అడుగుజాడ

పేజీలు

  • హోమ్
  • సొంత కవిత్వం
  • రైలుమిత్ర
  • వెబ్‌సైట్‌

3, ఏప్రిల్ 2018, మంగళవారం

మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?


మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?


మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?

- పవార్‌ అవరోధం.. కారత్‌ విశ్లేషణం..
తెలంగాణ సిఎం కెసిఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు మూడు వారాలుగా నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు అవసరమైన వ్యూహాలు, నెలకొన్న సమస్యలు, వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితుల గురించి ముమ్మరంగా హోమ్‌వర్క్‌ చేశారు. ఈ క్రమంలోనే కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కెసిఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటన చేశాక వేసిన తొలి అడుగు ఇదే. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటులో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇద్దరూ కలిసి సమష్టిగా మీడియాతో మాట్లాడారు.
కోల్‌కతా వేదికగా తొలి కూటమి పురుడు పోసుకోవడం ఆనందంగా ఉందని కెసిఆర్‌ చెప్పారు. మమతతో భేటీకి చాలా ప్రాధాన్యముందని, చర్చలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగాయని, కొన్ని అంశాలపై అంగీకారం కూడా కుదిరిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కూటమి ఒకటి, రెండు పార్టీలకు మాత్రమే పరిమితం కాదన్న కెసిఆర్‌ ఇది ప్రజాకూటమిగా ఉంటుందన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఇది మంచి ఆరంభం. దేశం మార్పు కోరుకుంటోంది. దేశాభివృద్ధి లక్ష్యంగా బలమైన సమాఖ్య కూటమిపై కెసిఆర్‌తో చర్చించాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలోపేతమవుతుంది. మాకు బలమైన దార్శనికత ఉంది. ఈ కూటమికి నాయకత్వం సమస్య రానేరాదు. భావసారూప్యమున్న అన్ని పార్టీలను కలుపుకొని పోతాం’ అని చెప్పారు.
థర్డ్‌ ఫ్రంట్‌ను నడిపించేది తానేనని కెసిఆర్‌ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తాము ఏ పార్టీ దగ్గరికి వెళ్లబోమని కెసిఆరే ఓ ఫ్రంట్‌ అని ఆయన కుమారుడు తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కూడా ఓ సందర్భంలో చెప్పారు. కానీ దానికి భిన్నంగా కెసిఆరే మొదటగా కోల్‌కతా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఫ్రంట్లో ఎవరికి అవకాశం ఇచ్చినా ఫ్రంట్‌ నాయకుడిగా మాత్రం కెసిఆరే ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. పలు సందర్భాల్లో కెసిఆర్‌ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు కూడా. ఫ్రంట్‌ ప్రయత్నం సక్సెస్‌ అయితే ప్రధాని పీఠంపై కూర్చుంటానని, లేదంటే తెలంగాణకే పరిమితమవుతానని అంతర్గత సమావేశాల్లో కెసిఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సన్నిహితులు చెబుతు న్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకంగా ఎవరు ముందుకొస్తారా అని ఎదురుచూస్తున్న మమతా బెనర్జీ యాక్టివ్‌ కాకముందే తానే వెళ్లి ఆమెను కలిస్తే నాయకత్వం విషయంలో తర్వాత పేచీ ఉండబోదన్నది కెసిఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే ఇలాంటి కలల్లో ఉన్న కెసిఆర్‌కు కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ విశ్లేషకుడు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ షాకిచ్చారు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో ఎన్‌డి టివితో మాట్లాడిన జెఠ్మలానీ కెసిఆర్‌ నెలకొల్పబోయే ఫెడరల్‌ ఫ్రంట్‌కు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతం కాగలదని స్పష్టం చేశారు. దేశంలో థర్డ్‌ ఫ్రంట్‌ నడపగలిగే శక్తి, సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే రాం జెఠ్మలాని కెసిఆర్‌ గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
మరోవైపు కెసిఆర్‌ ఫ్రంట్‌కు ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ అవరోధంగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన.
2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్‌సిపి కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో శరద్‌పవార్‌కున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పరస్పర అవగాహనలో భాగంగానే బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నిటినీ తన చిరకాల మిత్రుడు కాంగ్రెస్‌ వెనక మోహరింపజేసే కృషిని శరద్‌ పవార్‌ తన భుజాలపై వేసుకుని యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి తెలిసిన మమతా బెనర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కోల్‌కతాలో తన భేటీని ఫలవంతం అని మాత్రమే పేర్కొన్నారని విశ్లేషకులు అంటున్నారు. బిజెపియేతర కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచే ప్రతిపాదనపై తొందర వద్దని, భావసారూప్య పార్టీలన్నిటితో చర్చలు జరగనివ్వాలని కెసిఆర్‌కు మమతా సూచించారని సమాచారం.
ఇదే సమయంలో సిపిఎం సీనియర్‌ నేత ప్రకాష్‌ కారత్‌ వ్యాఖ్యలు కూడా థర్డ్‌ఫ్రంట్‌ అంశంపై కీలకంగా నిలుస్తున్నాయి. కెసిఆర్‌ మూడో కూటమి నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించబోవని ప్రకాశ్‌ కారత్‌ అభిప్రాయపడ్డారు. ‘ఒక్క కెసిఆరే కాదు ఆ ప్రయత్నం ఎవరు చేసినా అంతే. బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి నిర్మించడం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలు వేరు. విధి విధానాల్లో, ప్రాంతీయ ప్రయోజనాల్లో ఎన్నో వైరుధ్యాలుంటాయి. ఇవన్నీ వాటి వాటి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక గొడుగు కిందకి రావడం అసాధ్యం. ఒకవేళ కూడగట్టినా అవి నిలబడవు. డిఎంకె, ఆర్‌జెడి లాంటి పక్షాలు ఎప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉంటాయి. బిజెపిని ఓడించాలంటే ఒక్కటే మార్గం. రాష్ట్రాల వారీగా బిజెపి-వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో జరిగింది ఇదే’ అని ప్రకాశ్‌ కారత్‌ పేర్కొన్నారు. గతంలో యుపిఏ తరహాలో ఓ కూటమి ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని అయితే కాంగ్రెస్‌ పట్ల విశ్వసనీయత లేనందున దాని సారథ్యానికి మిగిలిన పార్టీలు సమ్మతించవని, అందుచేత కాంగ్రెస్‌ నేతృత్వ ఫ్రంట్‌ కూడా విఫలమవుతుందని కారత్‌ తేల్చేశారు.
– సప్తగిరి, 9885086126

