2, మార్చి 2014, ఆదివారం

మోగనున్న ఎన్నికల నగారా



               సాధారణ ఎన్నికలకు రేపు నగారా మోగనుంది.  రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్‌ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ను వెలువరించనుంది. దీంతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరిచేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోందని సమాచారం. దేశవ్యాప్తంగా ఐదు విడతలుగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. విశ్వసనీయ సమాచారం మేరకు  ఏప్రిల్‌ 16న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి.  మొదటి విడతలో 124 సీట్లకు పోలింగ్‌ జరగనుంది.  ఏప్రిల్‌  22, లేదా 23న 141 సీట్లకు,  ఏప్రిల్‌ 30న 107 సీట్లకు, మే 7న 85 సీట్లకు,  మే 13వ తేదీ 86 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయని సమాచారం. మే 16వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశముంది.  ఏప్రిల్‌ మూడు, నాలుగు తేదీల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 23, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశముంది.  ఉమ్మడి రాష్ట్రంలోనే 294 అసెంబ్లీ సీట్లకు  ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి