అడుగుజాడ

పేజీలు

  • హోమ్
  • సొంత కవిత్వం
  • రైలుమిత్ర
  • వెబ్‌సైట్‌

14, ఏప్రిల్ 2018, శనివారం

గుట్టువిప్పిన కాగ్‌

గుట్టువిప్పిన కాగ్‌

గుట్టువిప్పిన కాగ్‌
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాగ్‌ పేర్కొంది. రెవెన్యూలోటు ఉంటే మిగులు చూపారని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని దాటారని ఎత్తిచూపింది. రాష్ట్ర పురోభివృద్ధిలో ఆర్థిక నిర్వహణ అత్యంత కీలకం. ఈ అంశంలో ఉదాసీనత, నిబంధనలు ఉల్లంఘించడం, జవాబు దారీగా వ్యవహరించక పోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా అవినీతికి, నిధుల దుర్వినియోగానికి దారి తీస్తుందని కాగ్‌ హెచ్చ రించింది. రాష్ట్రంలో రూ.5392 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా రూ.1386 కోట్ల రెవెన్యూ మిగులును చూపారంది. అప్పు తెచ్చుకున్న నిధులను రెవెన్యూ రాబడులుగా జమచేసి ద్రవ్యలోటును రూ.2500 కోట్లు తక్కువ చేశారంది. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి 3.5 శాతమైతే, వాస్తవంగా 4.3 శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఖర్చును పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో బలహీనతలు స్పష్టంగా ఉన్నాయని కాగ్‌ తెలిపింది.
తెలంగాణ ధనిక రాష్ట్రమని ఊదరగొడుతున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాగ్‌ నివేదిక చెంపపెట్టు లాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని తాము చెప్పిన మాటలను అపహాస్యం చేశారని తమ ఆరోపణలన్నీ కాగ్‌ నివేదికతో బహిర్గతమయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ మిగులు ఉన్న రాష్ట్ర మంటూ ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.
ఏజి రాజీనామా
అజీబ్ సింగ్ (ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్)
గతవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో నెలకొన్న ప్రకంపనలు మరుసటి వారం కూడా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా ప్రభుత్వ పరంగా, రాజ కీయంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ప్రభుత్వానికి, ఏజికి మధ్య సమన్వయం కొరవడిందన్న సంకేతాలు వెలువడ్డాయి. తన మాటకు ప్రభుత్వం పెద్దగా విలువ ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న చర్చ న్యాయవర్గాల్లో సాగుతోంది.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజున సభలో కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ శాసన సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేశారు. ఈ ఘటన మార్చి 12న జరగగా వారి సభ్యత్వాల రద్దుకు సంబంధించిన బులెటిన్‌ను అసెంబ్లీ 13వ తేదీన విడుదల చేసింది. అయితే ఆ రెండు సీట్లు ఖాళీ అయినట్లు ఇచ్చిన నోటిఫికేషన్‌ గవర్నర్‌ ఆమోద ముద్రతో జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాని సభ్యత్వ రద్దు నుంచి నోటిఫికేషన్‌ వరకూ సచివాల యమే నిర్ణయం తీసుకుంది. ఇందులోని లోపాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో ఆరు వారాల వరకూ షెడ్యూలు విడుదల చేయవద్దని ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి సంబంధించిన సిసి ఫుటేజీని మార్చి 27వ తేదీలోగా తమకు సీల్డ్‌ కవర్లో అందజేయాలని అదేరోజు అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆయన అంగీక రించారు. అయితే తమ అనుమతి తీసుకోకుండానే సిసి ఫుటేజీలు కోర్టుకు ఇస్తామని ఏజి హామీ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు తెలియకుండానే ఈ కేసును వాదించే బాధ్యతలు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వేకు ప్రభుత్వం అప్పగిం చిందన్న నిర్ణయం ఏజిని మనస్తాపానికి గురిచేసిందం టున్నారు.
కొత్త పంచాయతీరాజ్‌ బిల్లు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పంచాయతీరాజ్‌ కొత్త బిల్లు, మున్సిపల్‌ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో కాలం చెల్లిన పాత చట్టం స్థానంలో కొత్త అంశాలు వచ్చి చేరాయి. సభ ఆమోదించటానికి ముందు పంచాయతీరాజ్‌ బిల్లులోని కొన్ని అంశాలపై బిజెపి, తెలుగుదేశం, సిపిఎం సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేయగా వాటికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమాధానమిచ్చారు. బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని బిజెపి, తెలుగు దేశం, సిపిఎంలు కోరాయి. ఈ బిల్లు ఆదరా బాదరాగా తెచ్చిందేమీ కాదని, రెండేళ్లుగా వందల సంఖ్యలో సమావేశాలను నిర్వహించి అనేక మంది నిపుణుల నుంచి అభిప్రాయాలను తెలుసుకొన్న తర్వాతే వివిధ అంశాలను పొందుపర్చామని సిఎం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల సమగ్రచట్టం కూడా తీసుకొస్తామని ప్రకటించారు.
ఈ భేటీ వెనక మర్మమేంటి ?
కేంద్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ను సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు పలు దఫాలుగా ప్రకాష్‌రాజ్‌ కెసిఆర్‌తో చర్చించారు. గతంలోనే సిఎంను కలిసేందుకు ప్రకాష్‌రాజ్‌ సమయం కోరగా మార్చి 29వ తేదీన ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా సిఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంతో ప్రకాష్‌రాజ్‌ వెళ్లారు. మొదట రెండు గంటలపాటు ప్రకాష్‌రాజ్‌తో భేటీ అయిన కెసిఆర్‌ అసెంబ్లీకి తనతో పాటు ఆయనను కూడా తీసుకెళ్లారు. తిరిగి అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లే సమయంలోనూ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో రెండు గంటల పాటు ప్రకాష్‌రాజ్‌తో చర్చలు జరిపారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చను లేవనెత్తింది. దేశంలో కొత్త జాతీయ కూటమి ఏర్పాటుకు సిఎం కెసిఆర్‌ తీసుకున్న చొరవను ప్రకాశ్‌రాజ్‌ ప్రశంసించినట్లు తెలిసింది.
– సప్తగిరి
( jagrithi 09-15 April 2018 సంచికలో ప్రచురితం)
http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%97%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e2%80%8c/

వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 6:43 AM
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లను పోస్ట్ చేయి (Atom)

Stat counter

View My Stats

మొత్తం పేజీ వీక్షణలు

బ్లాగు ఆర్కైవ్

  • ►  2022 (1)
    • ►  సెప్టెంబర్ (1)
  • ►  2020 (1)
    • ►  జనవరి (1)
  • ►  2019 (78)
    • ►  డిసెంబర్ (10)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (11)
    • ►  జులై (4)
    • ►  జూన్ (44)
    • ►  ఏప్రిల్ (6)
  • ▼  2018 (47)
    • ►  నవంబర్ (18)
    • ►  జూన్ (2)
    • ►  మే (12)
    • ▼  ఏప్రిల్ (7)
      • తెలంగాణలో కొత్త పార్టీ (16-22 April 2018)
      • బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ (23rd April)
      • మూడో ఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ? (2nd April)
      • తెలంగాణలో మరో కొత్త పార్టీ
      • గుట్టువిప్పిన కాగ్‌
      • స్పీకర్‌ సంచలన నిర్ణయం
      • మూడోఫ్రంట్‌ మూన్నాళ్ల ముచ్చటేనా ?
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (4)
  • ►  2017 (11)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (7)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2016 (17)
    • ►  ఆగస్టు (4)
    • ►  జులై (1)
    • ►  జూన్ (1)
    • ►  మే (3)
    • ►  మార్చి (2)
    • ►  ఫిబ్రవరి (5)
    • ►  జనవరి (1)
  • ►  2015 (17)
    • ►  డిసెంబర్ (3)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (3)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  ఫిబ్రవరి (2)
  • ►  2014 (35)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (1)
    • ►  సెప్టెంబర్ (4)
    • ►  ఆగస్టు (10)
    • ►  జులై (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (1)
  • ►  2013 (17)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (2)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (9)
  • ►  2012 (9)
    • ►  మార్చి (1)
    • ►  జనవరి (8)
  • ►  2011 (4)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (2)

నా గురించి

Sapthagiri
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

FLAG Counter

Flag Counter

ప్రముఖ పోస్ట్‌లు

  • ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!
            ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చ...
  • ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)
    ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం                         - గోపగోని సప్తగిరి, 98850 86126.     భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే...
  • Journalism & Media Glossary
    Journalism, like any profession, has its own language and specialist words which practitioners need to know. The following gl...
  • ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?
        తెలంగాణ   ముఖ్యమంత్రి   కె .  చంద్రశేఖర్ ‌ రావు   మానసపుత్రికగా   చెప్పుకుంటున్న డబుల్ ‌   బెడ్ ‌ రూమ్ ‌   ప్లాట్స్ ‌   పథకం  ...
  • రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం
        సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్ల...
  • రూపాయి - పాపాయి
    ఇదీ వాస్తవం ! చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్ ఇదే యూపీఏ తాజా నినాదమట కానీ చేతులు ఇప్పటికే బొబ...
  • (శీర్షిక లేని)
    పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌ కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశా...
  • అమ్మ..!!?
    అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్...
  • శ్రీ జయనామ సంవత్సర పంచాంగం, రాశి ఫలాలు (2014-15)
    పంచాంగ పీఠిక కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియు...
  • సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
              506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్న...
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.