link :   (02-08 April 2018)
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AE%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%81/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 8:40 PM
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లను పోస్ట్ చేయి (Atom)

Stat counter

View My Stats

మొత్తం పేజీ వీక్షణలు

బ్లాగు ఆర్కైవ్

  • ►  2022 (1)
    • ►  సెప్టెంబర్ (1)
  • ►  2020 (1)
    • ►  జనవరి (1)
  • ►  2019 (78)
    • ►  డిసెంబర్ (10)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (11)
    • ►  జులై (4)
    • ►  జూన్ (44)
    • ►  ఏప్రిల్ (6)
  • ▼  2018 (47)
    • ►  నవంబర్ (18)
    • ►  జూన్ (2)
    • ►  మే (12)
    • ▼  ఏప్రిల్ (7)
      • తెలంగాణలో కొత్త పార్టీ (16-22 April 2018)
      • బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ (23rd April)
      • మూడో ఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ? (2nd April)
      • తెలంగాణలో మరో కొత్త పార్టీ
      • గుట్టువిప్పిన కాగ్‌
      • స్పీకర్‌ సంచలన నిర్ణయం
      • మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (4)
  • ►  2017 (11)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (7)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2016 (17)
    • ►  ఆగస్టు (4)
    • ►  జులై (1)
    • ►  జూన్ (1)
    • ►  మే (3)
    • ►  మార్చి (2)
    • ►  ఫిబ్రవరి (5)
    • ►  జనవరి (1)
  • ►  2015 (17)
    • ►  డిసెంబర్ (3)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (3)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  ఫిబ్రవరి (2)
  • ►  2014 (35)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (1)
    • ►  సెప్టెంబర్ (4)
    • ►  ఆగస్టు (10)
    • ►  జులై (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (1)
  • ►  2013 (17)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (2)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (9)
  • ►  2012 (9)
    • ►  మార్చి (1)
    • ►  జనవరి (8)
  • ►  2011 (4)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (2)

నా గురించి

Sapthagiri
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

FLAG Counter

Flag Counter

ప్రముఖ పోస్ట్‌లు

  • ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!
            ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చ...
  • ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)
    ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం                         - గోపగోని సప్తగిరి, 98850 86126.     భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే...
  • Journalism & Media Glossary
    Journalism, like any profession, has its own language and specialist words which practitioners need to know. The following gl...
  • ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?
        తెలంగాణ   ముఖ్యమంత్రి   కె .  చంద్రశేఖర్ ‌ రావు   మానసపుత్రికగా   చెప్పుకుంటున్న డబుల్ ‌   బెడ్ ‌ రూమ్ ‌   ప్లాట్స్ ‌   పథకం  ...
  • రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం
        సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్ల...
  • రూపాయి - పాపాయి
    ఇదీ వాస్తవం ! చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్ ఇదే యూపీఏ తాజా నినాదమట కానీ చేతులు ఇప్పటికే బొబ...
  • (శీర్షిక లేని)
    పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌ కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశా...
  • అమ్మ..!!?
    అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్...
  • శ్రీ జయనామ సంవత్సర పంచాంగం, రాశి ఫలాలు (2014-15)
    పంచాంగ పీఠిక కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియు...
  • సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
              506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్న...
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.