28.9.99
అదొక తీయనైన అనుభూతి
స్వేచ్చా లోకాల్లో పయనించే స్వప్నంలాంటి వాస్తవం
సెలయేరుల గలగలలు
అరణ్య విహంగాల కిలకిలలతో
ఆవరించుకున్న బహు ముచ్చటైన ప్రదేశం
ఆకాశాన్నంటుతున్న కొండల నడుమ
అక్కడక్కడా మానవ నివాసాల స్థావరాలు
కాలుష్యానికి ఇంచైనా స్థానం లేకుండా
నేల అంతా...
పచ్చని రంగుతో పరచుకున్న వృక్షాల సముదాయంతో
ప్రకృతిమాత సృస్టించుకున్న అందం
శాంతికి సాక్ష్యంగా నిలిచే..
ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించడానికి
సరిపోవు వేయి కన్నులున్నా...
అదొక తీయనైన అనుభూతి
స్వేచ్చా లోకాల్లో పయనించే స్వప్నంలాంటి వాస్తవం
సెలయేరుల గలగలలు
అరణ్య విహంగాల కిలకిలలతో
ఆవరించుకున్న బహు ముచ్చటైన ప్రదేశం
ఆకాశాన్నంటుతున్న కొండల నడుమ
అక్కడక్కడా మానవ నివాసాల స్థావరాలు
కాలుష్యానికి ఇంచైనా స్థానం లేకుండా
నేల అంతా...
పచ్చని రంగుతో పరచుకున్న వృక్షాల సముదాయంతో
ప్రకృతిమాత సృస్టించుకున్న అందం
శాంతికి సాక్ష్యంగా నిలిచే..
ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించడానికి
సరిపోవు వేయి కన్నులున్నా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి