మేలుకో.. మేలుకో నవ యువకా మేలుకో
దేశసేవనుద్డరించ నీవు మేలుకో {మేలుకో}
అన్యాయం అక్రమాలనెదుర్కొంటూ అడ్డునిలిచి
నవసమాజ నిర్మాణం స్థాపించగ కదలిరా
అవినీతి దౌర్జన్యం లంచగొండితనాలనూ
తరిమి తరిమి కొట్టుతూ అడుగుముందుకేయరా {మేలుకో}
స్వార్థపరుల చేతుల్లో నలిగిపోయె సామాన్యుల
కన్నేటిని చూసి నీవు జాతిని మేల్కొలపరా
ఇకనైనా నిద్రలేచి నీ తప్పును తెలుసుకొనీ
రాజకీయ రాబందుల ఆటలు కట్టించరా {మేలుకో}
గాంధీజీ కలలుగన్న రామరాజ్యానికీ
ఈ రాజకీయ ద్రోహాన్ని చీల్చి చెండాడరా
రేపటి మన జాతి బ్రతుకు ఏమౌతుందో ఊహించి
రామరాజ్య స్థాపనకై నడుం కట్టి నడవరా {మేలుకో}
- సర్దార్
3.9.97 బుధవారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి