • ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!
            ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చ...
  • ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)
    ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం                         - గోపగోని సప్తగిరి, 98850 86126.     భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే...
  • Journalism & Media Glossary
    Journalism, like any profession, has its own language and specialist words which practitioners need to know. The following gl...
  • ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?
        తెలంగాణ   ముఖ్యమంత్రి   కె .  చంద్రశేఖర్ ‌ రావు   మానసపుత్రికగా   చెప్పుకుంటున్న డబుల్ ‌   బెడ్ ‌ రూమ్ ‌   ప్లాట్స్ ‌   పథకం  ...
  • రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం
        సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్ల...
  • రూపాయి - పాపాయి
    ఇదీ వాస్తవం ! చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్ ఇదే యూపీఏ తాజా నినాదమట కానీ చేతులు ఇప్పటికే బొబ...
  • (శీర్షిక లేని)
    పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌ కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశా...
  • అమ్మ..!!?
    అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్...
  • శ్రీ జయనామ సంవత్సర పంచాంగం, రాశి ఫలాలు (2014-15)
    పంచాంగ పీఠిక కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియు...
  • సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
              506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్న...
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.