తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్ తగిలింది. గులాబీ ముల్లు గుచ్చుకుంటోంది. తెలంగాణ ఇచ్చేసినందున.. ఇక టీఆర్‌ఎస్ తమ పార్టీలో విలీనం అవుతుందనుకున్న కాంగ్రెస్‌పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. విలీనం ప్రసక్తే లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో సరికొత్త యుద్ధం మొదలైంది. ఇంతకాలం వేర్వేరుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఇరు పార్టీల నేతలు ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నారు. మాటల యుద్ధానికి తెరలేపారు. టీఆర్‌ఎస్, టీ-కాంగ్రెస్ నేతల మధ్య నువ్వా.. నేనా అన్నంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు రంజుగా మారాయి. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికలూ ముంచుకొస్తుండటంతో.. పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి